- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
బ్రౌజరు/విహారిణి అంటే?
లక్ష్యం:
కంప్యూటర్ వాడేవారిలో ఎక్కువమంది ఎక్కువసేపు వాడే ఉపకరణం - వెబ్ బ్రౌజరు, లేదా, జాల విహారిణి. కాబట్టి, అసలు విహారిణి అంటే ఏంటో, ఎన్ని రకాలున్నాయో, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం!
కొన్ని నెలల క్రితం గూగుల్ వాళ్ళు న్యూయార్క్ నగరంలో సరదా సర్వే ఒకటి చేశారు. టైంస్క్వేర్ లో నిల్చుని ఒక వ్యక్తి వచ్చే పోయే వాళ్ళలో ఒక 50 మందిని, "బ్రౌజరు అంటే ఏంటి మాష్టారు? మీరు ఏ బ్రౌజరు వాడతారు?" లాంటి ప్రశ్నలు అడిగాడు. ఆ రోజు మొత్తం అందరూ కలిపి ఇచ్చిన సమాధానాలలో 8% మాత్రమే సరైనవని చెప్పొచ్చునంట! అతను అడిగిన వాళ్ళల్లో ఎంతమందికి కంప్యూటర్ తో పరిచయం ఉందన్నది వేరే విషయం ;) దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడవచ్చు. అది చూశాక, చాలా మందికి బ్రౌజరు కి, వెబ్ పేజి కి, శోధన యంత్రానికి మధ్య తేడా తెలియదని అనుకోవచ్చు, వాళ్ళు చెప్పినంత కాకపోయినా, "చాలామందికి" అని మాత్రం చెప్పొచ్చు.
బ్రౌజరు గురించి క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పమంటే, జాలంలో ఉన్న ఎన్నో కోట్ల వెబ్ పేజీలను మన కంప్యూటర్ ద్వారా చూడగలిగే సౌకర్యం కల్పించే సాఫ్ట్వేర్ = బ్రౌజరు!. బ్రౌజరు అంటే వెబ్ పేజి కాదు! శోధన యంత్రం కాదు! శోధన యంత్రం కూడా ఒక వెబ్ పేజీనే. అలాంటి బ్రౌజరు సాఫ్ట్వేర్లు రకరకాల కంపెనీలు ఉచితంగా అందిస్తున్నాయి. ముఖ్యమైన బ్రౌజరు లు ఇవీ - ఫైరుఫాక్సు, గూగుల్ క్రోమ్, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. అన్నీ తెలుగులో ఉన్నాయి.
బ్రౌజరు గురించి మాట్లాడే సందర్భంలో తరచుగా ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన పదాలు, వాటి అర్థాలు, బొమ్మలు చూద్దాం. క్రింది బొమ్మలో ఫైరుఫాక్సు బ్రౌజరు లో అవి ఎక్కడుంటాయో చూపించాను. మిగతా బ్రౌజర్లలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది, గమనించగలరు.
౧. అడ్రస్ బార్ (చిరునామా స్థలి)
ప్రతి సైట్ కి ఒక చిరునామా ఉంటుంది. ఈ సైట్ కి techsetu.com అనేది చిరునామా. ఈ వెబ్ చిరునామా నే URL/URI అని అంటారు. (URL, URI లా మధ్య చిన్న తేడా ఉంది, అది ఇంకో టపాలో చూద్దాం, ప్రస్తుతానికది అప్రస్తుతం). ఈ చిరునామా ఉండే స్థలాన్నే అడ్రస్ బార్ అంటాం. మిమ్మల్ని ఎవరన్నా ఒక వెబ్ పేజి తెరవమంటే దాని చిరునామా ఇక్కడ కొట్టాలన్నమాట.
౨. మెనూ (పట్టీ)

బ్రౌజరు అనే కాదు, ఏ ఉపకరణానికైన మెనూ ఉంటుంది. ఆ మెనూ లో ఉన్న వాటి నుంచే మనం ఆ ఉపకరణం ద్వారా ఏమేమి పనులు సాధ్యమో, దాన్ని మన ఇష్టానుసారంగా ఎలా సవరించుకోవాలో, దాన్ని వాడటం ఎలా తెలుసుకోవాలో గట్రా నేర్చుకుంటాం. సాధారణంగా మెనూ పై భాగంలోనే ఉంటుంది. లేదా, జాగా ఆదా చేయడం కోసం ఆ మెనూ ని ఒక ప్రక్కగా చిన్న బటన్ రూపం లో ఉంచవచ్చు, చూడండి.
౩. సెట్టింగ్స్ (సవరణలు)

మెనూలో, మన ఇష్టానుసారంగా బ్రౌజరుని సవరించుకోవడానికి ఈ పద్దునే(ఎంట్రీ) ఎంచుకుంటాం. ఫైరుఫాక్సు లో దీని దారి మెనూలో, ఎడిట్(లినక్సు) లేదా ఆప్షన్స్(విండోస్) లో Preferences.
౪. ప్లగిన్స్ (పొడిగింతలు)
ఒక్కొక్క మనిషికి వారికి తగ్గ వింత వింత అవసరాలు ఉంటాయి. ఒకే బ్రౌజరు అన్నిటినీ తీర్చాలంటే కష్టం! కాబట్టి, ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు మార్చుకునే విధంగా పొడిగింతలని ప్రవేశపెట్టారు. ఉదాహరణకి లోకం లో అందరూ ట్విట్టర్ వాడాలని లేదు కదా, కావాల్సిన వారు మాత్రమే దానికి తగ్గ ప్లగిన్ తెచ్చుకుని వాడుకుంటారు. అన్ని బ్రౌజరులకి ఇప్పుడు ఇవి అందుబాటులో ఉన్నాయి.
౫. రీలోడ్, బ్యాక్, ఫార్వర్డ్ బటన్లు.

ఒక వెబ్ సైట్ చూస్తున్నప్పుడు, అందులో కొన్ని లంకెలు నొక్కుతూ ఒక పేజి ముందుకి, ఒక పేజి వెనక్కి వెళుతూ ఉంటాం. మనం అప్పటికి చూసిన పేజిలన్నీ బ్యాక్ బటన్ నొక్కితే ఒక్కొక్కటిగా వస్తుంటాయి. వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్లీ ముందుకి రావాలనుకుంటే, ఫార్వర్డ్ బటన్ నొక్కటమే. ఒకవేళ ప్రస్తుతానికి ఉన్న పేజి మళ్ళీ లోడ్ చేయాలి అనుకుంటే రీలోడ్ కొట్టడమే.
౬. స్టేటస్ బార్ (వివరాల స్థలి)
పేజి లోడ్ అవ్వడం, కొన్ని ప్లగిన్ల వివరాలు వగైరా వగైరా వన్నీ ఈ స్టేటస్ బార్ లోనే ఉంటాయి. మనం వెబ్ పేజి లో ఏదైనా లంకె మీదకు మౌస్ కదిపితే దాని అడ్రస్ ఈ స్టేటస్ బార్ లోనే చూపిస్తుంది.
౭. బుక్‌మార్క్‌ల టూల్‌బార్
మనం నిత్యం తరచుగా వాడేవి బాగా అందుబాటులో పెట్టుకోవడానికి వీలుగా ఈ టూల్‌బార్ ఉపయోగపడుతుంది.
మీరు సాధారణ వాడుకరులైతే ఇక్కడి వరకు చాలు. కాదూ మాకు కాస్త ఆ బ్రౌజరు అనేది వాడుతున్నప్పుడు కంప్యూటర్లో ఏం జరుగుతుందో టెక్నికల్ వివరాలతో సహా తెలిసితీరాల్సిందే అంటే, ఈ టపాలో చూడండి.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి






డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
15 వారాలు 1 రోజు క్రితం
20 వారాలు 4 రోజులు క్రితం
20 వారాలు 5 రోజులు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం