- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
గ్నోమ్ షెడ్యూల్ - అలారాలు - మర్చిపోవడం మర్చిపోండి!
లక్ష్యం:
పొద్దున్నే టైం కి లేవాలి, లేచాక శతకోటి ముఖ్యమైన పనులు చేయాలి. అందులో సవాలక్ష పనులు గుర్తుండనే ఉండవు. రోజూ ఫలానా టైం కి ఫలానా ప్రోగ్రాం రన్ చేయాలి, ఫలానా టైం కి బ్యాక్ అప్ తీస్కోవాలి. పుట్టినరోజులు, పెళ్లి రొజు, యానివర్సరి ఒకటా రెండా! అబ్బా! అన్నీ గుర్తుపెట్టుకుని చెయ్యాలంటే ఎలా?? అందుకే ఉందిగా మనకో డబ్బా, కంప్యూటర్ అనే పేరు తగలేస్కుని, మనల్ని తట్టి చెప్పే పని దానికి పురమాయిద్దాం! ఆ ఒక్క పని చేసేసి ఈసారి మర్చిపోవడం అంటే ఏంటో మర్చిపోదాం!
లినక్సు లో చాలామందికి తెలియకుండా చీకట్లో మగ్గిపోతున్న ఒక అద్భుతమైన పరికరం ఉంది. క్రోన్ అని! దాని పనల్లా ఒకటే - చేయమన్న పని, చేయమన్న టైం కి చెయ్యడం! కానీ, దాన్ని ఉపయోగించడం లో తికమకలు పడలేక చాలామంది దాన్ని పట్టించుకోకుండా వేరే వాటితో సర్దుకుపోతుంటారు. సాధారణంగా, దాన్ని టెర్మినల్ ఉపయోగించి వాడుకోవాలి. కానీ, ఈ పాఠ్యాంశంలో దాన్ని అందరూ వాడుకునేందుకు వీలుగా, సులువుగా వాడుకోవడం ఎలాగో చూద్దాం.
ముందు గ్నోమ్ షెడ్యూల్ అనే ఒక ఉపకరణాన్ని ఇన్స్టాల్ చేస్కోవాలి. క్రింది కమాండ్ ఉపయోగించి ఆ పని చేయండి ముందు.
sudo apt-get install gnome-schedule
ఇప్పుడు, ఆల్ట్-f2 కొట్టి, gnome-schedule అని టైపు చేసి రన్ చేయండి. లేదా, మెయిన్ మెనూ లో సిస్టం టూల్స్ లో scheduled tasks అని ఉంటుంది, అది క్లిక్ చేసినా ఒకటే. అప్పుడు ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది లాగా.

అందులో, పైన ఉన్న New కొడితే, ఒక విండో తెరుచుకుంటుంది. మూడు ఆప్షన్లతో, A task that launches recurrently (మళ్ళీ మళ్ళీ కావాల్సిన పని), A task that launches one-time (ఒక్కసారి మాత్రమే కావాల్సిన పని), A task from predefined template (ముందే నిర్దేశింపబడిన మూసల లాంటి పని).

అందులో, ఉదాహరణకి, మళ్ళీ మళ్ళీ కావాల్సిన పని(recurrent) ఎలా సెట్ చేస్కోవాలో చూద్దాం. సదరు బటన్ మీద నొక్కితే, ఒక విండో వస్తుంది. దాన్ని ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు పూరిస్తే, మిమ్మల్ని పొద్దున్నే ఏడింటి నుంచి, ఎనిమిదింటి దాక, ప్రతి పదిహేను నిమిషాల వ్యవధిలో ఒక పాట పాడి లేపుతుంది :) వివరంగా ఏ ఖాళీ లో ఏం పూరించాలో చూద్దాం.

- Description: ఇక్కడ మీకు వచ్చిన పేరు పెట్టుకోండి ఈ అలారానికి.
- Command: ఇక్కడ ఏ కమాండ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ కమాండివ్వండి ఆర్గ్యుమెంట్లతో సహా. ఉదాహరణకి అది పాటైతే, mplayer "/home/gopi/Music/alarm.mp3" అని ఇవ్వాలి. ఇక్కడ /home/gopi/Music/alarm.mp3 అన్నదాన్ని మీ సిస్టంలో ఉన్న ఒక పాట ఉన్న దారితో(path) మార్చాలి.
- Time & Date:
- Basic: ఇందులో పెద్దగ సెట్ చేస్కొడానికి ఏముండదు. ప్రతి నిమిషం, ప్రతి గంట చేయాల్సిన పనులకి Advanced కి వెళ్ళకుండా పెట్టేస్కునే వీలు మాత్రమే ఇది. ప్రతి రోజు(Every day) ఎంచుకుంటే, ప్రతి రోజు అర్థరాత్రి ౦౦:౦౦ గంటలకు రన్ అవుతుంది. ప్రతి నెల ఎంచుకుంటే, ప్రతి నెల, ౧ వ తారీఖు, ౦౦:౦౦ గంటలకి రన్ అవుతుంది. ప్రతి వారం(Every week) ఎంచుకుంటే, ప్రతి వారం సోమవారం, ౦౦:౦౦ గంటలకి రన్ అవుతుంది. ఇందులో బాగా ఉపయోగపడేది అంటే, At reboot (సిస్టం రీబూట్ చేసినా ప్రతిసారి)
- Advanced: ఇందులో, మనకు కావాల్సిన విధంగా కావలసినప్పుడు రన్ చేయడానికి పెట్టుకోవచ్చు. ఇందులో Minute, hour, Day, Month, Weekday ఉంటాయి. అన్నిటికీ, ఒకటే పద్దతి - పక్కన ఉన్న Edit బటన్ నొక్కితే ఒక విండో వస్తుంది. క్రింది లాగా. ఉదాహరణకి, నిమిషానికి చూద్దాం. మిగతా వాటికి కూడా అంతే. అందులో,
- Every minute ఎంచుకుంటే, ప్రతి నిమిషం మోగుతుంది.
- In a step width ఎంచుకుంటే ఎన్ని నిమిషాలకి ఒకసారి మోగాలో చెప్పొచ్చు.
- In a range ఎంచుకుంటే, ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు మోగాలో చెప్పొచ్చు.
- At an exact minute ఎంచుకుంటే, ఆ ఒక్క నిమిషం మాత్రమే మోగాలని చెప్పినట్టు.

ఇప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు, పదిహేనో తారీఖు ఏదో ఒక పని గుర్తుచేసేలా పెడదాం. ముందు మీరు ఇక్కడ చూడకుండా ప్రయత్నించండి. ఆ తర్వాత ఈ క్రింది విండో లో ఉన్నట్టే చేసారేమో చుస్కుకోండి.

ఇలా చేయగలిగితే ఇక మీకు వాడటం వచ్చినట్టే. రాకపోతే కాస్త ప్రయత్నించండి. అలాగే ఒక్కసారి(one-time) పెట్టుకునే అలారం కూడాను. క్రింది బొమ్మలో చూడండి.

ఇందులో క్రిందున్న Task లోనే కమాండివ్వాలి. మర్చిపోవద్దు సుమా! సౌండు మ్యూట్ ఉందేమో చూసుకోండి, వినపడకపోతే పెట్టుకున్న పుణ్యం ఉండదు :)



వ్యాఖ్యలు
దాన్ని "నోం" అని పలకాలి.
దాన్ని "నోం" అని పలకాలి. గమనించగలరు.
లినక్సు, లైనక్సు, గ్నోం,
లినక్సు, లైనక్సు, గ్నోం, నోం.. ఇలా అన్ని పలకరింపులు సరైనవేనని విన్నాను.
నోమ్ కూడా సరి కాదు.
నోమ్ కూడా సరి కాదు. 'జినోమ్/జీనోమ్' సరైనది (jee-nohm).
ఒకసారి ఈ లంకె, ఈ లంకె, ఇలాంటి
ఒకసారి ఈ లంకె, ఈ లంకె, ఇలాంటి మరెన్నో లంకెలు చూడగలరు :). అవేవో ప్రామాణికమని కాదు. జనాలు దాన్ని సాధ్యమైన అన్ని రకాలగానూ పిలుస్తున్నారు. నేను మొన్నటి దాకా జినోం అనే అనేవాడ్ని. కాని, ఇక్కడ అలా రాయడం, బయాలజీలా ఉంటుందని గ్నోమ్ అని వాడాను.
కొత్త వ్యాఖ్య వ్రాయి