- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా నుండి పుస్తకాలు దింపుకోవడం (పాత వర్షన్)
లక్ష్యం:
కొన్నేళ్ళ క్రిందట మన గవర్నమెంట్ వారు కొన్ని విద్యాసంస్థలని అనుసందానించి ఒక బృహత్కార్యానికి పూనుకున్నారు. సాధారణ మానవుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, పుస్తకాలని స్కాన్ చేసి ఆన్ లైన్ లో పెట్టడం అని చెప్పొచ్చు. దానికే, డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా (డి ఎల్ ఐ) అని పేరు. దురదృష్టవశాత్తు ఆ సంబందిత సైటు మటుకు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి పుస్తకాలు దించుకుని PDF కి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
ఆ మధ్య ఎప్పుడో సౌమ్య గారు సాహిత్యం గుంపులో అడివి బాపిరాజు గారి రచనలు కావాలని అడగటం, దానికి షణ్ముఖన్ గారు బదులుగా ఒక టూల్ వాడి డి ఎల్ ఐ నుండి పుస్తకాలు దించుకోవచ్చు అని చెప్పడం చూశాను. అప్పట్లో అవసరం పడక, ఆ టూల్ వైపు చూడలేదు, కానీ ఈ మధ్య కర్ణాటిక సంగీతం మీద పుస్తకాలు కావాల్సి వస్తే, ఒకసారి ఆ టూల్ వాడదాం అని డౌన్లోడ్ చేసాను. ఎందు చేతనో పని చేయలేదు. ఇక తప్పక నేనే ఒక చిన్న పైతాన్ స్క్రిప్ట్ రాస్కున్నాను. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే,
మీరు మీకు కావాల్సిన పుస్తకం వెతికి, ఆ పుస్తకం మొదటి పేజి కి సూచించ బడిన లింక్ ఈ స్క్రిప్ట్ కి ఇన్పుట్ గా ఇస్తే, మొత్తం పుస్తకాన్ని డౌన్లోడ్ చేసి, పి.డి.ఎఫ్ రూపం లో మీకు అందిస్తుంది.
ప్రస్తుతానికి ఇది లినక్సు కి ఉద్దేశించి రాసాను. కానీ చాలా కొద్ది పాటి మార్పులతో, విండోస్ లో కూడా పని చేస్తుంది. అదెలాగో ఇంకో టపాలో రాస్తాను. లినక్సు వారు ఈ క్రింది చెప్పిన పద్దతితో ఈ స్క్రిప్ట్ ని వాడుకోవచ్చు.
- ముందు టెర్మినల్ లో ఈ కమాండ్ రన్ చేయండి. (ఇది ఒక్క సారి చేస్తే చాలు, ఈ స్క్రిప్ట్ రన్ చేసిన ప్రతిసారి అవసరం లేదు)
sudo apt-get install libtiff-tools
- ఈ మూడు ఫైల్స్, డౌన్లోడ్ చేస్కోండి -
download.py, bind.sh, urls.txt (డౌన్‌లోడ్ అయిన ఫైళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చినట్టు ఉండేట్టు చూసుకోండి) - ఆ మూడు ఫైల్స్ ని ఒకే ఫోల్డర్ లో పెట్టండి. ఉదాహరణకి, ~/Desktop/DLI/ లో పెట్టారు అనుకుందాం.
- ఇప్పుడు మీకు కావాల్సిన పుస్తకం ఇక్కడ వెతకండి. ఈ వెదకడం మీద, సౌమ్య కొన్ని టిప్స్ తన బ్లాగ్ లో రాశారు, చూస్తే కొన్ని ఇబ్బందులు తప్పించుకోవచ్చు. ఉదాహరణకి, నాకు రాగాల మీద ఒక పుస్తకం కావాలి. ఆ సైట్ కి వెళ్లి, raga అని ఇచ్చాను. వచ్చిన ఫలితాల్లో నాకు ఈ పుస్తకం కావాలి అనిపించింది.
- ఇప్పుడు మీకు కావాల్సిన పుస్తకం కనబడగానే, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు క్రింద చూపినట్టు ఒక పేజి వస్తుంది.

- అందులో, Book Reader 1 పక్కన ఉన్న "Click Here" ని క్లిక్ చేసి, ఆ URL ని కాపీ చేసి ఇందాక డౌన్లోడ్ చేసిన urls.txt లో అతికించండి. ఒక్కో లైన్ లో ఒక్క URL మాత్రమే ఉండాలి సుమా!
- అలా మీకు ఎన్ని పుస్తకాలు కావలిస్తే అన్ని వెతికి, ఈ పైన చెప్పిన విధంగా urls.txt లో వాటి తాలూకా URL ని అతికించండి. urls.txt ని సేవ్ చేయండి.
- ఇప్పుడు టెర్మినల్ లో ~/Desktop/DLI కి (లేదా మీరు ఏ ఫోల్డర్ లో ఆ మూడు ఫైల్స్ పెడితే ఆ ఫోల్డర్ కి) వెళ్ళండి. అక్కడ క్రింది కమాండ్ రన్ చెయ్యండి
python download.py urls.txt
- అంతా డౌన్లోడ్ అయ్యాక, క్రింది కమాండ్ రన్ చెయ్యండి
bash bind.sh
- ఇప్పుడు ఆ ఫోల్డర్ లో Final Book.pdf అనే ఫైల్ ఉంటుంది, అదే మీ పుస్తకం! దానికి సరైన పేరు ఇచ్చుకోండి.
సమస్యలుంటే సంప్రదించండి.


వ్యాఖ్యలు
Thank you for a nice
Thank you for a nice programme. Eagerly waiting for Windows programme.
nice effort. love to see this
nice effort. love to see this on windows.
కృతజ్ఞతలు. విజయవంతంగా ఒక
కృతజ్ఞతలు.
విజయవంతంగా ఒక పుస్తకం దింపుకున్నాను.
కొత్త వ్యాఖ్య వ్రాయి