జీ-మెయిల్ లో తెలుగు రాసే సౌలభ్యం

Image
Featured Image
జీ-మెయిల్లో తెలుగు
గోపాలకృష్ణ
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

గూగుల్ క్రమంగా తన సేవలన్నిటినీ భారతీయులకి భారతీయ భాషల్లో అందింస్తున్న క్రమంలో జీ-మెయిల్లో లిప్యంతరీకరణ సదుపాయం కల్పించింది(అంటే transliteration సదుపాయం, మన భాషని ఇంగ్లీషు కీబోర్డు సాయంతో టైప్ చేయడం). ఇప్పుడే మీరు మీ జీ-మెయిల్లోకి వెళ్ళి మెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఒక కొత్త బటన్ చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న బొమ్మలో చూపించినట్టు.

ఇప్పుడు మీరు అలా అలా ఇంగ్లీషులో తెలుగు టైపు చేసేస్తే, గూగుల్ ఇలా ఇలా తెలుగు లిపి లోకి మార్చేస్తుంది. ఇక మీరు ఎక్కడ, ఎవరి కంప్యూటర్ లో జీ-మెయిల్ వాడాల్సి వచ్చిన, "అరరే దీంట్లో తెలుగు టైపింగ్ కి సౌలభ్యం లేదే" అనే గొడవుండదు. మీకు ఒకవేళ ఆ బటన్ కనిపించకపోతే ఇలా చేయండి. సెట్టింగుల్లో(Settings) > సాధారణలో(General) > భాష(Language) క్రింద, transliteration/లిప్యంతరీకరణ enable చేయమని ఉంటుంది. చేసేసి, తెలుగు ఎంచుకోండి. సెట్టింగులు సేవ్ చేసేయ్యండి. అంతే! ఇక తెలుగులో మెయిల్స్ రాయడం మొదలు పెట్టండి!

వ్యాఖ్యలు

Gmail chat lo telugu lo type

Gmail chat lo telugu lo type cheyyavachaa?

చెయ్యొచ్చు, కానీ ఈ పద్దతిలో

చెయ్యొచ్చు, కానీ ఈ పద్దతిలో ఐతే కాదు(ప్రస్తుతానికి). మామూలుగా ప్రతిచోటా తెలుగులో టైప్ చేయడానికి ఇక్కడున్న పాఠ్యాంశం చూస్తే తెలుస్తుంది. కానీ టైప్ చేసే పద్దతిలో కొద్దిగా మార్పుంది. అది ఆయా ఉపకరణాల సైట్లలోనే చెప్పబడింది.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.