పికాసా 3.5 - కొత్త హంగులతో!

Image
Featured Image
పికాసా
గూగుల్
పికాసా లోగో (సిస్టం ఫైల్స్)
సంక్షిప్తంగా: 

పికాసా అంటే మన ఫోటో కలెక్షన్లని నిర్వహించుకోవడానికి వాడే సాధనం. ఇప్పుడే విడుదలైన పికాసా 3.5 మీ ఫోటోలన్నిటిలోనూ ఉన్న మనుషుల మొహాలు గుర్తుపట్టి వారిని టాగ్ చేసే అవకాశం ఇస్తుంది! ఇది చాలా చాలా ఉపయోగకరం! జయహో గూగుల్!

కొత్త ఫీఛర్లు

  • మనుషుల మొహాలు గుర్తుపట్టి, వారి మొహాల ఫోటోలు "Unnamed faces" అని పక్కపట్టీలో పెడుతుంది. అక్కడికి వెళ్లి, మనం వాళ్ళ పేర్లు రాసేయొచ్చు ఈ రాయడం కూడా చాలా సులువు. మీరు పికాసా లో మీ గూగుల్ ఎకౌంటు లోకి లాగిన్ ఐతే, మీరు టైపు చేస్తున్నప్పుడే వాళ్ళ పేర్లు ఇచ్చేస్తుంది, జిమెయిల్ లో లాగా. ఇంకా, ఒకేలా ఉన్న మొహాలన్నీ కనిపెట్టి వాటన్నిటికి ఒకేసారి పేరు పెట్టే వీలు కూడా ఉంది! ఇది నామమాత్రంగా పెట్టలేదండోయ్, నేను కుడా ప్రయత్నించాను, చాలా చాలా బాగా పనిచేస్తోంది!
  • అలా కొన్ని ఫోటోలు ట్యాగ్ చేసిన తర్వాత పలానా అతను/ఆమె ఉన్న ఫోటోలు మాత్రమే చూపించమనొచ్చు, లేదా వాళ్ళ ఫోటోల తోనే ఒక collage తయారు చేయమనొచ్చు.
  • గూగుల్ మ్యాప్స్ ద్వారా, మీరు ఆ ఫోటోలు ఎక్కడ తీసారన్న విషయం కూడా స్టోర్ చేస్కోవచ్చు.
  • ఇక ఫోటోలని కెమెరా నుంచి ఇంపోర్ట్ చేస్కోవడానికి ఇప్పుడు సులభతరమైన మార్గం ఉంది. అలాగే, అప్లోడ్ చేసేటప్పుడే ఎవరితో పంచుకోవాలన్న విషయం, అది మనకిష్టమైన ఫోటో ఐతే నక్షత్రమ్ గుర్తు పెట్టుకోవడం లాంటివి కూడా చేర్చారు.

ఇది తొలుత ఆర్కుట్లో ప్రవేశ పెట్టిన ఫీచరే ఐనా, మొత్తానికి ఇది పికాసాకి ఒక పెద్ద తాజకరణే! ఇక్కడినుంచి పికాసా దించుకుని తప్పకుండ ప్రయత్నించండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది! వాడే కొద్దీ ఈ ఫీచర్ విలువ తెలుస్తుంది. ఇక్కడున్న వీడియోలో పైన చెప్పినవన్నీ వాడటం ఎలాగో చెప్పారు. వీడియో ఇంగ్లీషులో ఉంది.

ఇటీవలి వ్యాఖ్యలు