విండోస్, లినక్సులలో దేన్నుంచైనా పి.డి.ఎఫ్ కి మార్చే పద్దతి

Image
Featured Image
లక్ష్యం: 

చాలా సార్లు మన కంప్యూటర్/ల్యాప్టాప్ నుండి అక్కడికక్కడే ప్రింట్ తీస్కోవడం కుదరదు. ఒక ఫైల్ లో బద్రపరుచుకుని తర్వాత ప్రింట్ తీస్కోవడమే మార్గంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే పద్దతి చాలా సహాయపడుతుంది.

విండోస్ వారు:

౧. ఇక్కడి నుండి పి.డి.ఎఫ్ క్రియేటర్ (PDF Creator) ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్కోండి. (.exe ఫైల్ ని దించుకోండి)

౨. అది ఇన్స్టాల్ చేశాక, మీరు ఏదైనా బొమ్మని కానీ, పత్రాన్ని కానీ, వెబ్ పేజి ని కానీ ఒక పి.డి.ఎఫ్ కి మార్చాలి అనుకోండి. ఇక్కడ ఉదాహరణకి నేను IRCTC లో బుక్ చేసిన టికెట్ పేజి ని పి.డి.ఎఫ్ లోకి బద్రపరుస్తున్నాను.

౩. మీరు సేవ్ చేయాలి అనుకున్న పేజి తెరిచి, Ctril+P నొక్కండి. ప్రింట్ విండో వస్తుంది. ఆ విండో లో క్రింద చూపించిన విధంగా మెనూ లోంచి PDF Creator ని ఎంచుకోండి.

౪. ఇప్పుడు ఈ క్రింద బొమ్మల్లో లాగా ఫైల్ సేవ్ చేస్కోండి. సేవ్ అవ్వగానే ఫైల్ ఓపెన్ అవుతుంది.

ఇవి ఎలా వదిలేసినా పెద్ద సమస్యేమీ ఉండదు.

ఫైల్ ఎక్కడ ఏ పేరుతో సేవ్ చేయలో ఎంచుకోండి.

 

లినక్సు వారు:

౧. మీరు నయ పైసా పని కూడా చేయకుండానే అన్ని అమర్చిపెట్టబడ్డాయి! :) మీరు చేయాల్సిందల్లా మీరు సేవ్ చేయాల్సిన బొమ్మని గాని, పేజి ని గాని, పత్రాన్ని కానీ తెరిచి, Ctrl+P కొట్టండి.

౨. క్రింద చూపించిన బొమ్మలో లాగా, Print to file ఎంచుకోండి. క్రింద ఆ ఫైల్ ఎక్కడా ఏ పేరుతో సేవ్ చేయాలో సెట్ చేస్కోండి. అంతే!

 

ఇంక ఆ ఫైల్ సేవ్ చేస్కున్నాక వీలు కుదిరినప్పుడు ప్రింట్ చేసుకోవడమో, లేదా ఫైల్ రూపేణానే వాడుకోవడమో చేస్కోవచ్చు.

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.