మార్చ్ 2009

విండోస్‌లో తెలుగు టైప్‌ చేయడం

Image
Featured Image
విండోస్ లో అక్షరమాలతో తెలుగు వ్రాయడం చూపించే ప్రతిమ
లక్ష్యం: 

ఇందులో మనం విండోస్ లో తెలుగు వ్రాయడం, అంటే టైప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇదొక్కటి తెలుసుకోవడం వల్ల మీరు ఎంత ఆనందిస్తారో తెలుసుకున్నాక మీరే తెలుసుకుంటారు :) ఆత్మీయులందరితోనూ ఆత్మీయత కలగలపిన తేట తెలుగులో మాటలు/రాతలు పంచుకోవడం కంటేనా? మీ మనోభావాలు, ఆత్మఘర్షణలు అన్నీ బ్లాగుల్లో మోగించేయడానికి ఇది తొలి మెట్టు కాదూ? మొదలెట్టండి మరి!

విండోస్‌ మొత్తం తెలుగులో వాడుకోవడం

Image
Featured Image
తెలుగులోకి మార్చబడిన విండోస్ ఎక్స్.పీ ఆపరేటింగ్ సిస్టమ్‌
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ని తెలుగులోకి ఎలా అనువదించుకోవాలో తెలుసుకుందాం. అంటే ప్రస్తుతానికి ఇంగ్లీషులో కనబడేవన్నీ ఇకపై తెలుగులో కనబడతాయన్నమాట. ఐతే, మీరు ఇంగ్లీషులో రాసుకున్న ఫైల్స్, వాటికి, ఫోల్డర్లకి ఇంగ్లీషులో పెట్టుకున్న పేర్లు వగైరాలు మాత్రం అలాగే ఉంటాయి సుమా! విండోస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడంతోనే వచ్చేవి మాత్రమే అనవదింపబడతాయి. మీరు స్వయంగా తర్వాత రాసుకున్నవి, కాపీ చేసుకున్నవి ఏవీ మారవు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఈ పాఠ్యాంశాన్ని అనుసరించవచ్చు.

లినక్స్ లో తెలుగు టైప్‌ చేయడం

Image
Featured Image
లినక్స్ లో తెలుగు వ్రాయడం చూపించే ప్రతిమ
లక్ష్యం: 

ఇందులో మనం లినక్స్ లో తెలుగు వ్రాయడం, అంటే టైప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇదొక్కటి తెలుసుకోవడం వల్ల మీరు ఎంత ఆనందిస్తారో తెలుసుకున్నాక మీరే తెలుసుకుంటారు :) ఆత్మీయులందరితోనూ ఆత్మీయత కలగలపిన తేట తెలుగులో మాటలు/రాతలు పంచుకోవడం కంటేనా? మీ మనోభావాలు, ఆత్మఘర్షణలు అన్నీ బ్లాగుల్లో మోగించేయడానికి ఇది తొలి మెట్టు కాదూ? మొదలెట్టండి మరి!

లినక్స్ లో తెలుగు చదవడం

Image
Featured Image
లినక్స్ లో తెలుగు చదవడం చూపించే ప్రతిమ
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో లినక్స్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఐతే కొన్ని వర్షన్‌లలో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు బ్రహ్మాండంగా కనబడుతుంది. అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.

భారత నెటిజన్లు!

సంక్షిప్తంగా: 

భారతదేశంలో అంతర్జాల(internet) వాడకం ఎంతవరకు ఉంది, ఆ వాడేవాళ్ళ తీరేంటి.. లాంటి విషయాలపై Juxt Consult వారు ఒక అధ్యయనం చేశారు. దానిలో ముఖ్యంగా మనకు కనబడేవి రెండు వార్తలు. ఒకటి - అంతర్జాలం వాడేవారిలో కేవలం 20% మాత్రమే ఇంగ్లీషు భాషలో చదవడానికి ఇష్టపడతారు. రెండు - నిత్యం అంతర్జాలం వాడేవారిలో 91% మంది ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తారు.

జీ-మెయిల్ లో తెలుగు రాసే సౌలభ్యం

సంక్షిప్తంగా: 

గూగుల్ క్రమంగా తన సేవలన్నిటినీ భారతీయులకి భారతీయ భాషల్లో అందింస్తున్న క్రమంలో జీ-మెయిల్లో లిప్యంతరీకరణ సదుపాయం కల్పించింది(అంటే transliteration సదుపాయం, మన భాషని ఇంగ్లీషు కీబోర్డు సాయంతో టైప్ చేయడం). ఇప్పుడే మీరు మీ జీ-మెయిల్లోకి వెళ్ళి మెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఒక కొత్త బటన్ చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న బొమ్మలో చూపించినట్టు.

మా సంకల్పం - భవిష్యత్ భారతావని!

కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి” అని కలాంగారు మర్చిపోకుండా ఎక్కడికెళ్ళినా చెప్తుంటారు, మనం కలలు కనడం వరకు చెప్పక పోయినా చేసేయొచ్చు, ఆ తర్వాతదే కాస్త ఆలోచిం

విండోస్

ఈ విభాగంలో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ గురించి తెలుసుకోవచ్చు. విండోస్ మీ కంప్యూటర్లో ఎలా స్థాపించుకోవాలి అన్న దగ్గర్నుంచి, విండోస్ లో ఏయో పనులు ఎలా చేసుకోవచ్చు, విండోస్‌లో వివిధ రకాల సాఫ్ట్వేర్లని ఎలా స్థాపించుకోవాని అనే అంశాల వరకు అన్నీ ఇందులో చెప్పబడతాయి. ఒకవేళ ఏదైనా అంశం ఇక్కడ లేకపోయినట్లైతే మీరు మమ్మల్ని సంప్రదించినట్లైతే మేము స్పందిస్తాము.

లినక్స్

ఈ విభాగంలో మీరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ గురించి తెలుసుకోవచ్చు. లినక్స్ మీ కంప్యూటర్లో ఎలా స్థాపించుకోవాలి అన్న దగ్గర్నుంచి, లినక్స్ లో ఏయో పనులు ఎలా చేసుకోవచ్చు, లినక్స్ లో మీ సొంతంగా ఉపకరణాలు తయారుచేసుకోవడం ఎలా అనే అంశాల వరకు అన్నీ ఇందులో చెప్పబడతాయి. ఒకవేళ ఏదైనా అంశం ఇక్కడ లేకపోయినట్లైతే మీరు మమ్మల్ని సంప్రదించినట్లైతే మేము స్పందిస్తాము.

టెక్‌సేతు ఎందుకు, ఎవరికోసం?

ఒక్కమాటలో చెప్పమంటే – “మనకు, మన భవిష్యత్తు తరాలకు - టెక్నాలజీ వైపు నడిచే బాటలో ఒక బాసట - టెక్‌సేతు”.

ఇటీవలి వ్యాఖ్యలు