ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్, ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.
ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు. ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
మీరు హనుమాన్ గేమ్ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.
టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.
తరుచూ వినే ప్రోగ్రాం, ప్రోగ్రామింగ్, ప్రోగ్రామర్ పదాలు ఏం సూచిస్తాయో, వాటి అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ కి వాడే ముఖ్యమైన యంత్రభాషల విశేషాలు కూడా తెలుసుకుందాం.
ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
కంప్యూటర్ వాడేవారిలో ఎక్కువమంది ఎక్కువసేపు వాడే ఉపకరణం - వెబ్ బ్రౌజరు, లేదా, జాల విహారిణి. కాబట్టి, అసలు విహారిణి అంటే ఏంటో, ఎన్ని రకాలున్నాయో, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం!
మొదటి మూడు భాగాలలో, హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది. ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ, మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి (అంటే మన వాడుకలో, ఒళ్ళు దగ్గరపెట్టుకుని :) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే, పార్టిషన్లు సృష్టించడం, సైజు మార్చడం, తొలగించడం.
ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.
ఇటీవలి వ్యాఖ్యలు
1 రోజు 16 గంటలు క్రితం
4 రోజులు 6 గంటలు క్రితం
4 వారాలు 3 రోజులు క్రితం
7 వారాలు 5 రోజులు క్రితం
8 వారాలు 7 గంటలు క్రితం
11 వారాలు 23 గంటలు క్రితం
11 వారాలు 3 రోజులు క్రితం
11 వారాలు 5 రోజులు క్రితం
11 వారాలు 6 రోజులు క్రితం
12 వారాలు 20 గంటలు క్రితం