- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ఉబుంటులో సంకేతపదం మర్చిపోతే ఎలా?
లక్ష్యం:
మీరు ఉబుంటు స్థాపించారు. అంతా బాగానే ఉంది, కానీ ఒక రోజు అకస్మాత్తుగా సంకేత పదాన్ని(password) మర్చిపోయారు.
ఇప్పుడెలా?
ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునేందుకు ఒక మార్గం ఉంది. ఇది ఆపాత్కాలంలో తప్ప ఊరికే వాడరాదనే చిన్న ప్రతిజ్ఞ చేసి అప్పుడు ప్రయోగించండి. మీరు susan అన్న వాడుకరిగా ఉన్నారు మీ సంకేత పదం మరిచారు
ఇక ఉబుంటు మొదలవగానే వచ్చే ఈ కింది తెర (దీనినే గ్రబ్ లోడర్ తెర అందురు) లో సాధారణంగా వాడే మొదటి ఎంపిక బదులు రెండో ఎంపికను ఎంచి లోనికి ప్రవేశించండి.

తరువాత వచ్చే జాబితా లో root - Drop to root Shell option అన్నా ఐచ్ఛికాన్ని ఎంపిక చెయ్యండి. రూట్ అనగా మూల వాడుకరి మీ ఉబుంటు యంత్రానికి అన్ని అధికారాలు గల బాధ్యతగల వాడుకరి, అందుకని root గా మీరు యంత్రాన్ని వాడేప్పుడు కొంచెం జాగ్రత్త!

ఒకసారి వరుసగా వాడిన కమాండ్లను (ఆజ్ఞలను) గమనిద్దాం. మొదట /home లోని వాడుకర్లనందరినీ ls ద్వారా చూసాం
root@......:~#ls /home
ఈ కమాండుకు మీ యంత్రం లో గల వాడుకర్ల జాబిత జవాబుగా వస్తుంది, పైన ఉదాహరణ లో susan అని నీలం లో ఉన్నది ఆ యంత్రపు వాడుకరి. తరువాత passwd కమాండ్ ద్వరా మనం వాడుకరి సంకేత పదాన్ని మార్పిడి చేస్తాం. ఇందుకు ఆజ్ఞ : passwd వాడుకరిపేరు,
ఉదాహరణకు
root@......:~# passwd susan
ఆ పై రెండు సార్లు మీరు కొత్త సంకేత పదాన్ని అందిస్తే మీ సంకేత పదం కొత్త పదంతో మారిపోతుంది. ఆ తర్వాత నిష్క్రమించడానికి exit ను వాడండి.
root@....:~# exit
ఆ పై మూడవ చిత్రంలో చూపిన విధంగా resume Resume normal boot ఎంచుకోండి లేదా యంత్రాన్ని ఒకసారి రీస్టార్ట్ చెయ్యండి.

ఇలా మీరు మర్చిపోయిన పక్షంలో చాలా సులువుగా మీ సంకేత పదాన్ని పునరుద్ధరించవచ్చు!


వ్యాఖ్యలు
nenu ubuntu 10.10
nenu ubuntu 10.10 vaaduthunanu yantrmu modalapettagane vache modati line ni enter chgeyagane kernal command vasthundi kernel debbathinadi anukunnanu marala update chesina raavatledu nenu marala pondali ante emi cheyali.
అక్కడ ఏమని రాసుందో యధాతదంగా
అక్కడ ఏమని రాసుందో యధాతదంగా చెప్పగలరా? పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను..
కొత్త వ్యాఖ్య వ్రాయి