లినక్స్ లో మొబైల్ మోడెంతో ఇంటెర్నెట్

Image
Featured Image
ఒక రకమైన మొబైల్ మోడెం చిత్రం
Kofoed
http://www.flickr.com/photos/kofoed/2910305064/
లక్ష్యం: 

 లినక్స్ లో మొబైల్ మోడెం (రిలయంస్ బ్రాడ్ బ్యాండ్, టాటా ఫోటాన్‌ మొ||, లేదా మీ సెల్ ఫోన్‌) తో ఇంటెర్నెట్ ని ఎలా కనెక్ట్ చెయ్యాలో ఈ టపా లో తెలియ చేస్తున్నాను. wvdial అనే ఉపకరణం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

  • ఈ విధంగా కనెక్ట్ అవ్వాలంటే మొదట సుపర్ యూజర్ ఖాతా(అంటే రూట్ ఎకౌంటు) నుండి లాగిన్ అవ్వాలి. (System > Administration > Login Window తెరిచి అందులో Local ట్యాబు లో enable local admistrator login అనే ఆప్షన్ ని టిక్ చెయ్యండి.), లేదా టెర్మినల్ అలవాటు/ఇష్టం ఉన్నవాళ్లు sudo passwd root కమాండ్ వాడి రూట్ పాస్ వర్డ్ పెట్టుకుని, "su - " కమ్యాండ్ ద్వారా లాగిన్‌ కావచ్చు.
  • రూట్ ఎకౌంటు లోనికి లాగిన్ ఐన తర్వాత టెర్మినల్ లో క్రింది కమాండ్ ను టైపు చెయ్యండి.(root@localhost# కాకుండా మిగతాది)

root@localhost# wvdialconf

  • ఇలా టైపు చేసి ఎంటర్ నొక్కిన వెంటనే టెర్మినల్ లో కొన్ని సెట్టింగులు రన్ అవుతాయి ( అందులో మన మొబైల్ యొక్క మోడెం సెట్టింగులు లోడ్ అవుతాయి). ఆ తర్వాత మనకు టెర్మినల్ ఒక పాత్ చూపిస్తుంది. ఆ పాత్ ని అనుసరించి వచ్చిన మోడెం కాన్ఫిగ్ ఫైల్ ని (/etc/wvdial.conf) టెర్మినల్ లో చూపిన సూచనల ప్రకారం మార్చండి.(wvdial.conf ఫైల్ ని సూచనల ప్రకారం ఎడిట్ చెయ్యండి. సాధారణంగా డయల్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్  ని ఎంటర్ చెయ్యాలి.)
  • ఇప్పుడు ఫైల్ ని సేవ్ చేసి రూట్ ఎకౌంటు నుండి లాగ్ ఆఫ్ అయ్యి మీ యూసెర్ ఎకౌంటు కి వచ్చేయ్యండి.
  • ఇప్పుడు టెర్మినల్ తెరిచి wvdial కమాండ్ ని టైపు చేసి ఎంటర్ కొట్టండి.
  • ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. టెర్మినల్ ని మినిమైజ్ చేసి ఇంటెర్నెట్ ని వాడుకోవచ్చు. 
  • వాడిన తరువాత టెర్మినల్ ని క్లోజ్ చేస్తే చాలు. మళ్లీ ఇంటెర్నెట్ కావాలంటే wvdial కమాండ్ ని వాడండి.

 

వ్యాఖ్యలు

i am using reliance wire less

i am using reliance wire less net connect for windows.
I also using Linux ubuntu(9.04) latest version.
i tried the above commands in terminal, but it is not working. It shows as the following:
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
home@ubuntu:~$ sudo passwd root
Enter new UNIX password:
Retype new UNIX password:
passwd: password updated successfully
home@ubuntu:~$ su -
Password:
root@ubuntu:~# wvdialconf
The program 'wvdialconf' is currently not installed. You can install it by typing:
apt-get install wvdial
-su: wvdialconf: command not found
root@ubuntu:~# apt-get install wvdial
Reading package lists... Done
Building dependency tree
Reading state information... Done
Package wvdial is not available, but is referred to by another package.
This may mean that the package is missing, has been obsoleted, or
is only available from another source
E: Package wvdial has no installation candidate
root@ubuntu:~# -su: wvdialconf: command not found
-su: -su:: command not found
root@ubuntu:~#
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
please help me...
i want to use net in linux.

నిఖిల్, మీరు ఈ లంకెలో ఉన్న

నిఖిల్, మీరు ఈ లంకెలో ఉన్న వ్యాఖ్యల ఆధారంగా మీ ప్యాకేజ్ మెటాడాటాని తాజాకరించుకుంటే wvdial అనే ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్కోవచ్చు. ఒకవేళ కాకపోతే తెలియజేయగలరు.

i tried the above link sent

i tried the above link sent by you.
There is no use, same problem is repeated.
please help me.

http://ftp.debian.org/debian/

http://ftp.debian.org/debian/pool/main/w/wvdial/wvdial_1.60.2_i386.deb ను డౌన్‌లోడ్ చేసి, ఇంస్టాల్ చేసి ప్రయత్నించండి.

నిఖిల్ గారు..గవేష్ గారి సూచన

నిఖిల్ గారు..గవేష్ గారి సూచన తప్పక పని చేయాలి. చేయకపోతే తెలుపగలరు.

meeru cheppina link loki

meeru cheppina link loki velli a software nu download chesanu, kaani adi install chesetappudu error message chupistundi.(error msg kinda choopadinadi.)

Error: Dependency is not satisfiable: libuniconf4.6

నిఖిల్ గారూ, అలాంటి

నిఖిల్ గారూ, అలాంటి డిపెండెంసీలు తక్కువే ఉంటే అవి కూడా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేస్కోవచ్చు. లేకపోతే నేను చెప్పిన ఇదివరకటి విధానంలోనే(రిపాజిటరీలు కలిపి మెటాడాటా తాజాకరించడం) సాధ్యపడుతుంది. ఆ విధానంలో మీరేం చేశారో, ఏమైందో వివరంగా తెలియజేయగలరా?

nikhil garu...meeru

nikhil garu...meeru cheppinattuga dependencies satisfy avvakapothe aa dependencies automatic ga internet lonchi tiskobadatai...oka sari malli try chesi chudandi..kudarakapothe telupagalaru..

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.