- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ఉబుంటు పేరు, వెర్షన్ల వెనుక కమామీషు
లక్ష్యం:
ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
ఉబుంటు వెర్షన్ పేరు రెండు భాగాలు ఉంటుంది మొదటిది విశేషణము రెండవది జంతువు లేదా పక్షి పేరు. ఉదాహరణకు జాంటి-జాకలోప్. మొదటి రెండు వెర్షన్ లు మినహా మిగిలినవన్నీ ఆంగ్ల అక్షరాల వరుసక్రమం లో ఉంటాయి. వీటి పక్కనే ఉన్న వెర్షన్ సంఖ్య లో మొదటి భాగం ఆ వెర్షన్ విడుదల చేసిన సంవత్సరం, రెండవది విడుదల చేసిన నెల. ఉదాహరణకు 9.10 వెర్షన్, అక్టోబర్ 2010 లో విడుదలైంది. కింద పట్టిలో వివిధ వెర్షన్ల పేర్లు తెలుపబడ్డాయి.
01 - 4.10 - వార్టీ వార్ట్‌హాగ్
02 - 5.04 - హోరీ హెడ్జ్‌హాగ్
03 - 5.10 - బ్రీజీ బ్యాడ్జర్
04 - 6.06 - డేప్పర్ డ్రేక్ - LTS
05 - 6.10 - ఏడ్జీ ఎఫ్ట్
06 - 7.04 - ఫియస్టీ ఫాన్
07 - 7.10 - గస్టీ గిబ్బన్
08 - 8.04 - హార్డీ హెరాన్ - LTS
09 - 8.10 - ఇంట్రెపిడ్ ఇబెక్స్
10 - 9.04 - జాంటీ జాకలోప్
11 - 9.10 - కార్మిక్ కోయల
12 - 10.04 - లూసిడ్ లింక్స్ - LTS
13 - 10.10 - మావరిక్ మీర్కట్

ఉబుంటు ఆరు నెలలకు ఒక కొత్త వెర్షన్ వస్తోంది. కాని కొన్ని మాత్రమే L.T.S అని పిలవబడుతున్నాయి. ఎందుకని? L.T.S అంటే లాంగ్.టర్మ్.సపోర్ట్ అని అర్థం. అంటే తక్కిన వాటికి సపోర్ట్ ఉండదని అర్థమా? సాధారణ వెర్షన్ లకు కుడా సపోర్ట్ ఉంటుంది కాని అది 18 నెలల వరకే. కాని ఈ L.T.S వెర్షన్ లకు మాత్రం మరిన్ని ఎక్కువ రోజులు సపోర్ట్ ఉంటుంది. డెస్క్టాపు L.T.S వెర్షన్ కు 3 సంవత్సరాలు, సర్వర్ L.T.S వెర్షన్ కు 5 సంవత్సరాలు ఉంటుంది. పైన బొమ్మలో వాటి సపోర్ట్ ఎప్పటివరకు ఉంటుంది అన్న విషయాలు మరియు వాటి విడుదల సమయాలు తెలుపబడ్డాయి. వీటికి వేరుగా ఎటువంటి చార్జి ఉండదు, మిగతా వాటి లాగానే ఇవి కుడా ఉచితంగా లభిస్తాయి.


వ్యాఖ్యలు
తెలుగు భాషకి మీ సైట్ వలన చలా
తెలుగు భాషకి మీ సైట్ వలన చలా ఉపయోగముంటుందండీ. "తెలుగు తగ్గిపోతోందో", అని ఏడ్చే వాళ్ళ కన్నా ఇలాంటి సైట్ లవలన్ తెలుగు భాషకి మేలు జరుగుతుంది. ఈ టెక్నాలజీ యుగం లో టెక్నాలజీ నీ, సైన్స్ నీ ఇంజనీరింగ్ నీ తెలుగు లో చెప్పటం వలన తెలుగు కొంతన్నా ఉపయోగింపబడుతుంది. జనాలు తెలుగు దగ్గరికి రాకపోతే జనాల దగ్గరికి తెలుగును తీసుకెళ్ళాలి. జనాలు డబ్బుల కోసం జావా బోవాలు నేర్చుకొంటుంటే జావా తో పాటు తెలుగు నేర్పాలి. గ్రామాల నుండీ వచ్చే, ఇంగ్లీషు లో వీకైన నా బోటి కుర్రాళ్ళకి కూడా ఉపయోగం గా ఉంటుంది.
థ్యాంక్స్ ప్రసాద్ గారు, మీకు
థ్యాంక్స్ ప్రసాద్ గారు, మీకు ఈ సైట్ ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉంది :)
కొత్త వ్యాఖ్య వ్రాయి