తెలుగులో టైపు చేయడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి డెస్క్టాపు ఉపకరణాలు వాడటం

Image
Featured Image
లక్ష్యం: 

జిమెయిల్ లో మీరు తెలుగు టైపు చేయడానికి గూగుల్ లిప్యంతరీకరణ పద్దతి వాడారా? ఇప్పుడు అలాంటి పద్దతే డెస్క్టాపు పైన ఏ అప్లికేషను లో ఐనా టైపు చేస్కునే వీలు కల్పిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఒకే మాదిరి అప్లికేషనులు విడుదల చేశాయి.

గూగుల్ వారి ఉపకరణం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్కోవచ్చు. మైక్రోసాఫ్ట్ వారిది ఇక్కడ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాఠ్యాంశంలో చెప్పినట్టుగానే మాములు చాట్ భాషతోనే ఇంగ్లీషులో రాస్తే చక చకా తెలుగు లిపి లోకి మార్చేస్తుంది. 
ఆ రెండు ఉపకరణాలు ఇన్స్టాల్ చేస్కున్నాక, వాడుకోవడానికి ఇలా చేయాలి, ఈ క్రింద చెప్పిన సూచనలు విండోస్ xp, విస్టా, ౭ లలో language bar ని టాస్క్బార్ లో చూపించేలా చేస్తాయి.
 
 
విస్టా, విండోస్ ౭ కి సూచనలు
  • కంట్రోల్ ప్యానెల్ లో region and language setttings కి వెళ్లి,

  • అక్కడ region and language క్రింద ఉన్న Change keyboards or other input methods అని ఉన్న దాన్ని ఎంచుకోండి.

  • తెరుచుకున్న విండో లో, Keyboards and Languages అన్న ట్యాబు లో, Change keyboards అని ఉంటుంది. అది ఎంచుకోండి.

  • ఆ వచ్చిన విండో లో, Language bar అనే ట్యాబు ఎంచుకుని, Docked in the taskbar అన్నదాన్ని ఎంచుకోండి.

  • తెరిచున్న రెండు విండోలలోను ఓకే కొట్టేసి, నోట్పాడ్ అన్నా, వర్డ్పాడ్ అన్నా తెరిచి ఉంచుకోండి.
  • క్రింద టాస్క్ బార్ లో EN అని ఉంటుంది. దాన్ని నొక్కితే, మెనూ లో తెలుగు కనిపిస్తుంది. ఎంచుకోండి.

  • EN అన్నది TE గా మారి, దాని పక్కనే కీ బోర్డు బొమ్మ వస్తుంది. దాని పై నొక్కితే, గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి లిప్యంతరీకరణ టైపింగ్ విధానాలు కనబడతాయి.

  • ఎంచుకుని, ఇంగ్లీషులో తెలుగు టైపు చేయడం మొదలెట్టండి!

 
  • కంట్రోల్ ప్యానెల్ లో region and language setttings కి వెళ్లి,
  • Languages ట్యాబు లో, Text services and Input languages లో, Details నొక్కండి.

  • ఆ తెరుచుకున్న విండో లో, preferences లో language bar ఎంచుకోండి.

  • ఆ వచ్చిన విండో లో, Show language bar on desktop ని ఎంచుకోండి.

 

  • తెరిచున్న రెండు విండోలలోను ఓకే కొట్టేసి, నోట్పాడ్ అన్నా, వర్డ్పాడ్ అన్నా తెరిచి ఉంచుకోండి.
  • క్రింద టాస్క్ బార్ లో EN అని ఉంటుంది. దాన్ని నొక్కితే, మెనూ లో తెలుగు కనిపిస్తుంది. ఎంచుకోండి.

  • EN అన్నది TE గా మారి, దాని పక్కనే కీ బోర్డు బొమ్మ వస్తుంది. దాని పై నొక్కితే, గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి లిప్యంతరీకరణ టైపింగ్ విధానాలు కనబడతాయి.

  • ఎంచుకుని, ఇంగ్లీషులో తెలుగు టైపు చేయడం మొదలెట్టండి!

 

వ్యాఖ్యలు

nenu computer on chesinappudu

nenu computer on chesinappudu 'regsvr.exe' not found chupisthu, dhani ni search cheyamani error message chupistundi. edi pendrive loni virus valla vachchindanukuntunnanu. dayachesi naa problem ki solution evvandi please.

సురేష్ గారు, ఈ ఫైల్

సురేష్ గారు, ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్న రెండు ఈ.ఎక్స్.ఈ ఫైల్లను రన్‌ చేస్తే ఆ సమస్య పరిష్కారమౌతుంది.

మూలము : http://piyushlabs.wordpress.com/regsvr/

Article chaala baagundi,

Article chaala baagundi, kaani chinna doubt
ZWJ, ZWNJ lanu Google IME mariyu Microsoft IME lalo elaa vraayali?

శ్రీనివాస్ గుప్తా గారు,

శ్రీనివాస్ గుప్తా గారు, దురదృష్టవశాత్తు, ఆయా ఉపకరణాలతో context బట్టి అవే నిర్ణయించగా వచ్చేవేకాని, నాకు తెలిసి ZWJ, ZWNJ మనం explicit గా ఇవ్వలేము.

గోపాల్ గారు, స్పందించినందుకు

గోపాల్ గారు,
స్పందించినందుకు ధన్యవాదాలు,

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.