లినక్సు వాడేవాళ్ళు చాలా విధాలుగా అదృష్టవంతులు. ఈ మాటని దృవీకరిస్తూ ఎన్ని నిజాలు వెలుగులోకి వచ్చినా, మల్టీ మీడియా రంగం లో లినక్సు మీద పడిన "ఎహే, ఆ ఫైల్ లినక్సులో ఆడదురా!" అన్న మచ్చ చెరగడానికి మటుకు చాలా సమయం పట్టింది. పాపం, నిజానికి నిజం ఏంటంటే, మొదట్నుంచి లినక్సు కేకే! కాకపోతే, వాడకం కష్టమై ఆ మచ్చ అలానే ఉండి పోయింది. కాని ఇప్పుడది కాదు పరిస్థితి. ఈ టపాలో లినక్సులో ఇప్పటి ఆడియో ప్లేయర్ల పరిస్థితి సమీక్షిద్దాం.
జిమెయిల్ లో మీరు తెలుగు టైపు చేయడానికి గూగుల్ లిప్యంతరీకరణ పద్దతి వాడారా? ఇప్పుడు అలాంటి పద్దతే డెస్క్టాపు పైన ఏ అప్లికేషను లో ఐనా టైపు చేస్కునే వీలు కల్పిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఒకే మాదిరి అప్లికేషనులు విడుదల చేశాయి.
దేని గురించైనా తెలుసుకోవాలంటే దాని ఆకారం లేదా ప్రవర్తన గూర్చి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే లినక్స్ గూర్చి తెలుసుకోవటానికి దాని డైరెక్టరీ క్రమం గూర్చి తెలుసుకోవటం ఉపయోగకరం. అందులోనూ లినక్స్ కు మరియు విండోస్ కు, వాటి వాటి పొందికలలో చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలకు సంబందించిన దాఖలాలు ఉంటాయో ఈ టపాలో తెలుసుకొందాం.
తరుచూ వినే ప్రోగ్రాం, ప్రోగ్రామింగ్, ప్రోగ్రామర్ పదాలు ఏం సూచిస్తాయో, వాటి అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ కి వాడే ముఖ్యమైన యంత్రభాషల విశేషాలు కూడా తెలుసుకుందాం.
Recent comments
1 week 4 days ago
42 weeks 4 days ago
47 weeks 6 days ago
48 weeks 8 hours ago
49 weeks 6 days ago
1 year 2 weeks ago
1 year 3 weeks ago
1 year 6 weeks ago
1 year 9 weeks ago
1 year 11 weeks ago