- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
లక్ష్యం:
ఒక సొంత సైట్ కావాలనుకుంటే ఎక్కడ మొదలుపెట్టి ఏమేమి చేయాలో తెలుసుకోండి.
సొంత సైట్ కోసం మనం చేయాల్సినవి మూడు పనులు.
సైట్ పేరు ఎంచుకోవడం
సైట్ పేరుని డొమైన్ లేదా సీమనామము అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి. తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు. స్వచ్చంద సంస్థల వంటివాటికి .org బావుంటుంది. సమాచారం అందరికి పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో వాడుతున్నట్టేమి కనబడట్లేదు. కానీ, సైట్ అంటే .com యేనని మనసులో ముద్రపడిపోయింది చాలా మందికి. ఇప్పుడిప్పుడే అంతర్జాలం విస్తరిస్తున్న పల్లెల్లో ఈ భావన ఎక్కువ. కాబట్టి మీ సైట్ కి వచ్చేవారు ఎవరు అనేదాన్నిబట్టి కూడా చూసుకోవాలి.
ఆ పేరు రిజిస్టర్ చేయడం
ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి హోస్ట్.ac, గో డాడీ, రిజిస్టర్.కాం చూడండి. మిగతా వాటి కోసం గూగుల్ ని అడిగితే సరి. ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.
జాల జాగా కొనుక్కోవడం
ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి ఒక జాగా లేదా ఆవాసం కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో, వాళ్ళ దగ్గరే ఆవాసం కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణ కి g33k హోస్టింగ్, బ్లూ హోస్ట్, హోస్ట్.ac లాంటి ఆవాసదాతల్ని చూడండి.
ఇప్పుడు పేరూ, జాగా సిద్ధం! తర్వాత ఏం చేయాలో వచ్చే టపాలో చూద్దాం!!

వ్యాఖ్యలు
సొంత కంప్యూటర్ ని కూడా వెబ్
సొంత కంప్యూటర్ ని కూడా వెబ్ సర్వర్ గా మార్చొచ్చు http://praveen.blaaglokam.net/2009/09/ibm.html
ప్రవీణ్ గారూ, మీ వ్యాసం
ప్రవీణ్ గారూ, మీ వ్యాసం బావుంది. కానీ, మన కంప్యూటర్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి కదా. సెక్యురిటీ దృష్ట్యా కూడా చాలామంది వారి సైటుని వారు కాపాడుకోలేని స్థితిలోనే ఉంటారు. అలాంటి వారు వేరే హోస్టింగోళ్ళని/ఆవాసదాతల్ని వాడుకోవడం మంచిదంటాను :) వెబ్ సర్వర్స్ తో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్ళకి అదొక తొలిమెట్టులా బాగా ఉపయోగపడుతుంది.
ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్
ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్ లైసెన్స్ కొనుక్కుని సొంత వెబ్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసి మనకి తెలిసిన స్పామ్ బోట్ల అడ్రెస్ లు బ్లాక్ చెయ్యాలి. వెబ్ హోస్టింగ్ కంపెనీలన్నీ చేసే పని ఇదే. కొంత మంది స్పామ్ బోట్ల కార్యక్రమాలని గమనించడానికి కావాలని ఫైర్ వాల్ డిసేబుల్ చేసి స్పామ్ బోట్లని అలో చేసి వాటి ఐ.పి. అడ్రెస్ లని సేకరించి ఐ.పి.ల సమాచారం ఆన్లైన్ లో పెడతారు. కొంత మంది స్పామ్ బోట్లు ఏయే దేశాల నుంచి ఎక్కువగా వస్తాయో కూడా ఆ సమాచారం పెడతారు. నేను కూడా కొంత కాలం స్పామ్ బోట్లని గమనించాను. స్పామ్ బోట్లు ఎక్కువగా అమెరికా నుంచి వస్తుంటాయి.
బావుంది మీ సమాచారం :)
బావుంది మీ సమాచారం :) ఇన్నాళ్ళు ఇంకా చాలా చేయాలన్న ఉద్దేశ్యంతో ఉండేవాడిని.
మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్
మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్ వర్డ్ ప్రెస్ కాదు, డ్రూపల్ కూడా కాదు. మీరు మాంబో వాడుతున్నారా?
ప్రవీణ్ గారూ, ఇది ద్రుపాలే
ప్రవీణ్ గారూ, ఇది ద్రుపాలే :)
నేను డ్రూపల్ 6.9 వర్షన్
నేను డ్రూపల్ 6.9 వర్షన్ ఇన్స్టాల్ చేసి చూశాను. కానీ నేను వాడినవి వేరే సెట్టింగ్స్. అందుకే నేను గుర్తు పట్టలేకపోయాను.
ఓహ్, నేను ఈ సైటుకై
ఓహ్, నేను ఈ సైటుకై వాడుతున్నది 6.10, ఇప్పుడూ వాడుతున్న అలంకారం రెండు అలంకారాల్లోంచి ఒక mash-up లా తయారుచేసుకున్నాను.
my system is under domain in
my system is under domain in organisation.iam not accessing perticular sites .i want give adminstrator rights to accout.it is possible .if any chances please give me details about how to give admin rights to my account.please tell me.
సురేందర్ గారూ, మీ ఉద్దేశ్యం
సురేందర్ గారూ, మీ ఉద్దేశ్యం మీ సాధారణ వినియోగదారు అకౌంటుకి మీరే అడ్మినిష్ట్రేన్ హక్కులు ఇవ్వాలనా?
yes
yes
సాధారణంగా మీ అడ్మినిష్ట్రేటర్
సాధారణంగా మీ అడ్మినిష్ట్రేటర్ ప్రమేయం లేకుండా ఇది జరగదు. ఒకవేళ మీకు ఆ అడ్మినిష్ట్రేన్ అకౌంటు వివరాలు తెలిసి ఉంటే, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారో చెప్పండి.
microsoft windows server2003
microsoft windows server2003
Win+r కొట్టి ఆ రన్ బాక్సులో
Win+r కొట్టి ఆ రన్ బాక్సులో lusrmgr.msc అని కొట్టండి. ఒక విండో తెరుచుకుంటుంది. అందులో మీరు ఏ అకౌంటుకైతే అధికారం ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకుని, right click చేసి, properties కి వెళితే అక్కడ మార్చుకోవచ్చు.
i do above process ,but in
i do above process ,but in properties i don't no which menu i choose ,how enable and how to give rights.please tell clearly.
దీని మీద ఒక టపా రాస్తాను,
దీని మీద ఒక టపా రాస్తాను, రాశాక మీకు ఇక్కడ తెలియజేస్తాను.
ide vidamga sitenu create
ide vidamga sitenu create chesukovadaniki maroka sitekooda free space istundi.
aa website peru www. piczo.com
deenilo chala rakala tools vunnai.. vati dwara manam photolanu edit chesukovachu .antekakunda video sitelo badra parachukovachu.prathiroju mana sitenu entamandi visit chesaro telusukovachhu.try chesichudandi.
vyaasam chaala
vyaasam chaala bagundi..tarvati tapaa kosam eduru chuustunnanu..
సొంత సైట్ కావాలనుకుంటే ఏం
సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి? అన్న వ్యాసం చాలా ఉపయోగాకరామినది నాకు చాల బాగా నచ్చినది, చాల చాల థాంక్స్ , నా మెయిల్ id : abhivideo@gmail.com
ఇంకా ఈలాంటే ముక్య సమాచారంములు రాస్తారని ఆశిస్తున్నాను,
From
సతీష్

సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి అన్న వ్యాసం చాలా ఉపయోగాకరామినది నాకు చాల బాగా నచ్చినది, చాల చాల థాంక్స్ నా మెయిల్ id abhivideo@gmail.com

(సతీష్)
సొంత సైట్ కావాలనుకుంటే ఏం
సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి అన్న వ్యాసం చాలా ఉపయోగాకరామినది నాకు చాల బాగా నచ్చినది, చాల చాల థాంక్స్ నా మెయిల్ abhivideo@gmail.com
ఇంకా ఈలాంటే ముక్య సమాచారంములు రాస్తారని ఆశిస్తున్నాను,
కొత్త వ్యాఖ్య వ్రాయి