ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం ఎలా?

Image
Featured Image
ద్రుపాల్ లో యూనీకోడ్ అక్షరాలతో శోధిస్తే ఇలా అంటుంది
గోపాల కృష్ణ
టెక్‌సేతు
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.

మీ సైటులో యూనీకోడ్‌ మూలానికి(text కి) సూచిక నెలకొల్పాలంటే చేయాల్సిందిదీ..

  • modules/search లోకి వెళ్ళి search.module అనే ఫైల్ ని తెరవాలి.

 

gopal@tidbits# cd <drupal's root>/modules/search
gopal@tidbits# vim search.module

 

  • ఆ తెరిచిన ఫైల్లో PREG_CLASS_SEARCH_EXCLUDE అనేదాని కోసం వెదకండి. అలా వెతికేటప్పుడు ఈ కింద చెప్పిన లైనొకటి కనిపిస్తుంది.

    $text = preg_replace('/['. PREG_CLASS_SEARCH_EXCLUDE .']+/u', ' ', $text);

  • దాన్ని నిర్వీర్యం చేసేస్తే సరి! అనగా disable/comment చేయమని :P అంటే ఆ లైనుని ఈ కిందున్న లైనులా మార్చండి. (ఆ లైనుకి ముందు రెండు '/' పెడితే సరిపోతుంది).

    //$text = preg_replace('/['. PREG_CLASS_SEARCH_EXCLUDE .']+/u', ' ', $text);

  • తర్వాత, మీ సైటులో search configuration కి వెళ్ళాలి. మీ సైటు http://yoursite.com అనుకుంటే, http://yoursite.com/admin/settings/search కి వెళ్ళాలి. అక్కడ Re Index Site ని నొక్కి, కింద Simple CJK handling అనుంటుంది. దాని వల్ల ఇండియా వాళ్ళకి ఆవగింజంత ఉపయోగం కూడా లేదు, టిక్ తీసేయ్యొచ్చు. ఈ రెండు పనులూ అయ్యాక Save Configuration అని నొక్కేయండి.
  • ఇప్పుడు, http://yoursite.com/admin/reports/status/run-cron కి ఒక్కసారి వెళితే, Cron ప్రోగ్రాం నడుస్తుంది. మీ సైటులో ఉన్న యూనీకోడ్‌(అంటే, తెలుగు, హిందీ, తమిళం లాంటి భాషల్లో ఉన్న మూలం) మొత్తానికి సూచిక తయారయినట్టే. ఒకసారి పరీక్షించి చూస్కోండి.

వ్యాఖ్యలు

మృదులాంత్రం(సాఫ్ట్వేర్) అనేది

మృదులాంత్రం(సాఫ్ట్వేర్) అనేది సరైన పదం కాకపొవచ్చు
వెరె అర్థం ఉందవచ్చు ఒక్కసారి సరిచూసుకొండి
నాకు కూడ తెలియదు software కి అర్థం తెలుగులో

స్థాపించిన(ఇన్‌స్టాల్

స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన)(establish అనే meaning వస్తుంది not install)
స్థాపించిన అనేది సరైన పదం కాదనుకుంట
ప్రతిక్షేపణ(pratiksheapaNa) లేక ప్రతిక్షేపించడం(pratiksheapinchaDam)
సరైన పదమని అనుకుంటున్నాను
ఒక్కసారి సరిచూసుకోగలరు

నరేష్ గారూ, మీ ఆసక్తి కి చాలా

నరేష్ గారూ, మీ ఆసక్తి కి చాలా సంతోషంగా ఉంది. :) తెలుగుపదం అని ఒక గూగుల్ గుంపు ఉంది. మీరు అందులో చేరితే, మీ ప్రతిపాదనలు అందరికి అందుతాయి. చేరాకా అక్కడ ఒక పోస్ట్ లాగా ఈ విషయం రాయగలరు.

ఈ పద్దతిని ద్రుపాల్ కోర్

ఈ పద్దతిని ద్రుపాల్ కోర్ అప్-డేట్ చేసిన ప్రతీ సారి చేయాల్సి వస్తుంది

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.