- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ట్రూ క్రిప్ట్ (TrueCrypt) - అన్ని ఆపరేటింగ్ సిస్టంలలోనూ ఫైళ్ళు పాస్-వర్డ్ తో రహస్యంగా ఉంచే ఉపకరణం!
లక్ష్యం:
కొన్ని ఫైళ్ళు మనకు/కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటే బావుంటుంది, అందరూ చూడవలసిన ఫైళ్ళు కాకపోవచ్చు కనుక. అలాంటి ఫైళ్ళకి పాస్-వర్డ్ తో కంచె వేస్తే ఆ పాస్-వర్డ్ తెలిస్తే గానీ ఎవరు వాటిని చూడలేరు. లినక్సు, విండోస్, మాక్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలు అన్నిటిలోనూ ఒకే పద్దతిలో ఈ పని నిర్వర్తించే ఒక ఉపకరణం - ట్రూ క్రిప్ట్!
ముందు ఇక్కడి నుంచి మీ ఆపరేటింగ్ సిస్టం ని బట్టి ట్రూ-క్రిప్ట్ ను దించుకోండి. విండోస్ వాడేవారు సెటప్ ఫైల్ మీద రెండు సార్లు నొక్కితే ఇన్స్టాల్ అయ్యే ప్రక్రియ మొదలవుతుంది. లినక్సు వాడేవారు దించుకున్న ఫైల్ ని విప్పి (extract చేసి) ఆ వచ్చిన ఫైల్ ని టెర్మినల్ నుంచి ఈ క్రింది కమాండ్ సాయంతో రన్ చేయండి. మీరు ఫైల్ ని డెస్క్టాపు (Desktop) మీద పెట్టారు అని అనుకుంటాను.
sudo ~/Desktop/truecrypt-7.0-setup-x86
ఫైల్ పేరు అదేనో కాదో చూసుకోండి. ఆ కమాండ్ కరెక్ట్ గా ఇచ్చినట్లైతే, ఇన్స్టాల్ అయ్యే ప్రక్రియ మొదలవుతుంది.
ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యాక, లినక్సు లో truecrypt అని కమాండ్ ఇచ్చి రన్ చేయండి, విండోస్ లో Start > All programs లో TrueCrypt ఎంచుకుని రన్ చేయండి.
ట్రూ క్రిప్ట్ చాలా తేలికగా అర్థం చేస్కునే విధంగా పని చేస్తుంది. ముందు నిర్ధిష్ట పరిమాణంతో ఒక సీక్రెట్ స్థానం ఏర్పరుచుతుంది. ఆ సీక్రెట్ స్థానం ఒక డ్రైవ్ లాగే పని చేస్తుంది. దాన్ని ట్రూ క్రిప్ట్ వాడి ఎక్కుపెట్టొచ్చు(మౌంట్ చేయొచ్చు). ఆ ఎక్కుపెట్టేటప్పుడు పాస్-వర్డ్ అడుగుతుంది. మళ్ళీ ఆ డ్రైవ్ ని విడుదల చేసేదాక (అన్-మౌంట్ చేసేదాకా) మనం అందులోకి ఫైళ్లు కాపీ చేస్కోవచ్చు, ఉన్న ఫైళ్లు తీసేయ్యనూవచ్చు.
ఇప్పుడు ప్రయోగ పూర్వకంగా చూపిస్తాను.
౧. నేను దాచాలనుకున్న ఫైళ్లు చాలా తక్కువ సైజువి, మొత్తం కలిపి ఒక 10 మెగాబైట్లు. కాబట్టి నేను 10 మెగాబైట్లతో ఒక సీక్రెట్ స్థానం ఏర్పరుచుకుంటాను. మీకు ఎంత పెద్దది కావలిస్తే అంత పెద్దది సృష్టించుకోవచ్చు. క్రింద చూపించిన బొమ్మలలో ఉన్నట్టు చెయ్యండి.
మీకు కావల్సిన సీక్రెట్ స్థానం ఎక్కడ ఉండాలో నిశ్చయించుకోండి. తథనుగుణంగా ఒక ఫోల్డర్ ని ఎంచుకుని, అందులో ఒక కొత్త పేరుతో ఒక ఫైల్ సృష్టించండి. ఆ ఫైలే మీ రహస్య స్థానం.
ఇక్కడ నా రహస్య స్థానం పేరు TechSetu. నేను దీన్ని డెస్క్టాపు మీద పెట్టుకుంటున్నాను.
నాకు 10 MB మాత్రమే కావాలి కనుక 10 MB ఇస్తున్నాను. మీరు మీకు కావల్సినంత జాగా ఏర్పరుచుకోండి.
ఒక మంచి పాస్‌వర్డు మర్చిపోనిది ఎంచుకోండి.
FAT ఐతే విండోస్, లినక్సులలో కూడా తెరుచుకోవచ్చు.
ఇక్కడ Exit కొట్టేయండి. మీ డ్రైవ్ సృష్టించబడినట్టే.
౨. ఇప్పుడు ఆ సీక్రెట్ స్థానాన్ని ఎక్కుపెట్టి దానిలో నాకు కావాల్సిన ఫైళ్లు పెట్టుకుంటాను.

Select File మీద క్లిక్ చేయాలి.

ఇందాక పైన చెప్పిన స్టెప్పులో సృష్టించిన రహస్య స్థానమే ఇక్కడ కూడా ఎంచుకోవాలి.


౩. పైన చెప్పినట్టు Open క్లిక్ చేస్తే, ఆ డ్రైవ్ తెరుచుకుంటుంది. ఆ డ్రైవ్ ని మీరు మామూలుగా మిగతా డ్రైవ్ లు వాడినట్టే వాడుకోవచ్చు.

౪. అంతే! పని అయిపోతే ఆ డ్రైవ్ ని విడుదల చేసేయాలి.

మళ్ళీ కావాలి అనుకుంటే ౨ వ స్టెప్ లో చెప్పిన విధంగా ఆ సీక్రెట్ స్థానాన్ని ఎక్కుపెట్టాలి. మీ సీక్రెట్ ఫైళ్లు ఇందులోకో కాపీ చేసాక మరెక్కడా లేకుండా జాగ్రత్త తీస్కోండి. పాస్-వర్డ్ మంచిది పెట్టుకోవాలి, మర్చిపోకుండా ఉండాలి. జాగ్రత్త సుమా!













వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి