జిస్ట్ - మీ ఆన్లైన్ జీవితానికి అద్దం!

Image
Featured Image
జిస్ట్
జిస్ట్ సంస్థ
http://gist.com
సంక్షిప్తంగా: 

మీరు ఆన్లైన్ లో ఎన్నో రకాలుగా ఎన్నో పనులు చేస్తుంటారు. జిమెయిల్, ట్విట్టర్, పేస్ బుక్, లింక్డ్ ఇన్ లాంటి ఎన్నోవాటిల్లో ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వీటన్నినిటిలో ఉన్న సమాచారాన్ని కూడదీసుకుని, అన్నిటిని ఒక్క తాటిపై కలుపుతూ మన పరిచయాల్ని, పనుల్ని క్రమబద్దీకరించుకోవడానికి జిస్ట్ ఒక మంచి మర్గంలా తోస్తుంది!

క్రమబద్దీకరించుకోవడం అంటే? ఏం చేస్తుంది? మీరు నిత్యం మాట్లాడుతూ ఉండే ఒక వ్యక్తి గురించి మరింత సమాచారాన్ని పోగుచేసి అందిస్తుంది. అంటే అతను/ఆమె ఏ కంపెనీ లో పనిస్తున్నారు, వారి సైట్ ఏంటి, ఈ మధ్య ఆన్లైన్ లో ఏమన్నా కార్యక్రమాల్లో గాని, వార్తల్లో గాని వారి ప్రస్తావన వచ్చిందా.. ఇలాంటివన్నీను. ఇంకా ఎవరి దగ్గరి నుంచి వచ్చిన మెయిల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో మనం నిర్దేశించే అవకాశం ఇస్తుంది. ఇలా మొత్తం మీద మన పరిచయాల గురించి మన దగ్గరున్న సమాచారాన్ని మరింత తేలికగా గమనించేందుకు వీలుగా మన ముందు ఉంచుతుంది. మీకున్న తక్కువ వ్యవధిలో అన్నీ చుస్కోలేకపోవచ్చు కాబట్టి  మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వివరాలు మాత్రమే సునాయాసంగా పొందగలుగుతారు. అదీసంగతి.ఇదీ లింకు!

ఇటీవలి వ్యాఖ్యలు