లోకల్ హోస్టు లో వెబ్సైటు

Image
Featured Image
లక్ష్యం: 

మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా,  అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో  ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో  ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. 

౧. సినాప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(సిస్టం > ఆడ్మినిస్ట్రేటర్) తెరిచి క్రింద తెలిపిన సాఫ్ట్వేర్ లను ఇన్‌స్టాల్ చేయండి.

mysql-server
php5
apache2
php5-mysql
libapache2-mod-php5

కమాండ్ ద్వారా ఐతే క్రింద తెలిపిన కమాండు వాడండి.

sudo apt-get install mysql-server php5 apache2 php5-mysql libapache2-mod-php5

౨. mysql లో ఒక డేటా బేస్ ను సృష్టించాలి. దీని కోసం క్రింది కమాండ్ లను వాడండి. టెర్మినల్ తెరిచి ,

create database <మీ డేటా బేస్ పేరు>;

ఉదాహరణ : create database wordpress;

grant all privileges on <మీ డేటా బేస్ పేరు>.* to root@localhost;

ఉదాహరణ : grant all privileges on wordpress.* to root@localhost;

flush privileges;
exit;

౩. అప్యాచీ ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి, దీనికోసం క్రింది కమాండు ను వాడండి

sudo /etc/init.d/apache2 restart

ఇప్పుడు మీరు సైటు నిర్మించుకోవాలంటే, స్క్రాచ్ నుండి మొదలుపెట్టొచ్చు, లేదా ఉన్న కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లలో ఒకదాన్ని దించుకుని స్థాపించుకోవచ్చు. ఉదాహరణకి వర్డుప్రెస్ స్థాపనకి ఈ పాఠ్యాంశం చూడండి. అక్కడ unzip చేసిన ఫోల్డర్ ని /var/www లో పెట్టండి. అప్పుడు మీ సైటు http://localhost/<folder name> వద్ద ఉంటుంది. ఒకవేళ మీకు కావల్సింది మీరు సొంతంగా స్క్రాచ్ నుండి నిర్మించుకునే సైటే ఐతే, /var/www/ లో html ఫైళ్ళతో మొదలుపెట్టండి. ఆ ఫైళ్ళలో రాసిన వాటిని చూస్కోవడానికి http://localhost/ కి వెళ్ళండి.

 

వ్యాఖ్యలు

i wish i had seen this page

i wish i had seen this page earlier :-( kind of went thru all the mistakes one could do at every step and finally got my site working. it was nice learning experience but came at a cost..

very nice technical articles. appreciate them.