ఉబుంటులో సంకేతపదం మర్చిపోతే ఎలా?

Image
Featured Image
లక్ష్యం: 

మీరు ఉబుంటు స్థాపించారు.  అంతా బాగానే ఉంది, కానీ ఒక రోజు అకస్మాత్తుగా సంకేత పదాన్ని(password) మర్చిపోయారు.

ఇప్పుడెలా?

 

ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునేందుకు ఒక మార్గం ఉంది. ఇది ఆపాత్కాలంలో తప్ప ఊరికే వాడరాదనే చిన్న ప్రతిజ్ఞ చేసి అప్పుడు ప్రయోగించండి. మీరు susan అన్న వాడుకరిగా ఉన్నారు మీ సంకేత పదం మరిచారు 

ఇక ఉబుంటు మొదలవగానే వచ్చే ఈ కింది తెర (దీనినే గ్రబ్ లోడర్ తెర అందురు) లో సాధారణంగా వాడే మొదటి ఎంపిక బదులు రెండో ఎంపికను ఎంచి లోనికి ప్రవేశించండి.

తరువాత వచ్చే జాబితా లో root - Drop to root Shell option అన్నా ఐచ్ఛికాన్ని ఎంపిక చెయ్యండి. రూట్ అనగా మూల వాడుకరి మీ ఉబుంటు యంత్రానికి అన్ని అధికారాలు గల బాధ్యతగల వాడుకరి, అందుకని root గా మీరు యంత్రాన్ని వాడేప్పుడు కొంచెం జాగ్రత్త!

ఒకసారి వరుసగా వాడిన కమాండ్లను (ఆజ్ఞలను) గమనిద్దాం. మొదట /home లోని వాడుకర్లనందరినీ ls ద్వారా చూసాం

root@......:~#ls /home

ఈ కమాండుకు మీ యంత్రం లో గల వాడుకర్ల జాబిత జవాబుగా వస్తుంది, పైన ఉదాహరణ లో susan అని నీలం లో ఉన్నది ఆ యంత్రపు వాడుకరి. తరువాత passwd కమాండ్ ద్వరా మనం వాడుకరి సంకేత పదాన్ని మార్పిడి చేస్తాం. ఇందుకు ఆజ్ఞ : passwd వాడుకరిపేరు, 

ఉదాహరణకు 

root@......:~# passwd susan

ఆ పై రెండు సార్లు మీరు కొత్త సంకేత పదాన్ని అందిస్తే మీ సంకేత పదం కొత్త పదంతో మారిపోతుంది. ఆ తర్వాత నిష్క్రమించడానికి exit ను వాడండి.

root@....:~# exit

ఆ పై మూడవ చిత్రంలో చూపిన విధంగా resume Resume normal boot ఎంచుకోండి లేదా యంత్రాన్ని ఒకసారి రీస్టార్ట్ చెయ్యండి. 

ఇలా మీరు మర్చిపోయిన పక్షంలో చాలా సులువుగా మీ సంకేత పదాన్ని పునరుద్ధరించవచ్చు!

 

వ్యాఖ్యలు

nenu ubuntu 10.10

nenu ubuntu 10.10 vaaduthunanu yantrmu modalapettagane vache modati line ni enter chgeyagane kernal command vasthundi kernel debbathinadi anukunnanu marala update chesina raavatledu nenu marala pondali ante emi cheyali.

అక్కడ ఏమని రాసుందో యధాతదంగా

అక్కడ ఏమని రాసుందో యధాతదంగా చెప్పగలరా? పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను..

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.