విండోస్‌లో వాడుకోగలిగే ఓపెన్‌ సోర్సు అప్లికేషన్‌లు

Image
Featured Image
ఓపెన్‌ సోర్సు
farm4.static.flickr.com
http://farm4.static.flickr.com/3229/2610375842_6b50ca6984.jpg
లక్ష్యం: 

ఖర్చు లేకుండా అవసరాలను తీర్చేవి ఓపెన్‌ సోర్సు సాఫ్ట్వేర్లు. విండోస్ లో ముఖ్యంగా వాడే వాటి జాబితా ఇక్కడ చూద్దాం.

1. మోజిల్లా ఫైర్ ఫాక్స్ : ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లాగా ఇది కూడా ఒక బ్రౌజర్. 24 గంటల్లో అతి ఎక్కువగా (80,02,530) డౌన్లోడ్ చేసుకోబడ్డ సాఫ్ట్వేర్ గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డు ఉంది. దీన్ని 47.1 శాతం మంది వాడుతున్నారు.

2. తండర్ బర్డ్ : మోజిల్లా వారి నుంచి మరొక సాఫ్ట్వేర్. ఇది ఒక డెస్క్ టాప్ ఈమైల్ క్లైంటు. మంచి స్పాం ఫిల్టర్ తో పాటుగా చాలా ఫీచర్లు ఉంటాయి.

3. ఓపెన్‌ ఆఫీస్ : మైక్రో సాఫ్ట్ ఆఫీసు దర, తక్కువలో తక్కువ అంటే రూ.7500/-. అవే ఫీచర్లు ఓపెం ఆఫీసు అందిస్తుంది కానీ ఇది ఉచితంగా లభిస్తుంది.

4. ఇంఫ్రా రికార్డర్ :  నీరో లాంటి సీడీ బర్నర్ ఇది.

5. జింప్ : అడోబ్ ఫోటో షాప్ లా ఇది కూడా ఒక ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేరు.

6. పిజియన్‌ : అన్ని రకాల ఐడీలతో (యాహూ, జీ-మైల్ మో||) ఒకే సారి చాట్ చేయగలిగే సౌకర్యం కల్పించే ఇ్న్‌స్టంట్ మెసెంజర్.

7. వీ.ఎల్.సీ మీడియా ప్లేయర్ :  క్రింద తెలిపిన ఫార్మాట్లను సపోర్ట్ చేసే మీడియా ప్లేయర్.

MPEG (ES,PS,TS,PVA,MP3), AVI, ASF / WMV / WMA, MP4 / MOV / 3GP, OGG / OGM / Annodex, Matroska (MKV), WAV (incuding DTS), Raw Audio: DTS, AAC, AC3/A52, Raw DV, FLAC, FLV (Flash), MXF, Nut, Standard MIDI / SMF, Creative™ Voice.

Real Player ఫార్మాట్ ను పాక్షికంగా సపోర్ట్ చేస్తుంది.

8. కాం విన్‌ యాంటీ వైరస్ : వైరస్ లను ఒక్కింత బాగానే కనిపెట్టగలుగుతుంది.

9. 7-జిప్ : WinZip, WinRAR లాంటి కంప్రెషన్‌ సాఫ్ట్వేర్ ఇది. వాటి రెండింటికంటే బాగా కంప్రెస్ చేయగలదు.

10. మీడియా కోడర్ : ఒక ఫార్మాట్ లో ఉన్న వీడియో/ఆడియో ను మరొక ఫార్మాట్ లోకి మార్చ గలిగే సాఫ్ట్వేర్. చాలా రకాల ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేస్తుంది.

11. ఫైల్ జిల్లా : FTP, FTPS మరియూ SFTP క్లైంటు ఇది. విండొస్ కోసం తయారు చేయబడ్డ FTP క్లైంట్లలో ఉత్తమమైందిగా దీన్ని పేర్కొన వచ్చు.

వ్యాఖ్యలు

sir naa daggara marikonni

sir naa daggara marikonni opensource applications samacharam vunnadi vatini ela post cheyayalo telupagalaru, meeru rasina applications bagunnai

ప్రస్తుతానికి మీరు

ప్రస్తుతానికి మీరు ఇక్కడే(కామెంటు) వాటి సమాచారాన్ని వ్రాయండి, మేము వాటిని టపాలోకి చేరుస్తాము. త్వరలోనే ఉత్సాహం ఉన్న వారు, వారంతట వారే వ్రాయగలిగే వీలు కల్పించే ప్రయత్నంలో ఉన్నాం.

notepad++,fotograpics for

notepad++,fotograpics for edit photos (it not requires no memory space,it runs without installation.I try to tell some useful applications as earlier.please create a forum sir.

www.portableapps.com

www.portableapps.com websitelo pendrivelo copy chesukuni ekkadina vadukone softwarelu chala vunnai.okasari vadi chudandi..

మీ లాంటి వారి అవసరం చాలా

మీ లాంటి వారి అవసరం చాలా ఉంది. మీరు మీ సహాయాన్ని టెక్‌సేతుకు ఎలా అందించగలరో, ఏ కోణంలో మీకు నైపుణ్యం ఉందో తెలుపగలరు. లినక్స్, విండోస్, ఇంటెర్నెట్ మరియూ ప్రాధమికాంశాలు.

అలాగే మీ గురించి క్లుప్తంగా చేప్పగలరు. మీ CV పంపితే ఒక ఓవర్ వ్యూ వస్తుంది. ఈ వివరాలని contact@techsetu.comకి మైల్ చేయగలరు.

మీకు తెలిసిన విషయాలను ఒక పోస్టు రూపంలో వ్రాసి మాకు మైల్ చేయండి. మీకు ఒక ఖాతా తెరిచి, మీ పేరుతో ఆ టపాను వ్రాస్తాం. ఇలా రెండు మూడు టపాల తరువాత మీకు పాస్వర్డ్ ఇస్తాము.

nenu naa okarojulo

nenu naa okarojulo pampagalanu.. nenu oka degree final year computer studentni. naku computer meeda vunna interest valana ila computer tipsnu pamputuntanu.naku word,excel,html,ppt,internet vanti vati meeda avagahana vundi vatini nenu tappakunda post chestuvuntanu sir.

nenu naa okarojulo

nenu naa okarojulo pampagalanu.. nenu oka degree final year computer studentni. naku computer meeda vunna interest valana ila computer tipsnu pamputuntanu.naku word,excel,html,ppt,internet vanti vati meeda avagahana vundi vatini nenu tappakunda post chestuvuntanu sir.

చాలా సంతోషం రామాంజలేయులూ! మీ

చాలా సంతోషం రామాంజలేయులూ! మీ మైల్ కోసం వేచి చూస్తున్నాము.

nenu ippatike rendu computer

nenu ippatike rendu computer tipsnu pampichanu.
vatilo okati software kaga marokati computer tip.
alage naa biodatanu kooda pampichanu.

Hello Sir', desktop

Hello Sir',
desktop మీద మనం చేసే activities ని record చేసి వీడియో ఫైల్స్ గా మార్చుకునే అవకాశం ఉన్న మంచి ఫ్రీవేర్ సాఫ్ట్వేర్స్ గురించి కాస్త తెలియజేయగలరని మీకు నా మనవి.

సురేష్ గారూ మీరు అడిగినట్టుగా

సురేష్ గారూ మీరు అడిగినట్టుగా టపా వ్రాసాను. చూడగలరు.

Thank u Sir. కాని ఇది ఎవిఐ

Thank u Sir.
కాని ఇది ఎవిఐ పైల్స్ కి చాలా ఎక్కువ స్పేస్ తిసుకుంటొంది. swf కి బాగుంది. Basic sreen Recorder ఆనే సాఫ్ట్వేర్ ఎవిఐ పైల్స్ కి చాలా తక్కువ స్పేస్ తిసుకుంటొంది. కాని Quality బాగుందో లేదో తెలియటం లేదు. ఒకసారి మీరు దీన్నిtry చేసి చెప్పండి plzzz.

మీరు క్యాం స్టూడియో లో

మీరు క్యాం స్టూడియో లో options లో video-options ను ఒక సారి చూడండి, మీకు కావలసిన సెట్టింగులు, క్వాలిటీ, కంప్రెసర్లు మార్చి చూడండి. మీరు చెప్పిన సాఫ్ట్వేర్ క్వాలిటీ నాకు నచ్చినా మేకు సరిపడక పోవచ్చు, కావున మీరే ప్రయత్నించి చూడటం మేలు.

విడివిడి గా ఉన్న వీడియో

విడివిడి గా ఉన్న వీడియో ఫైల్స్ ను ఒకటిగా కలిపే ఒక మంచి freeware or open source Software గురించి తెలియజేయగలరు.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.