- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
జీ-మెయిల్ లో వీడియో లేదా ఆడియో చాట్ చేయటం ఎలా?
లక్ష్యం:
ఎవరైనా అందుబాటులో లేని వ్యక్తి తో మాట్లాడాలంటే మనం ఫోన్ వాడుతాం. కానీ ఆందులో కేవలం మాటలు మాత్రమే వినపడుతాయి, మనిషి కనపడరు! అదే ఇతర దేశాలకు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక వేళ ఇంటర్నెట్ ఉంటే, ఈ పని ఏమాత్రం ఖర్చు లేకుండా* చేయవచ్చు, పైగా అవతలి వ్యక్తి కనపడుతారు కూడా.
ఇందుకు ఇరు వైపులా కావలసినవి :
- ఇంటర్నెట్ (అన్ లిమిటెడ్ ప్లాన్ ఐతే మంచిది)
- జీ-మెయిల్ అకౌంట్.
- వీడియో కెమెరా, మైకు ఉన్న హెడ్ పో్న్లు (ఈ మూడూ, ప్రస్తుతం వచ్చే లాప్ టాప్ లతో సహా వస్తున్నయి).
వాడటం :
- ఈ లంకె ను వాడి, జీ-మెయిల్ లోకి లాగిన్ అవ్వండి.
- ఇందులో ఎడమ వైపు క్రింది బాగం లో, బొమ్మ లో చూపిన విదంగా ఉంటుంది.


- ప్రస్తుతం లాగిన్ అయ్యిన మీ స్నేహితుల పేరు పక్కనే ఉన్న గుర్తులు క్రింద చూపిన చిత్రం లో లాగా ఉంటాయి. ఇందులో ఎవరు వీడియో చాట్ వాడగలరో ఆ గుర్తు చూసి కనిపెట్టవచ్చు.
- వారి పేరు మీదకు మౌస్ తీసుకెళ్ళి "video & more" అన్న బటన్ మీద క్లిక్ చేసి "Start Video Chat" ను క్లిక్ చేయండి.

వారు కాల్ Accept చేయగానే ఇక మీరు ఒకరినొకరు వీడియో లో చూస్తూ మాట్లాడవచ్చు.
ఫుల్ స్క్రీన్ కావాలంటే వారి బొమ్మ పైకి మౌస్ తీసుకెళ్ళగానే ఫుల్ స్క్రీన్ బటన్ ఒకటి వస్తుంది. దాన్ని నొక్కగానే వీడియో ఫుల్ స్క్రీన్ అవుతుంది.
అదే బొమ్మలో, మీరు అవతలి వ్యక్తికి ఎలా కనిపిస్తారో కూడా చూపుతుంది. End బటన్ నొక్కగానే కాల్ కట్ అవుతుంది.
ఒక వేళ మీకు ఎవరైనా కాల్ చేయగానే "Accept" "Deny" అని రెండు బటన్ లు వస్తాయి. Accept ను నొక్కితే కాల్ మాట్లాడ వచ్చు, Deny నొక్కితే కాల్ కట్ అవుతుంది.
ఆడియో చాట్ కోసం ఫోన్ గుర్తు ఉన్న బటన్‌ను నొక్కితే సరిపోతుంది.


వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి