ఇంతకు ముందు నేను చెప్పిన డౌన్లోడ్ ప్రోగ్రాం కంటే కాస్త మెరుగ్గా ఉండేలా, ఇంకా విండోస్ లో కూడా పని చేసే ప్రోగ్రాం రాసాను. వాడి చూసి, ఏమన్నా సందేహాలుంటే అడగండి.
కొన్నేళ్ళ క్రిందట మన గవర్నమెంట్ వారు కొన్ని విద్యాసంస్థలని అనుసందానించి ఒక బృహత్కార్యానికి పూనుకున్నారు. సాధారణ మానవుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, పుస్తకాలని స్కాన్ చేసి ఆన్ లైన్ లో పెట్టడం అని చెప్పొచ్చు. దానికే, డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా (డి ఎల్ ఐ) అని పేరు. దురదృష్టవశాత్తు ఆ సంబందిత సైటు మటుకు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి పుస్తకాలు దించుకుని PDF కి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా, అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
ఫైళ్ళనూ మరియు ఫోల్డర్లను చూపటానికి లినక్స్ నాటిలస్ ను వాడుతుంది. కాని ఈ నాటిలస్ ప్రస్తుతం డ్రైవ్ ల పేర్లు మార్చటానికి ఉపయోగపడదు. లినక్సులో ఈ సమస్యకు విరుగుడుగా రెండు పరిష్కారాలున్నాయి. ఈ ప్రక్రియలు పెన్ డ్రైవులకు కూడా వర్తిస్తాయి.
డేటాటైపు అంటే ప్రోగ్రాం లో వాడే చరాంశపు ఉనికిలో(properties of a variable) ఒక భాగం. ఈ పాఠ్యాంశంలో ఆ వివరాలు తెలుసుకుని, పైతాన్‌లో వాటిని ఎలా వాడతారో సూచాయగా ఉదాహరణలతో, ప్రయోగాత్మకంగా నేర్చుకుందాం.
లినక్సు వాడేవాళ్ళు చాలా విధాలుగా అదృష్టవంతులు. ఈ మాటని దృవీకరిస్తూ ఎన్ని నిజాలు వెలుగులోకి వచ్చినా, మల్టీ మీడియా రంగం లో లినక్సు మీద పడిన "ఎహే, ఆ ఫైల్ లినక్సులో ఆడదురా!" అన్న మచ్చ చెరగడానికి మటుకు చాలా సమయం పట్టింది. పాపం, నిజానికి నిజం ఏంటంటే, మొదట్నుంచి లినక్సు కేకే! కాకపోతే, వాడకం కష్టమై ఆ మచ్చ అలానే ఉండి పోయింది. కాని ఇప్పుడది కాదు పరిస్థితి. ఈ టపాలో లినక్సులో ఇప్పటి ఆడియో ప్లేయర్ల పరిస్థితి సమీక్షిద్దాం.
జిమెయిల్ లో మీరు తెలుగు టైపు చేయడానికి గూగుల్ లిప్యంతరీకరణ పద్దతి వాడారా? ఇప్పుడు అలాంటి పద్దతే డెస్క్టాపు పైన ఏ అప్లికేషను లో ఐనా టైపు చేస్కునే వీలు కల్పిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఒకే మాదిరి అప్లికేషనులు విడుదల చేశాయి.
ఇటీవలి వ్యాఖ్యలు
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
15 వారాలు 1 రోజు క్రితం
20 వారాలు 4 రోజులు క్రితం
20 వారాలు 5 రోజులు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం