బ్లూ టూత్

Image
Featured Image
లక్ష్యం: 

బ్లూ టూత్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.

చిన్న ప్రశ్న: ఈ రోజులలో మనం ఒక దానితో ఒకటి కలపబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నాము(ఇంట్లో, ఆఫీసులో, కార్లో, ...). ఉదాహరణకు కీబోర్డు కంప్యూటర్ తో, యంపి౩ ప్లేయర్ తో హెడ్ ఫోన్లూ.  ఈ పరికరాలు ఎలా కలుపబడి ఉన్నాయి?

సమాధానం: వైర్లు మరియు కేబుల్స్‌తో! కానీ, ఎల్లపుడు వైర్లు మరియు కేబుల్ లను ఉపయోగించడం కష్టమైన పని.

పరిష్కారం: బ్లూ టూత్ వైర్‌లెస్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో, ఆఫీసులో మొదలైన చోట్ల ఎక్కువ వైర్లను ఉపయోగించే పద్ధతిని తొలగిస్తుంది. దీనివలన మన ఎలక్ట్రానిక్ పరికరములు నిత్యం ఒక దానితో ఒకటి కలపబడి ఉంటాయి, వైర్లతో పని లేకుండా. బ్లూ టూత్ అనే పేరు టెక్ అనే పదం నుంచి వచ్చినది. మనం బ్లూ టూత్ అనే పదాన్ని చాలా కంప్యూటర్స్ , సెల్ ఫోన్ లకు సంబంధించిన ప్రకటనలలో వింటూ ఉంటాము.

బ్లూ టూత్ అంటే ఏమిటి?

బ్లూ టూత్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను ఒక దానితో ఒకటి కలిపి ఉంచే ఒక స్వల్ప రేంజి కల వైర్లెస్ రేడియో టెక్నాలజీ. బ్లూ టూత్ కోర్ స్పెసిఫికెషన్ వర్షన్ మీద ఆధారపడి బ్లూ టూత్ రేంజి ౩౦ యఫ్.టి. లేదా అంతకంటే ఎక్కువ. ఈ రోజులలో ఉపయోగించే బ్లూ టూత్ రేంజి ౧౦౦ యఫ్.టి.లు. వైర్లు, కేబుల్స్‌లను ఉపయోగించి ఎలాగైతే మనం కంప్యూటర్‌తో కీబోర్డు, మౌస్‌లను, యంపి3 ప్లేయర్ తో హెడ్‌ఫోన్లను కలుపుతున్నామో అదేవిధంగా మనం బ్లూ టూత్ వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగించి కలుపుతున్నాము, కానీ ఎటువంటి వైర్లు, కేబుల్స్ లేకుండా. బ్లూ టూత్ ను మొదట రూపొందించిన వారు ఎరిక్సన్, తరువాత వృధ్ధి చేసిన వారు ఐబిమ్, ఇన్‌టెల్, నోకియా, టోషిబా. బ్లూ టూత్ ను మొదట రూపొందించిన ఎరిక్సన్ వారు మొదట ఈ పేరును కోడ్ గా వాడినారు.సాధారణంగా మొదటి పేరు చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి అది అలాగే ఉండిపోయినది. బ్లూ టూత్ పేరు ౧౦ వ శతాబ్ధానికి చెందిన డానిష్ రాజు హరల్డ్ బ్లూ టూత్ నుంచి వచ్చినది.మనం దగ్గరగా పరిశీలిస్తే దీని చిహ్నములో రునిక్ అక్షరం అయిన ’హెచ్’ మరియు హరల్డ్ బ్లూ టూత్ ఇంటి పేరు లో మొదటి అక్షరం ’బి’ కలిగి ఉంటాయి. మనం ప్రస్తుతం ఉపయోగించే బ్లూ టూత్, బ్లూ టూత్ కోర్ స్పెసిఫికెషన్ వర్షన్ ౩.౦+హైస్పీడ్.

బ్లూ టూత్ ఎలా పనిచేస్తుంది?

 • ఒక రేడియో చిప్‌ను పరికరాలలో ఉపయోగించుట ద్వారా మనం ఈ బ్లూ టూత్ టెక్నాలజీ ని పొందగలుగుతున్నాము. దీనిని ఉపయోగించి పరికరాలు గాలి తరంగాల ద్వారా కలుపబడి ఉంటాయి.
 • పరికరాల మధ్య ఇన్ఫర్మెషన్ ఏకకాలంలో ఒక్కొక్క బిట్ లేదా కొన్ని బిట్స్ సమూహంగా గాలి తరంగాల ద్వారా పంపబడుతుంది.
 • రెండు ఎలక్ట్రికల్ పరికరాలను కలుపుటను మరియు డేటాను వాటి మధ్య పంపించుటను కంట్రోల్ చేసే ప్రామాణికమును ప్రోటోకాల్ అంటారు. సాధారణంగా ప్రోటోకల్ అంటే పరికరాల మధ్య భాష.
 • గాలి తరంగాల ద్వారా వచ్చిన బిట్స్ రూపంలో వచ్చిన మెసేజ్‌ను ఎలా తీసుకోవాలి, ఎలా చదవాలి, మెసెజ్ మధ్యలో మార్పులు చేయబడినదా?, లేదా? ఇలాంటి అన్ని ప్రశ్నలను ప్రోటోకాల్ ఎదుర్కొంటుంది.
 • సాధారణంగా అన్ని పరిశ్రమలు ప్రామాణికమైన ప్రోటోకాల్ ను ఉపయోగిస్తారు.
 • బ్లూ టూత్ సాధారణ ప్రామాణికమైన వైర్లెస్  ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది కాబట్టి సులువుగా పరికరాలు కలుపబడి ఉంటాయి.
 • బ్లూ టూత్ లక్ష్యం ఏమిటంటే బ్లూ టూత్ ను పరికరాల భాషగా ప్రపంచ వ్యాప్తంగా వృధ్ధిచేయాలి.

ఉపయోగాలు

 • బ్లూ టూత్ పరికరాలు వైర్లెస్.
 • బ్లూ టూత్ టెక్నాలజి తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
 • బ్లూ టూత్ ఆటోమాటిక్ గా జరిగేపని.
 • సాధారణంగా బ్లూ టూత్ అన్ని పరిశ్రమలు ఉపయోగించే ప్రామాణికమైన ప్రోటోకల్ ను ఉపయోగించును, కనుక అందరూ దీనిని ఉపయోగించవచ్చును.
 • బ్లూ టూత్ తక్కువ శక్తి గల వైర్లెస్ తరంగలను ఉపయోగించును, దీనివలన ఇంటర్ ఫియరెన్స్ ను తగ్గించ వచ్చును.
 • బ్లూ టూత్ ను ఉపయోగించి మనం డేటాను లేదా శబ్ధాన్ని కూడా పంపవచ్చును.
 • ౩౦ యఫ్ .టి. రేంజ్ ను ఉపయోగించి దాదాపు ఏడు బ్లూ టూత్ పరికరాలను కలుపవచ్చును.
 • బ్లూ టూత్ అందరూ ఉపయోగించదగిన, ప్రపంచవ్యాప్త, వైర్లెస్ ప్రామాణికము.

మూలం: http://bluetomorrow.com

వ్యాఖ్యలు

system lo use cheyadaniki

system lo use cheyadaniki bluetooth softeware emanna dorukutunda.. telpagalaru......

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.