- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్‌వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
క్లౌడ్ కంప్యూటింగ్ అనగా ఏమిటి?
లక్ష్యం:
క్లౌడ్ కంప్యూటింగ్ అనగా ఏమిటి అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకొంటారు.
ఇది ఎక్కడో విన్నట్టుంది కదూ!!
దీనిని గత శతాబ్దములోనే ప్రవేశ పెట్టారు. కానీ పెద్ద గుర్తింపు రాలేదు.
కానీ ఇప్పుడిప్పుడే దీని విసిస్టత గ్రహించి పెద్ద పెద్ద కంపెనీలు దీనిని వాడటం మొదలు పెడుతున్నాయి.
ఇందులో 3 రకముల ఉపయోగాలున్నాయి.
1. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్విస్.
2. హార్డ్‌వేర్ యాజ్ ఎ సర్విస్.
3. డేటాబేస్ యాజ్ ఎ సర్విస్.
దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారంటే…
క్లౌడ్ అనేది సామాన్యంగా ఇంటెర్నెట్‌ను సూచించటానికి వాడతారు. ఇలా ఇంటెర్నెట్ నుండి కంప్యుటేషన్ శక్తిని వాడుకోవటం వలన దీనికి ఈ పేరు పెట్టారు.
ఇక అసలు విషయానికి వస్తే….
1. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్విస్ :
మనం వాడే సోఫ్టేవేర్లు చాలా వరకు కొనవలసి ఉంటుంది. ఇక చిన్నా పెద్ద కంపెనీల విషయానికొస్తే వాళ్ళు వీటి కోసం కొన్ని కోట్లు కర్చు పెట్టవలసి ఉంటుంది. మనం మాట్లాడుతున్న క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇంటెర్నెట్‌లో సాఫ్ట్‌వేర్ను ఉంచి, దానిని వాడిన వారికి గంటకు(ఉదాహరణకు) ఇంత అని బిల్లు వేయటం ద్వారా ఇది ఇరు వర్గాలకు లాభదాయకమవుతుంది. దీనికి ఉదాహరణ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైవ్( Microsoft Office Live). ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లు వాడవచ్చు, కానీ కొన్ని అవసరాల్లో ప్రోప్రైటరీ సాఫ్ట్‌వేర్లది పై చేయి కావచ్చు. మనం ఇంట్లో బల్బు వేసినప్పుడు మీటర్ తిరుగుతుంది వాడనప్పుడు డబ్బు కట్టనవసరం లేదు.
2. హార్డ్‌వేర్ యాజ్ ఎ సర్విస్ :
ఒక వేళ మన వెబ్‌సైట్ పగటి వేళల ఎక్కువగా రాత్రి వేళల తక్కువగా వాడుతున్నటైతే మనకు రాత్రి వేళల ఎక్కువ సర్వర్లు అవసరం ఉండవు కానీ మనం వాటిని కొన్నాం కాబట్టి అవి మన ఆఫీస్లో ఉంటాయి. కొద్ది రోజుల తరువాత మన దగ్గర ఉన్న వాటి కన్నా మంచి సర్వర్లు మార్కెట్లోకి వస్తే మనం అవసరాన్ని బట్టి వాటిని కొని వీటిని పక్కన పడేయాల్సి ఉంటుంది. కానీ మనం క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ‘హార్డ్‌వేర్ యాజ్ ఎ సర్విస్’ మహత్యంతో కావలసినప్పుడు ఇంటెర్నెట్ నుండి కావలసినంత కంప్యుటేషన్ శక్తిని పొందవచ్చు, అవసరం లేదనుకుంటే తిరిగి అప్పజెప్పవచ్చు. ఇంటి నుండి బుస్‌స్టండ్కు వెళ్ళాలంటే ఆటో ఎక్కి మీటర్ బిల్లు కడితే చాలు, ఆటో కొనవలసిన అవసరం లేదు కదా..
3. డేటాబేస్ యాజ్ ఎ సర్విస్ :
ఎలాగైతే విహరయాత్రకు వెళ్ళినప్పుడు హోటెల్ రూమ్ కొనకుండా రెంట్ మాత్రమే కట్టి వస్తామో, అలాగే అవసరమైనంత డిస్క్ స్పేస్ను అవసరమైనప్పుడు మాత్రమే వాడవచ్చు. వాడిన దానికి మాత్రమే రెంట్ కడితే చాలు…
భవిష్యత్తులో లాప్‌టాప్‌లకూ కంప్యూటర్లకూ కాలం చెల్లిపోయి, ఒక కోత పరికరం రావచ్చు, దాని ప్రత్యేకత ఏమిటంటే, ఆ పరికరమును ఆన్ చెయ్యగానే ఆది ఇంటెర్నెట్‌కు కనెక్ట్ అయ్యి మన కంప్యూటర్ను ఎక్కడో స్టార్ట్ చేస్తుంది, అక్కడేం జరుగుతుందో మనకు ఈ పరికరం యొక్క స్క్రీన్ పై కనబడుతుంది. ఈ పరికరంలో కేవలం ఒక స్క్రీన్ కీబోర్డ్ మౌస్ మరియు ఇంటెర్నెట్ను సంప్రదించగల పరిజ్ఞానం ఉంటాయి. కావున ఇది చాలా తక్కువ దారకే అందించవచ్చు.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి



డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
15 వారాలు 1 రోజు క్రితం
20 వారాలు 4 రోజులు క్రితం
20 వారాలు 5 రోజులు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం