టెర్మినల్ లో పనవ్వగానే తెలిపే నోటిఫై ఓ.ఎస్.డి (Notify OSD)

Image
Featured Image
లక్ష్యం: 

టెర్మినల్ లో చాలా టైం తీస్కునే ఏదో ఒక కమాండ్ రన్ చేస్తున్నాం. అది ఎప్పుడవుతుందో ఇదమిద్దంగా కూడా తెలియదాయె, వేరే పనుల్లోకి వెళ్తే దీన్ని మర్చిపోయే/పట్టించుకోకుండాపోయే  అవకాశం ఉంది, అందుకని ఏం చేయలేక కూర్చుని చూడాలా? అవసరం లేదండోయ్!

ఆ మధ్య డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా నుండి పుస్తకాలు దించుకోవడానికి ఒక చిన్న ప్రోగ్రాం రాసి ఇక్కడ ఎలా వాడుకోవాలో చెప్పాను. కానీ, ఒకోసారి చాలా పేజీలు  ఉండి మొత్తం డౌన్లోడ్ అవ్వడానికి చాలా సమయం తీస్కుంటుంది. ఒక్కోసారి ఎప్పుడవుతుందా అని చూస్తూ చూస్తూ చాలా చిరాకు వచ్చేది. ఒక్కోసారి 'అవుతుందిలే!' అని వదిలేసి మర్చిపోవడం జరిగేది. ఇలా కాదని చెప్పి పరిష్కారం కోసం వెతికితే ఇది తారసపడింది.

అమర్చుకోవడం చాలా సులువు! టెర్మినల్ తెరిచి ఈ కమాండ్ కొట్టండి.

sudo apt-get install libnotify-bin

అది ఇన్స్టాల్ అయ్యిన తర్వాత, క్రింది కమాండ్ తో ~/.bashrc ఫైల్ ని తెరవండి.

gedit ~/.bashrc

ఆ ఫైల్ చివరకు వెళ్లి ఒక లైన్ ఎడం తో ఈ క్రింది రెండు లైన్ లు అక్కడ అతికించండి.

alias alert_helper='history|tail -n1|sed -e "s/^\s*[0-9]\+\s*//" -e "s/;\s*alert$//"'
alias alert='notify-send -i /usr/share/icons/gnome/32x32/apps/gnome-terminal.png "[$?] $(alert_helper)"'

టెర్మినల్ ఇప్పటికే తెరిచి ఉంటే ఈ క్రింది కమాండ్ రన్ చేయండి.

source ~/.bashrc

ఏదైనా కమాండ్ ఇచ్చి చివరిలో "; alert" అని ఇస్తే ఆ కమాండ్ రన్ అవ్వడం అయ్యాక మీకు టాస్క్-బార్ లో నోటిఫికేషన్ చూపిస్తుంది. క్రింది బొమ్మలో లాగా. ఇక్కడ ఉదాహరణలో పడి పేజీల పుస్తకం ఒకటి డౌన్లోడ్ కి పెట్టాను. అవ్వగానే అయ్యిపోయింది అని చెప్తుంది.

python download.py urls.txt; alert

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.