కూల్ ఐరిస్! ఫైర్‌ఫాక్స్‌లో ఫోటోలు చేడటానికి ఒక మంచి యాడ్‌-ఆన్

Image
కూల్ ఐరిస్!
కూల్ ఐరిస్!
appledifferent.com
http://appledifferent.com/wordpress/wp-content/02-17-09.jpg
లక్ష్యం: 

ఒక ఫైర్‌ఫాక్స్  ప్లగ్‌ఇన్ సాయంతో ఇంటర్‌నెట్‌లో ఉన్న ఫోటోలనూ, youtube వీడియోలు చూడటం, మన కంప్యూటర్ లో ఉన్న ఫోటోలు చూడటం, బొమ్మలతో కూడి ఉన్న వార్తలు చదవటం, గేంస్ ఆడటం, షాపింగ్ చేయటం ఇలా ఎన్నో….. చేయగలిగే యాడ్‌ఆన్ను ఇంస్టాల్ చేసుకొని వాడే పద్దతిని తెలిజేయటం.

మీరు చూసే ఫోటోలూ వీడియోలూ ఇక మునుపటిలాగా నిర్జీవంగా ఉండబోవు….. ఇది కూల్ ఐరిస్ అంటున్న మాటలు. అద్భుతమైన తరహాలో ఫోటోలను చూడగలిగే plug-in(add-on) ఇది.

ఇక్కడకు వెళ్ళగానే, మీకు సరిపడే ఫైల్ ను డౌంలోడ్ చేసుకోగలిగిన బటను ఉంటుంది. డౌంలోడ్ చేసిన ఫైల్ ను ఇంస్టాల్ చేసుకొని బ్రౌజర్ను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.

ఇక మీరు దీనిని పరిక్షినచటానికి గూగుల్ లో Images సెర్చ్ చేసి, వచ్చిన బొమ్మల్లో ఏదో ఒకదాని పైకి మౌస్ను తీసుకెళ్ళగానే, ఆ బొమ్మ యొక్క ఎడమ వైపు క్రింది బాగములో ఒక గుర్తు వస్తుంది, దానిని నొక్కగానే అద్భుతమైన కూల్ పిక్స్ రంగంలోకి దిగుతుంది.

ఇందులో చాలా పనులు చేయవచ్చు. ఉదాహరణకు youtube వీడియోలు చూడటం, మన కంప్యూటర్ లో ఉన్న ఫోటోలు చూడటం, బొమ్మలతో కూడి ఉన్న వార్తలు చదవటం, గేంస్ ఆడటం, షాపింగ్ చేయటం ఇలా ఎన్నో…..

దీనిని సులభంగా ఓపెన్ చేయటానికి మీ బ్రౌజర్లో ఒక బటన్ వచ్చి ఉంటుంది. Firefoxలో ఐతే సెర్చ్ బార్ పక్కన ఉంటుంది. డౌంలోడ్ మాత్రం మనకు తెలియకుండా చాలా చేసేస్తుంది, మరి బొమ్మలు అంతర్జాలం నుంటే కదా తీసుకుంటుంది, కావున లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాంలు ఉన్న వాల్లు దీన్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవటం మంచిది.

బొమ్మలో ఇది ఎలా ఉంటుందన్న ఉదాహరణ చూడవచ్చు.

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.