ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్, ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.
ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు. ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
మీరు హనుమాన్ గేమ్ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.
టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.
ఈ పాఠ్యాంశంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని తెలుగులోకి ఎలా అనువదించుకోవాలో తెలుసుకుందాం. అంటే ప్రస్తుతానికి ఇంగ్లీషులో కనబడేవన్నీ ఇకపై తెలుగులో కనబడతాయన్నమాట. ఐతే, మీరు ఇంగ్లీషులో రాసుకున్న ఫైల్స్, వాటికి, ఫోల్డర్లకి ఇంగ్లీషులో పెట్టుకున్న పేర్లు వగైరాలు మాత్రం అలాగే ఉంటాయి సుమా! విండోస్ ఇన్‌స్టాల్ చేసుకోవడంతోనే వచ్చేవి మాత్రమే అనవదింపబడతాయి. మీరు స్వయంగా తర్వాత రాసుకున్నవి, కాపీ చేసుకున్నవి ఏవీ మారవు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఈ పాఠ్యాంశాన్ని అనుసరించవచ్చు.
ఇందులో మనం లినక్స్ లో తెలుగు వ్రాయడం, అంటే టైప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇదొక్కటి తెలుసుకోవడం వల్ల మీరు ఎంత ఆనందిస్తారో తెలుసుకున్నాక మీరే తెలుసుకుంటారు! మీ మనోభావాలు, ఆత్మఘర్షణలు అన్నీ బ్లాగుల్లో మోగించేయడానికి ఇది తొలి మెట్టు కావచ్చు! మొదలెట్టండి మరి!
ఈ పాఠ్యాంశంలో లినక్స్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఐతే కొన్ని వర్షన్‌లలో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు బ్రహ్మాండంగా కనబడుతుంది. అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.
భారతదేశంలో అంతర్జాల(internet) వాడకం ఎంతవరకు ఉంది, ఆ వాడేవాళ్ళ తీరేంటి.. లాంటి విషయాలపై Juxt Consult వారు ఒక అధ్యయనం చేశారు. దానిలో ముఖ్యంగా మనకు కనబడేవి రెండు వార్తలు. ఒకటి - అంతర్జాలం వాడేవారిలో కేవలం 20% మాత్రమే ఇంగ్లీషు భాషలో చదవడానికి ఇష్టపడతారు. రెండు - నిత్యం అంతర్జాలం వాడేవారిలో 91% మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు.
గూగుల్ క్రమంగా తన సేవలన్నిటినీ భారతీయులకి భారతీయ భాషల్లో అందింస్తున్న క్రమంలో జీ-మెయిల్లో లిప్యంతరీకరణ సదుపాయం కల్పించింది(అంటే transliteration సదుపాయం, మన భాషని ఇంగ్లీషు కీబోర్డు సాయంతో టైప్ చేయడం). ఇప్పుడే మీరు మీ జీ-మెయిల్లోకి వెళ్ళి మెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఒక కొత్త బటన్ చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న బొమ్మలో చూపించినట్టు.
ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.
ఇటీవలి వ్యాఖ్యలు
5 రోజులు 13 గంటలు క్రితం
1 వారం 1 రోజు క్రితం
4 వారాలు 6 రోజులు క్రితం
8 వారాలు 2 రోజులు క్రితం
8 వారాలు 4 రోజులు క్రితం
11 వారాలు 4 రోజులు క్రితం
12 వారాలు 20 గంటలు క్రితం
12 వారాలు 2 రోజులు క్రితం
12 వారాలు 3 రోజులు క్రితం
12 వారాలు 4 రోజులు క్రితం