గూగుల్ క్రోమ్‌ విహారిణిలో బుక్‌మార్కు సింక్!

Image
Featured Image
గూగుల్ క్రోమ్‌
గోపాల కృష్ణ కోడూరి
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

గూగుల్ క్రోమ్‌ లో ఇకపై మన బుక్‌మార్కులను సింక్ చేస్కోవచ్చు-అంటే ఎన్ని కలనయంత్రాలు వాడితే అన్నిటి మధ్య బుక్‌మార్కులు ఒకటే ఉండేలా, ఎక్కడ మార్పు చేసిన అన్నిటిల్లోనూ అయ్యేలా చేయవచ్చన్నమాట.

ఫైర్‌ఫాక్స్ , ఒపెరా, జాలవిహారిణి(IE) వంటి విహారిణుల మధ్య  వీలుపడినట్టు, ఇప్పుడు గూగుల్ క్రోమ్‌లో కూడా బుక్‌మార్కులను పలు కలనయంత్రాలమధ్య అనుసందానించేందుకు వీలుపడేలా గూగుల్‌ సంస్థ క్రోమ్‌ డెవలప్‌మెంట్ బ్రాంచ్ లో తెలియజేసింది. ఇప్పటికిప్పుడు సామాన్య జనానికి అందుబాటులో లేకపోయినా, డెవలప్‌మెంట్ బ్రాంచ్ నుండి బయటకి వెలువడడానికి ఎంతో సమయం పట్టదనే అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఉత్సుకత ఉంటే, గూగుల్ క్రోమియం(డెవలపర్లు వాడే క్రోమ్‌) దింపుకుని ప్రయత్నించండి. పెద్ద కష్టమేమీ కాదు. క్రోమియం దింపుకుని, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత క్రోమ్‌ని  మొదలుపెట్టేటప్పుడు  దాన్ని  "--enable-sync" అనే ఆర్గ్యుమెంట్ తో ప్రారంభించాలి.