- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ప్రఖ్యాత వెబ్ ఆర్కిటెక్చర్లు
లక్ష్యం:
ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
౧. క్లైంట్-సర్వర్

రెండు ముక్కల్లో - సర్వర్ అంటే వడ్డించేది, క్లైంట్ అంటే అడిగేది. సర్వర్ లోపల, దానిలో ఉన్న సర్వీసులు, డేటా వగైరా వంటి వాటిని, అడిగిన వారికి అందిచే విధానాలను కూడా పొందుపరుస్తారు. ఉదాహరణకి. మీరు గూగుల్ పేజిలో శోధన పదాలను టైపు చేసి శోధించమని పంపినప్పుడు, మీరు ఒక సర్వీసుని అభ్యర్థిస్తున్నారు - శోధన సర్వీసుని. ఆ సర్వీసు ని మనకు అందించడానికి గూగుల్ సర్వర్ మీద దానికి కావాల్సిన ప్రోగ్రాం లు ఉంటాయి, మనం శోధించినప్పుడు ఆ పదాలు ఆయా ప్రోగ్రామ్లకు చేరి, ఆ ప్రోగ్రామ్లు వాటి కార్యాన్ని కాస్తా నిర్వహించి, మనకు ఒక పేజి రూపంలో సమాధానం పంపుతాయి. ఇక్కడ క్లైంట్ వేషం వేసింది మనం ఉపయోగించిన బ్రౌజరు/విహారిణి. కొన్ని కొన్ని వేళల్లో, ఏ అప్లికేషను ఐనా క్లైంట్ వేషం వెయ్యొచ్చు. ఉదాహరణకి, గూగుల్ టాక్ కూడా ఒక క్లైంట్ అప్లికేషనే.
౨. పీర్ టు పీర్

పైన చెప్పినా విధానం చాలా చోట్ల అమరుతుంది. కానీ, ఒక సందర్భం తీస్కుందాం. మీ స్నేహితులందరి దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒకరి దగ్గరున్నవి ఇంకొకరి దగ్గర లేవు. కానీ అన్ని ఫైల్స్ అందరికి అవసరమే అనుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి కంప్యూటర్ ఒక సర్వర్ లా పని చేయాలి, అలాగే క్లైంట్ లా కూడా పనిచేయాలి. ఎందుకంటే మిగతావారి దగ్గరున్న అన్ని ఫైళ్లని ఒకరు అందుకునే వీలుండాలి, వారి దగ్గరున్న ఫైళ్లు అందరికి పంచే వీలుండాలి. ఇలాంటి ఆర్కిటెక్చర్ నే పీర్-టు-పీర్ ఆర్కిటెక్చర్ అంటారు. పీర్ అంటే ఒక కంప్యూటర్/పరికరం. ప్రతి కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ కి అనుసంధానం ఉంటుంది. అన్ని కంపూటర్లు ఒకే స్థాయిలో పని చేస్తాయి. క్లైంట్-సర్వర్ లా లాగ ఒకటి అడగడం, ఇంకొకటి వడ్డించడం కాకుండా, ఇందులో అన్నీ అడిగే వీలూ, అలాగే అన్నీ వడ్డించే వీలూ ఉంటాయి. దీనికి ఉదాహరణ బిట్ టోరెంట్ నెట్వర్క్లు.
ఇది కేవలం ఒక అవగాహనకు మాత్రమే. ఈ నెట్వర్క్ల గురించి తెలుసుకోవాలనుకుంటే వాటిపై పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
9 వారాలు 2 రోజులు క్రితం
9 వారాలు 5 రోజులు క్రితం
10 వారాలు 18 గంటలు క్రితం
12 వారాలు 2 రోజులు క్రితం
12 వారాలు 2 రోజులు క్రితం
12 వారాలు 2 రోజులు క్రితం
12 వారాలు 5 రోజులు క్రితం
14 వారాలు 6 రోజులు క్రితం
15 వారాలు 13 నిమి క్రితం
15 వారాలు 1 రోజు క్రితం