లినక్స్ పిజియన్ లో ఇప్పుడు వీడియో, మాటలు కూడా!

Image
Featured Image
పిజియన్
వికిమీడియా
http://upload.wikimedia.org/wikipedia/commons/6/63/Pidgin_logo.png
సంక్షిప్తంగా: 

ఎప్పటినుంచో అందరూ పడిగాపులుగాస్తున్న "లినక్స్ లో గూగుల్ టాక్" అనే సమస్యకు చివరికి పరిష్కారం దొరికింది! లినక్స్ లో పిజియన్(pidgin) లో ఇప్పుడు ఆ సౌలభ్యం ఉంది!

లినక్స్ లో విండోస్‌లో లాగా గూగుల్ టాక్ లో మాట్లాడుకోవడం ఇప్పటివరకు కొన్ని సాంకేతిక కొరతలవల్ల కుదరని విషయంలా ఉండిపోయింది. లిబ్‌పర్పుల్‌ తాజాకరించడంతో ఇవ్వాళే పిజియన్‌ టీం వారు లినక్స్ పిజియన్‌లో ఆ సౌకర్యం కల్పిస్తూ పిజియన్‌ ని నవీకరించారు. అప్పుడే మీరు వాడుతున్న లినక్స్ ల లోకి ఈ నవీకరణలురాకపోవచ్చు. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే, ఉబుంటు వాడే వారైతే ఈ క్రింది చెప్పినట్టుగా చేయాలి.

sudo echo "deb http://ppa.launchpad.net/pidgin-developers/ppa/ubuntu   hardy main" >> /etc/apt/sources.list

sudo apt-key adv --recv-keys --keyserver keyserver.ubuntu.com 67265eb522bdd6b1c69e66ed7fb8bee0a1f196a8

sudo apt-get update

sudo apt-get upgrade pidgin

హట్! మాకు ఇవన్నీ ఎందుకోయ్? ఎక్కడుంటుందో చెప్పు, తెచ్చుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటాం అంటే, అలా కూడా చేస్కోవచ్చు. ఆ ప్యాకేజీలన్నీ ఇక్కడ దొరుకుతాయి.

ఒకవేళ మీరు ఫెడోరా వాడుతున్నట్లైతే ఫెడోరా 7 వరకు ఈ రిపాజిటరీ ని దింపుకుని /etc/yum.repos.d/ లో పెట్టేసి ఈ క్రింది చెప్పిన కమాండ్ ని రన్ చెయ్యాలి.

yum install pidgin

ఒకవేళ మీరు ఫెడోరా 8 లేదా ఆ తర్వాతి వర్షన్ని గాని వాడుతుంటే ఫెడోరా వాళ్ళు పిజియన్ ని వాళ్ళ పేకేజీలలో విడుదల చేసేదాకా ఆగి అవి వచ్చిన తర్వాత చేసుకోవల్సిందే. అంతేనండీ! ఇక హాయిగా స్నేహితులతో, కుటుంబసభ్యులతో వారిని వీడియోలో చూస్తూ మాట్లాడుకోవచ్చు!

నోట్: ప్రస్తుతానికి చాట్ చేసేటప్పుడు వీడియోకి, టాక్‌కి ఎటువంటి సపోర్ట్ ఉన్నట్టు చూపించట్లేదు, కాని ఉంది. గూగుల్ టాక్ లో లాగా వాడుకోవడానికి కొన్నిరోజులు ఆగాలి, అది ఎంతోకాలం పట్టదనే ఆశిద్దాం :)

 

ఇటీవలి వ్యాఖ్యలు