లినక్స్ లో తెలుగు చదవడం

Image
Featured Image
లినక్స్ లో తెలుగు చదవడం చూపించే ప్రతిమ
గోపాలకృష్ణ
టెక్‌సేతు
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో లినక్స్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఐతే కొన్ని వర్షన్‌లలో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు బ్రహ్మాండంగా కనబడుతుంది. అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.

అసలు ముందుగా ఈ పాఠ్యాంశం చదవి, చెప్పింది చేయడానికి, తెలియాల్సినవి ఏమన్నా తెలియకపోతే తెలుసుకుందాం. ఏది తెలియకపోయినా దాని మీద నొక్కేసి, చదివేసి మళ్ళీ వెనక్కి వచ్చేయండి.

  • terminal (టర్మినల్)
  • yum (యమ్‌)
  • apt-get (యాప్ట్-గెట్) లేదా synaptic(సినాప్టిక్)

హా! ఇప్పుడు అన్నీ తెలుసన్నమాట! మీకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఇదిగో ఈ క్రింది చెప్పింది చేసేయ్యండి. లేకపోతే ఇక్కడ నొక్కితే ఇంకొంచెం క్రిందికెళతారు, అక్కడ చెప్పింది చేసేయ్యండి.

ఇంటర్నెట్ సదుపాయం ఉంటే

Alt+F2 కొట్టి ఆ వచ్చిన బాక్సులో gnome-terminal అని కొట్టి ఈ కిందున్న commands ని copy paste చేసి రన్ చేయండి

ఫెడోరా(Fedora) వాడేవారు

yum -y install openoffice.org-langpack-te_IN aspell-te fonts-telugu.noarch lohit-fonts-telugu.noarch

ఉబుంటు(Ubuntu) వాడేవారు

sudo apt-get install aspell-te language-pack-te language-support-te openoffice.orgl10n-te-in ttf-telugu-fonts

ఒకసారి కంప్యూటర్ రీబూట్ చేయండి. పైన చెప్పినట్టు చేసినప్పటికీ, అప్పుడప్పుడు విహారిణిలో(browsers) బాగా చదవగలగాలంటే అందులో కూడా తగు మార్పులు చేయాల్సుంటుంది.

పైర్‌ఫాక్స్ వాడేవారికి అదంతా అవసరం లేదులేండి. ఫైర్‌ఫాక్స్ ౩.౦ వర్షన్‌ నుండి ఏం చేయనక్కర్లేకుండానే తెలుగు శుభ్రంగా  కనిపిస్తుంది. కాని అంతకు ముందు వర్షన్‌లలో  ఏమన్నా తేడగా ఉంటే మాత్రం తలనొప్పే సుమా. అందుకే, ఇక్కడ నుండి అత్యాధునిక వర్షన్‌ని దింపుకుని(download చేస్కుని), స్థాపించేస్కోండి(install అన్నమాట). అంతే!

ఒకవేళ మీరు ఎపిఫనీ(Epiphany) విహారిణి(browser) వాడే అరకొరమందిలో ఒకరైతే, అందులో తెలుగు పదాలు సరైన రీతిలో కనబడడానికి Pango rendering అనేది ఒకటవసరం. దానికోసం మీరు చేయాల్సిందల్లా…

  • Alt+F2 కొట్టి ఆ వచ్చిన Run Application బాక్సులో gconf-editor అని కొట్టి Run కొట్టండి.
  • అలా కొడితే వచ్చిన విండోలో ఎడమవైపునున్న menu లో apps>epiphany లో web section కి వెళ్ళండి.
  • ఇప్పుడు అదే విండోలో కుడివైపు చూస్తే  enable_pango అనేదొకటుంటుంది. దానికి టిక్‌ పెట్టేయండి.
  • హమ్మయ్య! ఓ మారు ఎపిఫనీని మూసి-తెరిస్తే మన తెలుగు, తెలుగులా అందంగా కనబడుతుంది :)

ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే

  1. లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
  2. దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను ~/.fonts డైరెక్టరీలోకి copy చేయండి. విహారిణిని(బ్రౌజర్‌) తెరిచివుంటే ఒకసారి మూసి, తెరవండి.
  3. ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.

అక్కడికీ సమస్య తీరకపోతే, పోనీ ఇక్కడ చెప్పిన పద్దతి మీకు నచ్చకపోతే  మీరు వాడుతున్న OS, విహారిణి(browser) పేర్లు, వర్షన్‌ల వివరాలతో ఇక్కడే అడిగేస్తే నా శక్తి కొద్దీ సమాధానం చెప్తాను.

వ్యాఖ్యలు

Neenu Ubuntu 9 vaadutunnanu.

Neenu Ubuntu 9 vaadutunnanu.
neenu meru cheppinatluga command ni type chesanu, kani naku ee message vachindi

ravi@ravi-desktop:~$ sudo apt-get install aspell-te language-pack-te language-support-te openoffice.orgl10n-te-in ttf-telugu-fonts
Reading package lists... Done
Building dependency tree
Reading state information... Done
E: Couldn't find package openoffice.orgl10n-te-in
ravi@ravi-desktop:~$
ravi@ravi-desktop:~$

naku hepl cheyyindi.

రవి గారూ, రిపాసిటరీ నుండీ ఆ

రవి గారూ,

రిపాసిటరీ నుండీ ఆ ప్యాకేజీలు తీసేశారనుకుంటా... క్రింది సులువైన ప్రక్రియను ప్రయత్నించండి.

మీ ఉబుంటూ 9.04 లో, పైన ఉన్న System లో Administration లో Language Support ను క్లిక్ చేయండి.

కొత్తగా వచ్చిన చిన్న విండోలో Use input method engines (IME) to enter complex charecters ను టిక్ చేయండి.

క్రింద ఉన్న Install / Remove Languages అన్న బటన్ను నొక్కండి.

కొత్తగా ఓపెం ఐన విండోలో ఒక లిస్టు ఉంటుంది, క్రిందకు స్క్రోల్ చేసి తెలుగును టిక్ చేయండి.

తరువాత Apply Changes అన్న బటన్ను నొక్కండి.

కావలసిన ప్యాకేజీలను దానంతటదే దింపుకొని ఇంస్టాల్ చేసేస్తుంది. రీస్టార్ట్ అవసరం లేదు.

మీరు ఇక తెలుగు సైట్లను చక్కగా చూడగలుగుతారు.

ఇలా చేశాక కూడా, ఏదైనా వెబ్‌సైటులో పిచ్చి అక్షరాలు కనపడితే ఈ లంకె చూడగలరు.

రవి గారు, ఒకవేళ ప్యాకేజీలు

రవి గారు, ఒకవేళ ప్యాకేజీలు లేవు అన్నదంటే, గవేష్ చెప్పినట్టు వాటి పేర్లైనా మారి ఉండాలి, లేదా మీరు కావల్సిన రిపాజిటరీలను కలిపి ఉండరు. వేరే వర్షన్లు వాడేవారికి కూడా పనికివస్తుందని చెప్తున్నాను. ఉబుంటులో, ఏ వర్షనైనా సరే, ఆ రిపాజిటరీలను కలపడానికిలా చేయండి.

System > Administration లో ఉన్న Synaptic Package Manager ని తెరిచి, అందులో Settings లో Repositories కి వెళ్ళి, third-party లో ఉన్న రిపాజిటరీలన్నీ టిక్ చేసేయ్యండి. ఇప్పుడు ఆ విండో ఓకే కొట్టేసి, పైన reload అని ఉంటుంది. అది కొట్టి. ఆ తర్వాత Synaptic ని మూసేసి పైన చెప్పిన కమాండు కొట్టాలి.

మీ వెబ్ సైట్ చాలా ఉపయోగకరంగా

మీ వెబ్ సైట్ చాలా ఉపయోగకరంగా ఉన్నది
ధన్యవాదములు

Google

Google [URL=http://google.com]google[/URL]

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.