- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
నెట్వర్క్ ఫైల్ షేరింగ్ (NFS) ద్వారా వివిధ కంప్యూటర్ల మధ్య ఫైళ్ళను పంచుకోవడం
లక్ష్యం:
నిత్యం ఒక కంప్యూటర్ మీద పని చేస్తూ ఇంకో కంప్యూటర్ మీదున్న ఫైళ్లు కూడా అందుబాటులో ఉండాల్సి వస్తే ఈ టపా మీకు సహకరిస్తుంది.
మీరు పని చేసే కంప్యూటర్ ని క్లైంట్ అందాం, కావాల్సిన ఫైళ్లు ఉన్న కంప్యూటర్ ని సర్వర్ అందాం. ముందు సర్వర్ ని, ఫైళ్లు మిగతా కంప్యూటర్లతో పంచుకునేందుకు సిద్దం చేద్దాం.
సర్వర్ (లినక్సు ఐతే)
మీ సిస్టంలో ఉన్న ప్యాకేజ్ మేనేజర్ లో (ఉబుంటు ఐతే సినాప్టిక్) ఈ క్రింది ప్యాకేజ్లు వెతికి ఇన్స్టాల్ చేస్కోండి.
nfs-kernel-server
nfs-common
portmap
ఇప్పుడు మీరు పంచుకోవాలనుకున్న ఫోల్డర్ దారి /home/user_x/shared_folder అనుకుందాం. మీ క్లైంట్ల ఐపి అడ్రస్లు 172.16.15.35, 172.16.15.47 అనుకుందాం. ఐతే మొదటి క్లైంట్ కి ఈ పంచుకున్న ఫోల్డర్ లో మార్పులు చేయడానికి కూడా అనుమతి ఉండాలి, రెండో క్లైంట్ కి ఆ ఫోల్డర్ లో ఉన్న వాటిని ఉపయోగించుకునే అధికారం మటుకే కావాలి, మార్పులు చేయనివ్వకూడదు అనుకుందాం. ఇవన్నీ మీ పరిస్థితికి వేరేగా ఉండొచ్చు.
/etc/exports ఫైల్ ని తెరవండి. (ఎలా తెరవాలో తెలీక పొతే క్రింది కమాండ్ కొట్టండి, సంకేతపదం అడిగితే ఇవ్వండి).
sudo gedit /etc/exports
ఈ క్రింది లైన్ ని ఆ ఫైల్ లో చివర అతికించండి.
/home/user_x/shared_folder 172.16.14.35(rw,async) 172.16.14.47(ro,async)
మీ పరిస్థిని బట్టి ఫోల్డర్ దారి, ఐపి అడ్రస్లు సరైనవి ఇచ్చుకోండి. ఆ పై లైన్లో ఖాళీలు (స్పేస్ లు) ఎక్కడెక్కడ ఉన్నాయో సరిగ్గా చుస్కోవాలి సుమా. ఒక క్లైంట్ కి, ఇంకో క్లైంట్ కి మధ్య ఒక్క ఖాళీ ఉండాలి. అలాగే ఫోల్డర్ దారికి, మొదటి క్లైంట్ కి మధ్య ఒక్క ఖాళీ ఉండాలి. ఈ ఖాళీలలో తప్పులుంటే సరిగ్గా పని చెయ్యదు ఈ పద్దతి. ఆ ఫైల్ సేవ్ చెయ్యండి. ఇక ఆ ఫోల్డర్ పంచుకోవడానికి ఆఖరి స్టెప్ క్రింది కమాండ్ రన్ చేయడమే.
sudo /etc/init.d/nfs-kernel-server restart
sudo exportfs -a
ఇక్కడితో మన లినక్సు సర్వర్ సిద్దమైనట్టే!
సర్వర్ (విండోస్ ఐతే)
విండోస్ లో మీరు పంచుకోవాలనుకునే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి. ఒక విండో తెరుచుకుంటుంది. అందులో Sharing అనే ట్యాబు లోకి వెళ్ళండి.
ఎక్స్.పీ వాడుతున్నట్టైతే క్రింద బొమ్మలో చూపినట్టు ఉంటుంది, ఆ విండోలో Share అని ఉన్న బాక్స్ ని టిక్కు పెట్టి ఓకే కొట్టేయండి.

విస్తా/విండోస్ ౭ వాడుతున్నట్టైతే క్రింది బొమ్మలలో లాగా ఉంటుంది. Share బటన్ కొట్టి, ఎవరెవరు ఎలా ఈ ఫోల్డర్ ని పంచుకోగాలరో అమర్చుకుని ఓకే కొట్టేయండి.


ఇక్కడితో మన విండోస్ సర్వర్ సిద్దమైనట్టే!
క్లైంట్ (లినక్సు ఐతే)
మీ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి ఈ క్రింది ప్యాకేజ్లు వెతికి ఇన్స్టాల్ చేస్కోండి.
nfs-common
portmap
మన సర్వర్ ఐపి అడ్రస్ 172.16.15.22 అనుకుందాం. మనం సర్వర్ పంచిన ఫోల్డర్ కి ఈ క్లైంట్ లో ఒక దారి చూపించాలి. ఆ దారి /media/server_X అనుకుందాం. ఒకవేళ మీ సర్వర్ విండోస్ ఐతే ఈ కమాండ్ ఉపయోగించి మీ సర్వర్ పంచుకున్న ఫోల్డర్ ని ఈ లినక్సు క్లైంట్ మీద పొందండి.
mount -t cifs //172.16.15.22/shared_folder -o username=Gopal,password=myPassword /media/server_X
మీ సర్వర్ లినక్సు ఐతే, ఈ క్రింది కమాండ్ ఉపయోగించండి.
mount 172.16.15.22:/home/user_x/
shared_folder /media/server_X
ఈ రెండు కమాండ్లలో ఐపి అడ్రస్, యూజర్ పేరు, పాస్వర్డ్, దారులు మీ పరిస్థితి కి అనుగుణంగా మార్చుకోవాలి!
క్లైంట్ (విండోస్ ఐతే)
ఎక్స్.పీ వాడుతున్నట్టైతే My Computer కి వెళ్లి, మెనులో Tools > Map Network Drive ని ఎంచుకోండి. అక్కడ వచ్చిన విండో లో Folder స్థానంలో \\172.16.15.22\shared_folder అని ఇవ్వండి. ఇక్కడో ముఖ్య గమనిక. సర్వర్ విండోస్ ఐతే మీరు ఆ పంచిన ఫోల్డర్ కి ఏ పేరు ఇస్తారో అదే ఇక్కడ కూడా (shared_folder స్థానే) ఇవ్వాలి. సర్వర్ లినక్సు ఐతే విండోస్ క్లైంట్ లో ఆ ఫోల్డర్ ని ఈ పద్దతిలో పొందడం కుదరదు. దీనికి మీరు ఇక్కడ ఉన్న "Windows Services for UNIX Version 3.5" ఫైల్ ని దింపుకుని దానితో వచ్చే ఉపకరణాన్ని వాడుకోవాలి. వివరాలకి ఇక్కడున్న ఇంగ్లీష్ టపా చూడగలరు.


వ్యాఖ్యలు
How about sharing files
How about sharing files between a windows server and a linux client or viceversa?
అది కూడా ఇందులో చెప్పాను.
అది కూడా ఇందులో చెప్పాను. ఉదాహరణకి క్లైంట్ లినక్సు ఐతే, విండోస్ సర్వర్ ని ఎలా మౌంట్ చేయాలో, లినక్సు సర్వర్ ఎలా మౌంట్ చేయాలో చెప్పాను. అలాగే విండోస్ క్లైంట్ కి కూడా.
కొత్త వ్యాఖ్య వ్రాయి