టెర్మినల్ అనగా ఏమిటి?

Image
Featured Image
టెర్మినల్
గవేష్
లక్ష్యం: 

టెర్మినల్ ఎందుకు?

ఎలా తెరవాలి?

అందులో ఏమేమి చేయవచ్చు అన్న విషయానికి ఉదాహరణ ఇక్కడ తెలుసుకుందాం.

 

టెర్మినల్ని కన్సోల్ అని కూడా అనవచ్చు. లినక్స్ లో ప్రతి పనినీ చెయ్యటానికి దీనిని వాడవచ్చు. ఇందులో ఒక్కొక్క పనికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమాండ్లను కలిపి వాడవలసి ఉంటుంది.

టెర్మినల్ని తెరవటం ఎలా?

Alt + F2 నొక్కగానే ఒక చిన్న విండొ వస్తుంది. అక్కడ gnome-terminal అని టైప్ చేసి Enter నొక్కండి, టెర్మినల్ తెరుచుకుంటుంది.

ఉదాహరణ :

మౌస్ తో లేదా గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్(GUI) తో  చేసే ప్రతి పనీ ఇందులో చెయ్యవచ్చు. కొన్ని పనులు పదే పదే చేయవలసిన అవసరం ఉంటుంది, వీటిని సునాయాసంగా టెర్మినల్ కమాండ్ల తో చెయ్యవచ్చు.

ఉదాహరణకు మీ కంప్యూటర్‌లో చిందరవందరగా ఏ డ్రైవ్‌లో అంటే ఆ డ్రైవ్‌లో పడి ఉన్న పాటలన్నింటినీ లేదా ఫోటోలన్నింటినీ ఒకే చోటకు చేర్చాలి. మామూలుగా చేస్తే దీనికి చాలా సమయం పడుతుంది (2 లేదా 3 గంటలు).

అదే టెర్మినల్ సాయంతో మన ప్రమేయం లేకుండా, దానంతటదే మన పాటలన్నింటినీ 10నిమిషాల్లో ఒకే చోటికి చేరుస్తుంది. ఇలా మనం ఊహించగలిగినది ఏదైనా చేయవచ్చు.

 

వ్యాఖ్యలు

చక్కటి సమాచారం అందించారు.

చక్కటి సమాచారం అందించారు. ధన్యవాదాలు.

చక్కని సమాచారం :) కొన్ని

చక్కని సమాచారం :)
కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా ! ఏమయినా మంచి ప్రయత్నం.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.