- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
డి ఎల్ ఐ పుస్తకాల డౌన్లోడ్ ప్రోగ్రాం - విండోస్, లినక్సు లలో!
లక్ష్యం:
ఇంతకు ముందు నేను చెప్పిన డౌన్లోడ్ ప్రోగ్రాం కంటే కాస్త మెరుగ్గా ఉండేలా, ఇంకా విండోస్ లో కూడా పని చేసే ప్రోగ్రాం రాసాను. వాడి చూసి, ఏమన్నా సందేహాలుంటే అడగండి.
ముందుగా ప్రోగ్రాం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్కోండి.
ఎలా వాడాలో తెలుసుకోవాలంటే, తెలుగు వారైతే, డౌన్లోడ్ చేస్కున్న దాంట్లోనే Readme-telugu.txt అనే ఫైల్ ఉంటుంది, అది చదివితే తెలుస్తుంది. లేదా మీకు ఇంగ్లీష్ కూడా అర్థమైతే డౌన్లోడ్ చేస్కున్న దాంట్లోనే Readme-english.txt అనే ఫైల్ ఉంటుంది, అది చదివినా తెలుస్తుంది. తెలుగులో ఇక్కడ కూడా రాస్తున్నాను.
లినక్సు వారు ఈ ప్రోగ్రాం వాడాలంటే, ఒక్కసారి ఈ క్రింది కమాండ్ రన్ చెయ్యాలి.
sudo apt-get install python libtiff-tools
విండోస్ వారు ఇక్కడి నుంచి పైతాన్ దించుకుని ఇన్స్టాల్ చేస్కోవాలి. చేస్కున్నాక, My Computer >> Properties >> Advanced >> Environment Variables కి వెళ్లి System Variables లో Path ని సెలెక్ట్ చేసి, ఎడిట్ కొట్టి Variable value లో ఉన్నదానికి ఈ క్రింది లైన్ జత చేయండి.
;C:\Python26;C:\Python26\Lib
మీరు ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేస్కుంటారు అన్నదాన్ని బట్టి ఆ లైన్ లో బండగా చూపించిన నెంబర్లు తేడాగా ఉండొచ్చు. మీ C: డ్రైవ్ లో పైతాన్ ఫోల్డర్ పేరులో ఏ నెంబర్ ఉందో చూసి ఆ నెంబర్ ఇవ్వండి. అన్ని ఓపెన్ చేసున్న విండోస్ ని ok కొట్టి మూసెయ్యండి.
ఇప్పుడు విండోస్ వారైనా, లినక్సు వారైనా పుస్తకాలు డౌన్లోడ్ చేస్కొడానికి ఈ పద్దతి అనుసరించండి.
I. urls.txt ఫైల్ లో పుస్తకాల లంకెలు పెట్టడం
౧. http://www.dli.ernet.in/ కి వెళ్ళండి
౨. మీకు కావాల్సిన పుస్తకం వెతుక్కోండి.
౩. ఆ వచ్చిన ఫలితాల్లో మీకు కావాల్సిన పుస్తకం కనబడగానే, దాని మీద క్లిక్ చేయండి.
౪. అందులో, Book Reader 1 పక్కన ఉన్న "Click Here" ని క్లిక్ చేసి, ఆ URL ని కాపీ చేసి ఇందాక డౌన్లోడ్ చేసిన urls.txt లో అతికించండి. ఒక్కో లైన్ లో ఒక్క URL మాత్రమే ఉండాలి సుమా!
౫. అలా మీకు ఎన్ని పుస్తకాలు కావలిస్తే అన్ని వెతికి, ఈ పైన చెప్పిన విధంగా urls.txt లో వాటి తాలూకా URL ని అతికించండి. urls.txt ని సేవ్ చేయండి.
II. ప్రోగ్రాం రన్ చెయ్యడం
౧. ఇప్పుడు టెర్మినల్ లేదా కమాండ్ ప్రోమ్ప్ట్ లో మీరు ఈ ప్రోగ్రాం ని ఎక్కడికి డౌన్లోడ్ చేసారో,అక్కడికి వెళ్ళండి. అక్కడ క్రింది కమాండ్ రన్ చెయ్యండి
python download.py urls.txt
డౌన్లోడ్ లు అన్ని అయిపోయాక, పుస్తకాల పి.డి.ఎఫ్ లు అన్ని pdfs అనే ఫోల్డర్ లోనూ, టిఫ్ ఫైళ్లు అన్ని tiffs అనే ఫోల్డర్ లోనూ ఉంటాయి. మీరు అలా ఒకసారి రన్ చేసాక, మీ పుస్తకాలని pdfs, tiffs ఫోల్డర్ల నుండి తీసి వేరే చోట బద్రపరుచుకోవాలి.
నోట్: ఇంతకు ముందు విడివిడిగా డౌన్‌లోడ్ చేసిన ఫైళ్ళన్నీ తొలగించేవాడిని, కాని ఆరెళ్ళి నరేష్ గారి సలహా మేరకు ఆ ఫైళ్ళు ఉంచేస్తున్నాను. ఒక టెంపరరీ ఫోల్డర్ సృష్టించి అందులో ఆ ఫైళ్ళు ఉంచుతున్నాను.
సమస్యలుంటే gopal@tidbits.co.in ని సంప్రదించండి. లేదా ఇక్కడే ఒక వ్యాఖ్య వ్రాయండి.


వ్యాఖ్యలు
బాగుంది . అయితే
బాగుంది . అయితే ఎక్సిక్యూటబుల్ అయితే సాధారణ వాడుకదారులకి సులువుగా ఉంటుంది . ఇంతకీ ఈ పద్ధతిలో పుస్తకం చివరి పేజీ సంఖ్య ఇవ్వకుండానే మొత్తం పుస్తకాన్ని దించుకోవడం వీలవుతుందని అనుకుంటున్నా .
పుస్తకంలో కొన్ని పేజీలని డౌనులోడ్ చేసుకున్నాక - ప్రోగ్రామ్ ని ఆపివేసి - ఆ తర్వాత మిగిలిన పేజీలని డౌనులోడు చేసుకోవడం వీలవుతుందా - లేక మళ్లీ అన్ని పేజీలూ డౌనులోడ్ అవుతాయా ?
నేనైతే పుస్తకం మొదటి పేజీ , చివరి పేజీ ల ఆధారంగా సాధారణ డౌనులోడ్ మేనేజరుని వాడుతున్నాను :-)
mv గారు, మీరు లింక్ ఇస్తే
mv గారు, మీరు లింక్ ఇస్తే సరిపోతుంది. ఆ లింక్ నుండే లాస్ట్ పేజి ఏదో ప్రోగ్రాం తెలుసుకుంటుంది. ఒకవేళ మీరు మధ్యలో ఆపి మళ్ళీ డౌన్లోడ్ చేస్కోవాలి అనుకుంటే, సంబందిత లింక్ urls.txt లో పెట్టేముందు అందులో "last" variable కి ఉండే విలువ తదనుగుణంగా మార్చితే సరిపోతుంది. కాకపోతే ప్రస్తుతం అలా ఎన్నిసార్లు ఆపి చేస్తే అన్ని వేరు వేరు ఫైళ్ళుగా వస్తుంది పుస్తకం. వచ్చే వెర్షన్ లో ఆ సౌకర్యం పూర్తిగా ఉండేలా చూస్తాను :)
ఏమండి ఈ సాఫ్ట్‌వేర్ విండోస్
ఏమండి ఈ సాఫ్ట్‌వేర్ విండోస్ 7 లో కూడా పనిచేస్తుందా? తెలుపగలరు
పని చేస్తుందండీ.. ఐతే పైతాన్
పని చేస్తుందండీ.. ఐతే పైతాన్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
కొత్త వ్యాఖ్య వ్రాయి