గూగుల్ ఫాస్ట్ ఫ్లిప్ - న్యూస్ చదవడనికో కొత్త మార్గం

Image
Featured Image
గూగుల్ ఫాస్ట్ ప్లిప్
గోపాలకృష్ణ కోడూరి
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

అంతర్జాలం లో మరింత వేగంగా న్యూస్ చదవడానికి గూగుల్ ప్రవేశ పెట్టిన మరొక (రకమైన) మార్గం.

మీరు ఒక లైబ్రరీ కి వెళ్తే అక్కడున్న మేగాజీన్లన్ని ఒక్కక్కటిగా మొత్తం చదవరు. వాటిలో కొన్ని పేజీలని అటు ఇటు తిప్పి చదవాలనిపిస్తే చదువుతారు, లేదనుకుంటే పక్కన పడేస్తారు. అచ్చం ఇదే సౌకర్యన్ని అంతర్జాలంలో గూగుల్ ప్రవేశపెట్టింది. ఇప్పటికి కొన్ని ఆంగ్ల పత్రికలతోనూ, కొన్ని వార్తల బ్లాగులతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి లిస్టు ఇక్కడ చూడవచ్చు. అన్నిటికంటే నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే, మనకి నచ్చిన విషయం గురించిన పదాలు ఆ శోదన పెట్టెలో టైపు చేస్తే, దానికి సంబంచిన వార్తలు అన్నిటిని మనం ఫ్లిప్ చేస్కునే అవకాశం కల్పించడం. ఉదాహరణకి, క్రికెట్ గురించి ఏమేమి వార్తలు ఉన్నాయో తెలుసుకుని వాటిని సరదాగా అలా ఫ్లిప్ చేయాలనుకుంటే cricket అని ఆ పెట్టెలో టైపు చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు cricket గురించి ఏయే పేపర్లలో వచ్చిందో ఆ పెజీలు మాత్రమే మనకిచూపిస్తుంది.

బావుంది కదూ! ఇక్కడకు వెళ్ళి ప్రయత్నించండి. :)

ఇటీవలి వ్యాఖ్యలు