- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
మైక్రోసాఫ్ట్ యాంటీ వైరస్ ఉచితంగా లభిస్తుంది
సంక్షిప్తంగా:
ఇటీవలే మైక్రోసాఫ్ట్ వారు, సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ పేరుతో యాంటీ వైరస్ ని విడుదల చేశారు. ఇది కూడా అన్ని యాంటీ వైరస్ ల లాగే పనిచేస్తుంది. కాకపోతే ఇది ఉచితం కూడాను.
మీరు ప్రయత్నించాలి లేదా వాడాలనుకుంటే ఇక్కడకు వెళ్ళి డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఒక ప్రయోజనమేంటంటే మైక్రోసాఫ్ట్ వారిదే కాబట్టి మామూలు సిస్టం తాజాకరణలతో పాటు ఇది కూడా ఆటోమేటిక్ గా తాజాకరించబడుతుంది. ఇంకా దీనితో సిస్టం రిస్టోర్ పాయింట్లను ఏర్పాటు చేస్కోవచ్చు. ఈ పని మామూలుగా ఇది లేకపోయినా చేస్కోవచ్చుగని దీనితో అనుసందానించడం వల్ల ఉపయోగమేగాని పోయేదేమీ లేదు. ఇవిగో కొన్ని తెరపట్లు.



ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న యాంటివైరస్ లలో కొన్ని ఉచితంగా కూడా లభిస్తున్నాయి. ఉదాహరణకి AVG free ఒకటి. ముఖ్యంగా యాంటీ వైరస్ లు వాడేటప్పుడు వచ్చే ఇబ్బంది అవి CPU, మెమరీ లను మరీ అతిగా వాడేసి సిస్టం ని నెమ్మది చేసేయ్యడమే. కానీ ప్రయత్నించిన మేరకు సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ ఈ విషయంలో పర్వాలేదనే చెప్పొచ్చు. AVG free కూడా బాగానే ఉంటుంది. మా సిస్టం మీద సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ ప్రయత్నించగా, ఇదిగో ఈ క్రింద చూపిన విధంగా సిస్టం రిసోర్స్ లను వినియోగించుకుంటుంది. మొత్తానికి 35% CPU(ఇంటెల్ కోర్ 2 డ్యుయో 2.0 Ghz) ని, 50 మెగాబైట్ల వరకు మెమరీ ని తీస్కుంటుంది.
![]()
![]()
అసలు యాంటీ వైరస్ అవసరమా అని మీకు అనిపిస్తే, ఎందుకు అవసరమో తెలుసుకోవాడానికి ఇది చూడండి.


వ్యాఖ్యలు
లినక్స్ లో వైరస్ పట్టే
లినక్స్ లో వైరస్ పట్టే అవకాశాలు తక్కువే. ఎందుకంటే లినక్స్ లో ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ నిర్ణీత రూట్ డెస్టినేషన్ లో ఇన్స్టాల్ అయితేనే పని చేస్తాయి. వైరస్ లు సాధారణంగా ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ లో లేదా స్క్రిప్ట్ ఫైల్స్ లో ఉంటాయి. విండోస్ లో ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ ఏ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేసినా రన్ అవుతాయి. అందుకే విండోస్ లో వైరస్ అవకాశాలు ఎక్కువ. MS DOSలో కూడా వైరస్ అవకాశాలు ఎక్కువ. విండోస్ & MS DOSలో కమాండ్ ఫైల్స్ రూపంలో కూడా వైరస్ రాగలదు. చిన్నప్పుడు MS DOSలో వైరస్ తొలిగించడానికి Nashot antivirus వాడేవాళ్ళం.
కొత్త వ్యాఖ్య వ్రాయి