- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
వెబ్/నెట్ ఎలా పని చేస్తుంది?
లక్ష్యం:
ఈ చిన్న కథ మీరు రోజు వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చెప్తుంది.
అనగనగ ఒక ఊరిలో ఒక విచిత్రమైన తోట ఉండేది. ఆ తోటకి పని వాళ్ళేగాని యజమాని లేడు. ఆ ఊరి జనానికి తినడానికి ఏం కావాల్సిన ఆ తోట దగ్గరికే వెళ్ళేవారు. ఆ తోట లోపలికి ఎవ్వరికీ ప్రవేశం లేదు. జనానికి పని వాళ్ళు తెలియరు, పనివాళ్ళకి జనాలు తెలియరు. మీకు ఆకలి వేసిందే అనుకోండి, మీరు వెళ్లి ఆ తోట కి ఉండే కంచెకి వేళ్ళాడే వెయ్యిన్నొక్క బుట్టల్లో ఒక బుట్ట దగ్గరికి వెళ్లి మీకేం కావాలో చీటీ రాసి అందులో వేస్తారు. అలా వేయగానే ఆ బుట్ట చీటీతో లోపలికి వెళ్లి, మీకు కావాల్సిన వాటితో బయటికి వస్తుంది. ఆ వచ్చింది తీసుకుని తిని వచ్చిన దారిని ఇంటికి పోవడమే.
అబ్బా! భలే ఉంది కదూ ఆ ఊరేదో! దానికేనండి మనం ముద్దుగా ఇంటర్నెట్ అని పేరెట్టుకున్నాం :). ఇప్పుడు ఆ కథలో ఏయే పాత్రల్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం.
౧. తోట - ఇంటర్నెట్
౨. బుట్టలు - బ్రౌజరు/విహారిణి
౩. పనివాళ్ళు - వెబ్ సర్వర్లు
౪. జనాలు - బ్రౌజరు వాడుతూ ఇంటర్నెట్ ఉపయోగించుకునే వాళ్ళు, అంటే క్లైంట్లు.
౫. బుట్టలో తిరిగి వచ్చేవి - వెబ్ పేజిలు, వెబ్ సర్వీసులు.
౬. కంచె - రక్షణ కవచం, అంటే, ఫైర్ వాల్ లాంటిది అనుకోవచ్చు(కానీ ఫైర్ వాల్ యే కానక్కర్లేదు).
౭. చీటిలో రాసేవి - వెబ్ అడ్రస్/శోధన పదాలు
ఈ మాత్రం తెలిస్తే చెలరేగిపోవచ్చు. ఈ ప్రాధమిక సమాచారం బాగా వంట పట్టించుకుంటే, మీకు ఆసక్తి ఉన్న విషయం తీస్కుని ఒక ఆట ఆడుకోవచ్చు. ఉదాహరణకి, ఈ మొత్తం వ్యవస్థలో రకరకాల సవాళ్లు ఉంటాయి. వెబ్ సర్వర్ విషయానికి వస్తే, వాటిల్లో ఉండే సర్వీసులు నిర్మించడం దగ్గర్నుంచి, వాటికి కంచె వేయడం వరకు ఒక చదరంగమే! ఇక క్లైంట్ వైపు (అంటే ఆ పేజిలని, సర్వీసులని వాడే జనాలకి, ప్రోగ్రాంలకి చివరికి అందుబాటులో ఉండే సమాచారం) ఇక్కడ కూడా, కావాల్సిన ప్రోగ్రాం లను నిర్మించడం దగ్గర్నుంచి, ఆ పేజి డిజైన్, లే అవుట్, లోడింగ్ టైం చూసుకోవడం వరకు ఇది కూడా చాలా పెద్ద వ్యవస్థే! వచ్చే పాఠ్యాంశాల్లో సర్వర్, క్లైంట్ ఆర్కిటెక్చర్ గురించి, ఆ రెంటికి వాడే వివిధ రకాల టెక్నాలజీల గురించి తెలుసుకుందాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
8 వారాలు 1 రోజు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
8 వారాలు 6 రోజులు క్రితం
11 వారాలు 1 రోజు క్రితం
11 వారాలు 1 రోజు క్రితం
11 వారాలు 1 రోజు క్రితం
11 వారాలు 4 రోజులు క్రితం
13 వారాలు 5 రోజులు క్రితం
13 వారాలు 5 రోజులు క్రితం
13 వారాలు 6 రోజులు క్రితం