టెక్‌సేతు ఎందుకు, ఎవరికోసం?

ఒక్కమాటలో చెప్పమంటే – “మనకు, మన భవిష్యత్తు తరాలకు - టెక్నాలజీ వైపు నడిచే బాటలో ఒక బాసట - టెక్‌సేతు”. మీరు విజన్‌ 2020 అన్న నినాదం వినే ఉంటారు.. అబ్బబ్బే! ఇది రాజకీయాల గురించి కాదు! ఐనా మీకు రాజకీయవేత్తలపై - వారి వాగ్ధానాలపై, ఆ మాటకొస్తే పారిశ్రామికవేత్తలపై – వారి ప్రగల్భాలపై, నమ్మకం ఉండొచ్చు - ఉండకపోవచ్చు.  కానీ, మన అబ్దుల్ కలాం లాంటి వారు సైతం 2020 పై అన్ని ఆశలు కనబరుస్తున్నారంటే ఎందుకో తెలుసుకోవాలిగా మరి? తెలుసుకున్నాంగనకనే ఈ తాపత్రయం. అదేంటంటే - భవిష్యత్ భారతావనిలో మూడింట రెండొతుల మంది యువత కావడమే! కాని...

గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అందులో అత్యధికులు మాతృభాషలో చదివేవారే. మరి ఇంగ్లీషులో మాత్రమే ఉన్న టెక్నాలజీ సమాచారం, పాఠాలు మన తెలుగువారి నోటికి అందకపోతే నష్టమే కదా? టెక్‌సేతు ఆవిర్భావానికి అదే నాంది! ఇంగ్లీషు రాకపోయినా, తెలుగువార్ని ప్రపంచ స్థాయి టెక్నాలజీకి చేరువలో ఉంచడమే మా లక్ష్యం! ఇక్కడ మీరు టెక్నాలజీ గురించిన ఏ పాఠాన్నైనా చదువుకోవచ్చు, సందేహాలుంటే అడగవచ్చు. ఒకవేళ మీక్కావల్సింది ఇక్కడ లేకపోయినా అడగవచ్చు! ఇంకా “తెలుగు భాష లో టెక్నాలజీ ఎందుకు” అంశంపై సమగ్ర విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి.