లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?

Image
Featured Image
లినక్స్ లో వైరస్
http://www.antivirusgratis.com.
http://www.antivirusgratis.com.ar/noticias/fotos/virus-comer-debian-np.jpg
లక్ష్యం: 

లినక్స్ మెషిన్‌ను చెడగొట్టటానికి, దానికోసం పని చేయాలి. అదే విండోస్ మెషిన్‌ ఐతే, దాని మీద పని చేస్తే చాలు - అన్నడు ఓ రచయిత.

ప్రస్థుతం, లినక్స్ వైరస్ లు ఇలా మాట్లాడుకోవటానికి తప్ప విండోస్ ను హాని పరిచిన విదంగా ఎందుకు వ్యాప్తి చెందటం లేదు?

మెకాఫీ యాంటీ వైరస్ ప్రాడక్ట్ మ్యానేజర్ క్లార్క్ అన్నరు - "విండోస్ వాడుకరులు ఎక్కువ అందుకే వైరస్ లను వ్రాసే వాళ్ళు దానికోసం వ్రాస్తున్నరు. లినక్స్ మరియూ యాపిల్ వారి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలు కూడా అంత పాపులర్ అయ్యినప్పుడు వాటి పరిస్థితి కూడా ఇంతే".

ఈ వ్యాఖ్యను పూర్తిగా ఖండించలేం, ఒకొంతు అదీ నిజమే. కానీ పూర్తిగా కాదు.

లినక్స్ కు వైరస్ లు లేవనటం లేదు, ఒక సారి 2002 గణాంకాలను చూద్దాం.

 

ఆపరేటింగ్ సిస్టం

వైరస్ ల సంఖ్య

విండోస్

60000

మ్యాక్

40

యునిక్స్

5

లినక్స్

40

  ఇప్పటికి 10 లక్షలకు పైగా వైరస్ లు విండోస్ కోసం వ్రాయబడ్డాయి.

వీటిలో చాలా వరకు విండోస్ వైరస్ లు, తీరని నష్టాన్ని కలిగించాయి. రెండు మూడు మ్యాక్ వైరస్ లు కూడా ఇలానే చేశాయి. కానీ లినక్స్ మరియూ యునిక్స్ వైరస్ లు మాత్రం, వాటిని తయారు చేసిన ల్యాబ్ లకే పరిమితమయ్యాయి.

ఒక వేళ లినక్స్ నంబర్ 1 డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం ఐనా, మ్యాక్ బిజినెస్ అలా అలా పెరుగుతూ పోయినా, ఈ యునిక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలకు మైక్రో సాఫ్ట్ ప్రపంచంలో వచ్చిన ముప్పులు రావు. ఎందుకని?

ఐదు కారణాలు?

1. వాడుకరుల అర్హతలు :

లినక్స్ వైరస్ ఒక కంప్యూటర్ కు వ్యాప్తి చెందాలంటే, అది లినక్స్ లోని ఎక్సిక్యూటబుల్ ఫైల్ కు సోకాలి. ఇలా జరగాలంటే, ఈ యూజర్ కు ఆ ఫైల్ మీద వ్రాయగలిగే అధికారం ఉండాలి. సాధారణంగా యూజర్ కు ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత తక్కవ అధికారం ఇవ్వటం జెరుగుతుంది. ఒక వేళ ఆ యూజర్ యొక్క ఫైల్లకు సోకినా, అక్కన్నుంటి వ్యాపించటం కష్టం. ఒక వేళ వ్యాపించినా పూర్తి కంప్యూటర్ కు సోకటం కష్టం. ఇదంతా వరుసగా ముగ్గురు మూడు తప్పులు చేస్తూ పోతేనే. అక్కన్నుంచి మరొక కంప్యూటర్ కు సొకటానికి మరో మూడు పొరపాట్లు పూనుకొని చేయాలి.

2. ఎక్సిక్యూటబుల్ ఫైళ్ళు ఉండవు :

ఓపెన్‌ సోర్సు ప్రపంచంలో వైరస్ దాగి ఉండటం కష్టం. బైనరీ ఫైల్లకు అంత ప్రాముఖ్యత లేదు. ఈ రెండు కారణాల వల్ల వైరస్ లకు వ్యాపించటం మరీ ఇబ్బందికరం.

3. రిజిస్టరీ ఉండదు :

మామూలుగా విండొస్ లో వైరస్ లు డిలీట్ చేసినా మళ్ళీ రిజిస్టరీ నుండి లోడ్ అవుతాయి. లినక్స్ లో ఈ రిజిస్టరీనే ఉండదు, కాన్‌ఫిగరేషన్‌ ఫైల్లలో సేవ్ చేసుకుంటుంది. ఇవి సాధారన వాడుకరులకు అందుబాటులో ఉండవు.

4. ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ :

విండోస్ తో పాటుగా, ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వస్తుంది. ఇది చాలా అసురక్షితమైనదని చాలా రీసెర్చి లలో పేర్కొన్నారు. ఇది మనల్ని ఏమీ అడగకుండానే ఏది పడితే అది ఇంస్టాల్ చేస్తుంది. లినక్స్ తో పాటుగా వచ్చే ఫైర్ ఫాక్స్ ప్రతిదీ మనల్ని అడిగిన తరువాతనే చేస్తుంది.

5. లినక్స్ అంత ఫేమస్ కాదు కదా?

విండోస్ అత్యంత పాపులర్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం. దానికోసం వ్రాస్తే సులభంగా మరియూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని హ్యాకర్లు విండోస్ కోసం వైరస్ లు వ్రాస్తారు. అందుకే దానికే వైరస్ లు ఎక్కువ.

 

కొన్ని తప్పిదాలు మరియూ వాటి వివరణ కోసం సూర్యుడు గారి రెండవ వ్యాఖ్య చూడగలరు...

వ్యాఖ్యలు

C లాంగ్వేజ్ లో అనుభవం ఉంటే MS

C లాంగ్వేజ్ లో అనుభవం ఉంటే MS DOSలో కూడా వైరస్ పెట్టెయ్యడం సులభమే కానీ లినక్స్ లో మాత్రం వైరస్ పెట్టడం కష్టం. మనం ఫలానా కంప్యూటర్ కి వైరస్ ఫైల్ పంపినా కంప్యూటర్ యూజర్ ఎక్సెక్యూట్ చెయ్యకుండా వైరస్ ఇన్స్టాల్ అవ్వడం కష్టం. లినక్స్ లో ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ నిర్ణీత రూట్ డెస్టినేషన్ లో ఇన్స్టాల్ అయితేనే పని చేస్తాయి. వైరస్ లు సాధారణంగా ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ లో లేదా స్క్రిప్ట్ ఫైల్స్ లో ఉంటాయి. విండోస్ లో ఎక్సెక్యూటెబుల్ ఫైల్స్ ఏ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేసినా రన్ అవుతాయి. అందుకే విండోస్ లో వైరస్ అవకాశాలు ఎక్కువ. MS DOSలో కూడా వైరస్ అవకాశాలు ఎక్కువ. విండోస్ & MS DOSలో కమాండ్ ఫైల్స్ రూపంలో కూడా వైరస్ రాగలదు. చిన్నప్పుడు MS DOSలో వైరస్ తొలిగించడానికి Nashot antivirus వాడేవాళ్ళం.

మీకు తెలియని వాటిగురించి

మీకు తెలియని వాటిగురించి తప్పుగా ప్రచారం చేయకండి.

సూర్యుడు గారు, మీరు ఏ

సూర్యుడు గారు,
మీరు ఏ తప్పిదాన్ని గూర్చి మాట్లాడుతున్నరో తెలుపగలరు. సరిచేస్తాము.

నేను 1999లో కంప్యూటర్

నేను 1999లో కంప్యూటర్ నేర్చుకున్నాను. అప్పట్లో Windows 95/98 వాడేవాళ్ళం. LANలో MS DOS ఇన్స్టాల్ చేసి నావెల్ నెట్వేర్ ద్వారా షేర్ చేసేవాళ్ళం. అప్పట్లో కూడా వైరస్ లు ఉండేవి. విండోస్ లో Norton antivirus వాడేవాళ్ళం. MS DOSలో Nashot antivirus వాడేవాళ్ళం.

"లినక్స్ వైరస్ ఒక కంప్యూటర్

"లినక్స్ వైరస్ ఒక కంప్యూటర్ కు వ్యాప్తి చెందాలంటే, అది లినక్స్ లోని ఎక్సిక్యూటబుల్ ఫైల్ కు సోకాలి."
కంప్యూటర్స్ లో వైరస్ లు అంటే మనుషులకొచ్చే వైరస్ లాంటివికాదుకదా, సోకటానికి, వైరస్ అంటేనే అదొక బైనరీ లేదా స్క్రిప్ట్ ఫైలు. వైరస్ లు ఉన్న బైనరీలకు సోకవు :)

"ఈ యూజర్ కు ఆ ఫైల్ మీద వ్రాయగలిగే అధికారం ఉండాలి. సాధారణంగా యూజర్ కు ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత తక్కవ అధికారం ఇవ్వటం జెరుగుతుంది."
ఈ పోయింట్ విండోస్ కి కూడా వర్తిస్తుంది.

"ఓపెన్‌ సోర్సు ప్రలు వ్రాసేవార్పంచంలో వైరస్ దాగి ఉండటం కష్టం. బైనరీ ఫైల్లకు అంత ప్రాముఖ్యత లేదు. ఈ రెండు కారణాల వల్ల వైరస్ లకు వ్యాపించటం మరీ ఇబ్బందికరం."
సాధారణంగా వైరస్ లు వ్రాసేవారు, దానిని ఓపెన్ సోర్స్ గా వ్రాయరు, మీ ఉద్దేశ్యమేమంటే ఓపెన్ సోర్స్ కోడ్ సెక్యూర్ అని, అయ్యుండొచ్చు. బైనరీ ఫైళ్లకు ప్రాముఖ్యత లేకపోవటమేమిటి, అవే పనిచేసేవి :)
విండోస్ ఎక్జిక్యూటబుల్స్ == *నిక్స్ బైనరీస్

సాధారణంగా *నిక్స్ లలో డీమన్స్ పనిచేస్తుంటాయి, అవికొన్నిసార్లు సూపర్ యూజర్ ఐ.డి కి వెళ్లి కొన్ని ముఖ్యమైన పనులు చేసి మళ్లీ వెనక్కి వస్తుంటాయి, ఆ ముఖ్యమైన పనులు చేసే కోడులో ఏవైనా లోపాలుంటే వాటిని వాడుకొని హ్యాకర్లు (బ్రేకర్లు) సిస్టమ్స్ లోకి దూరుతుంటారు.

1) "కంప్యూటర్స్ లో వైరస్ లు

1) "కంప్యూటర్స్ లో వైరస్ లు అంటే మనుషులకొచ్చే వైరస్ లాంటివికాదుకదా, సోకటానికి, వైరస్ అంటేనే అదొక బైనరీ లేదా స్క్రిప్ట్ ఫైలు. వైరస్ లు ఉన్న బైనరీలకు సోకవు :)"
ANS: ఇది కూడా పూర్తిగా నిజం కాదు. వైరస్లు బైనరీలకు సొకవచ్చు. వున్న బైనరిని/ స్క్రిప్ట్ ని కొంచెం మార్చి, సీస్టంలొకి వ్యాపించొచ్చు. ఆ మార్చబడిన బైనరి తన అసలు పనితొ బాటుగా, హ్యాకర్ కి కావల్సిన పనిని కూడా నిర్వర్తిస్తుంది.

2) "ఈ యూజర్ కు ఆ ఫైల్ మీద వ్రాయగలిగే అధికారం ఉండాలి. సాధారణంగా యూజర్ కు ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత తక్కవ అధికారం ఇవ్వటం జెరుగుతుంది."
"ఈ పోయింట్ విండోస్ కి కూడా వర్తిస్తుంది."

ANS: నిజమే, వర్తిస్తుంది. కాకపొతే, డీఫాల్ట్ గా అన్ని అధికారాలు ఇవ్వబడివుంటాయి. ఉదాహరణకి, మన ఇంటి కంప్యూటర్లొ, మనం స్వేచ్చగా సిస్టం ఫైల్స్ ని మార్చుకొవచ్చు. విండొస్ ఎలాంటి అభ్యంతరాలు పెట్తదు. అదే, విండొస్ వర్క్ స్టేషన్ తీసుకుంటే, admin మన కోసం అధికారాలు సెట్ చేసి వుంచుతాడు. చాలా మంది మాములు యూజర్స్ కి, అస్సలు ఆ అధికారాలు ఎలా మార్చాలొ తెలియదు.

ఇక్కడ్ ఇంకో పాయింట్ వుంది. విండొస్ యూజర్స్ అందరూ అప్పుడప్పుడే కంప్యూటర్ నేర్చుకునే విధం. అందుకే వాళ్ళని మోసం చెయ్యటం చాలా సులభం. లినక్స్ వినియొగదారుల దగ్గరికి వచ్చేప్పటికి, చాలామందికి ఎంతొ కొంత పరిగ్ఞానం వుండి వుంటుంది వైరస్, హ్యాకింగ్ వగైరా వాటి పైన! సో, వైరస్ల వ్యాప్తికి అడ్డంకి గా వారి పరిగ్ఞానం వుంటుంది.

3)"ఓపెన్‌ సోర్సు ప్రలు వ్రాసేవార్పంచంలో వైరస్ దాగి ఉండటం కష్టం. బైనరీ ఫైల్లకు అంత ప్రాముఖ్యత లేదు. ఈ రెండు కారణాల వల్ల వైరస్ లకు వ్యాపించటం మరీ ఇబ్బందికరం."

ANS: ఈ స్టేట్ మెంట్ కి అర్ధం వేరు. వైరస్ ఎలాంటి నమ్మకమైన సాఫ్ట్ వేర్ రూపంలొ దాక్కొటానికి వీలులేదు. అవసరం ఐతే మనం కొడ్ తీసి, దాని బిహేవియర్ ని అర్ధం చేసుకుని, వైరస్ ని పట్టేయ్యొచ్చు. "బైనరీ ఫైల్లకు అంత ప్రాముఖ్యత లేదు." అని ఎందుకు అనవలసి వచ్చిందొ నాకు కూడా అర్ధం కాలేదు :)

4) "సాధారణంగా *నిక్స్ లలో డీమన్స్ పనిచేస్తుంటాయి, అవికొన్నిసార్లు సూపర్ యూజర్ ఐ.డి కి వెళ్లి కొన్ని ముఖ్యమైన పనులు చేసి మళ్లీ వెనక్కి వస్తుంటాయి, ఆ ముఖ్యమైన పనులు చేసే కోడులో ఏవైనా లోపాలుంటే వాటిని వాడుకొని హ్యాకర్లు (బ్రేకర్లు) సిస్టమ్స్ లోకి దూరుతుంటారు."

ఈ మాత్రం అవకాశం కూడా హ్యాకర్లకి ఇవ్వకుండా, ఈ డీమన్స్ ని వాటి కోసం ప్రత్యేకంగా కేటాయింపబడిన యూజర్ ఐ.డి లొ రన్ అయ్యేట్టు జాగ్తత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా అన్ని అవ్వలేదనుకొండి. ఉదాహరణకి, అపాచి డీమన్ అపాచి అనే యూజర్ స్పేస్లొ రన్ అవతుంది. నాకు తెలిసి ఒక్క కెర్నల్, దానితొ సంభాషించే అప్లికేషన్స్ కి సూపర్ యూజర్ అనుమతులు వుంటే చాలు. వాటిలొ లొపాలుంటే మాత్రం కళ్ళు మూసుకుని, ఆ లోపాన్ని కనిపెట్టిన హ్యాకర్ కి దణ్ణం పెట్టి, మన సిస్టం ని అప్పగించటమే :) కాకపొతే, ప్యాచ్ మీద వెంటనే పని చేయటానికి వేలమంది ఔత్సాహికులు సిద్దంగా వుంటారు ఒపెన్ సోర్స్ లొ.

ఈ టాపిక్లొ మాట్లాడటానికి పరిగ్ఞానం చాలా అవసరం. నాకు తెలిసి నాకు అంత సీన్ లేదు. నేను చెప్పినవాటిలొ కూడా అక్కడక్కడ తప్పులు ఉండొచ్చు. తప్పుగా ఎదైనా తొస్తే నిరభ్యంతరంగా ఇక్కడ పంచుకొగలరు.

సూర్యుడు గారు సరిచేసినందుకు

సూర్యుడు గారు సరిచేసినందుకు కృతఙతలు.
ఈ టపా వ్రాయటానికి తీసుకున్న మూలాలని క్రింద తెలిపాను. ఈ పద్దతికి (మూలం తీసుకొని అనువదించటం) సూచనలు తెలుపగలరు.
http://www.bablotech.com/2009/02/05/5-reasons-why-linux-is-secure-against-viruses-than-windows/
http://librenix.com/?inode=21
http://www.theregister.co.uk/2003/10/06/linux_vs_windows_viruses/

off-topic ఇక్కడ వ్యాసం లో

off-topic
ఇక్కడ వ్యాసం లో ఉన్న విషయాన్ని గురించి ప్రతిస్పందించడం లేదు :)
ఇకపై ప్రతి వ్యాసంతో పాటు చివర్లో మూల వ్యాసాల లంకెలు చేర్చమని
సూచన మాత్రమే చేయదలిచాను :P ధన్యవాదములు

నాకు తెలిసి లినక్సు లో వైరస్

నాకు తెలిసి లినక్సు లో వైరస్ రాయడం చాలా సులభం, నేను ఇంతకు ముందు రాసాను కనుక చెబుతున్నాను, exe files అంటే అదేదో different format files కాదు, అది machine code ఏ కానవసరంలేదు, a simple bash program can serve as a virus, exe files, bat files, bin files అన్నీ ఒక application కోసం చేయబడినవి, వాటిని execute చెయ్యగలిగే environment ఉంటే అది linux లో అయినా ఒకటే windows కైనా ఒకటే. "Little black book of computer viruses" by Mark Ludwig చదివితే windows కోసం రాసే viruses, దాని history, approach ఉంటుంది, ఇక linux viruses విషయానికొస్తే user చేత మన virus execute చయ్యబడాలి, అది target చేసుకొని user ఏ program aite run చేస్తాడో దానికి అనుసంధనించగాలిగితే అది చాలా easy. linux లో virus లు ఇప్పటికే చాలా ఉన్నాయి, మచ్చుక్కి

Viruses
* Alaeda - Virus.Linux.Alaeda
* Bad Bunny - Perl.Badbunny
* Binom - Linux/Binom
* Bliss
* Brundle
* Bukowsk
* Diesel - Virus.Linux.Diesel.
* Kagob a - Virus.Linux.Kagob.
* Kagob b - Virus.Linux.Kagob.
* MetaPHOR (also known as Simile)
* Nuxbee - Virus.Linux.Nuxbee.
* OSF
* Podloso - Linux.Podloso (The iPod virus)
* Rike - Virus.Linux.Rike.1627
* RST - Virus.Linux.RST.a (known for infecting Korean release of Mozilla Suite 1.7.6 and Thunderbird 1.0.2 in September 2005)
* Satyr - Virus.Linux.Satyr.a
* Staog
* Vit - Virus.Linux.Vit.
* Winter - Virus.Linux.Winter.
* Winux (also known as Lindose and PEElf)
* Wit virus
* ZipWorm - Virus.Linux.ZipWorm

[edit] Worms

* Adm - Net-Worm.Linux.Adm
* Adore
* Cheese - Net-Worm.Linux.Cheese
* Devnull
* Kork
* Linux/Lion
* Mighty - Net-Worm.Linux.Mighty
* Millen - Linux.Millen.Worm
* Ramen worm
* Slapper
* SSH Bruteforce
కాకపోతే linux లో virus రాయాలంటే దాని architecture FSSTND తెలిసి ఉండాలి, FSSTND follow కాకపోవటం వలన కొన్ని virus లు కొన్ని distributions ని effect చెయ్యలేవు, Ex: suse FSSTND follow కాదు చాలా విషయాల్లో, so, అందులో heck create చెయ్యడం అంటే దాని fs architecture తెలిసుండాలి.

ఇక linux boxes లో ఒక file execute చేస్తున్నాడంటే అతనికి దాన్ని debug చేసుకొనే capacity ఉండాలి.
Developers/enthus ఎలాంటి scenario నుంచైనా recover చేసుకోగలరు,

@సన్నిగాడు, మీరన్నది నిజమే.

@సన్నిగాడు, మీరన్నది నిజమే. లినక్స్ లో ప్రోగ్రామింగ్ కి ఉండే వీలు ఈ పనిని మరింత సులభం చేస్తుంది. విండోస్ లో లేదని కాదు, కాని స్క్రిప్టింగ్, ప్రోగ్రామింగ్ లాంటివి *నిక్సులలో పప్పు, చారు లాంటివి. విండోస్ లో అవి అలా నిత్య కార్యక్రమాల్లా కాక ఎప్పుడో ఒకసారి తినే పెళ్ళి భోజనంలా ఉంటుంది :P. కాబట్టి ప్రస్తుతానికి లినక్స్ వాడే వాడుకరుల్లో ఎక్కువ జనాభా ఆ పప్పు, చారు సేవించేవాళ్ళే కనుక ఇప్పటివరకు ఏ గొడవా లేదు, వాళ్ళకి ఆ లొసుగులన్నీ ఎంతోకంత తెలుసినందువల్ల. కాని, ఒకవేళ తెలియని పక్షంలో కూడా, లినక్స్ లో ఉన్న యాజమాన్య సిద్దాంతాల దృష్ట్యా(పైన Naagas రాసినదాంట్లో ఆయన ఆల్రెడీ చెప్పారు) ఒక దొంగ ప్రోగ్రాం(malicious program) సాధారణ వాడుకరి ద్వారా సిస్టంకి పెద్ద ఎత్తున హాని చేసే అవకాశం తక్కువ.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.