గూగుల్ మ్యాపులతో భారత్ లో దిశానిర్థేశాలు

Image
Featured Image
గూగుల్ మ్యాపులు
గోపాలకృష్ణ
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు.  ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఉదాహరణకి, నేను గచ్చిబౌలి నుండి నాంపల్లి వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాపుల్లో ఆ వివరాలు అడిగితే అదుగో ఆ పక్క బొమ్మలో చూపిన వివరాలన్ని ఇస్తుంది. ఈ లింకుకి వెళ్ళిఅక్కడ శోధన బాక్సులో gachibowli, hyderabad to nampally, hyderabad అని టైప్ చేస్తే ఈ వివరాలిస్తుంది. అలాగే‌మీరు వేర్వేరు పట్టణాలకి కూడా రూటు, దూరం వివరాలు కనుక్కోవచ్చు.