- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
విండోస్ లో లినక్సు అనుభవం - సిగ్విన్ (cygwin)
లక్ష్యం:
మసాలా దోస తినే వాడికి బ్రెడ్ ముక్కలు ఎలా రుచించవో లినక్సు వాడే వాడికి విండోస్ లో పని చేసే అవసరం పడినా అలాగే ఉంటుంది. అందుకు ఒకానొక ముఖ్య కారణం లినక్సు లో ఉండే టెర్మినల్ సౌకర్యం, రిమోట్ గా పనిచేసే వీలు లాంటివి విండోస్ లో బొత్తిగా లేకపోవడమే. అలాంటి వాళ్ళ కోసం సిగ్విన్ అని అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉంది. అది ఇన్స్టాల్ చేస్కోవడం, వాడుకోవడం వగైరా చూద్దాం.
సిగ్విన్ ఇన్స్టాల్ చేస్కోవడం
ఈ సెటప్ ఫైల్ దించుకుని, దాన్ని డబల్ క్లిక్ చేయండి. ఈ క్రింది తెరపట్లు చూస్తూ వాటి సాయంతో ఇన్స్టాల్ చేస్కోండి.



ఈ క్రింద తెరపట్టులో డౌన్‌లోడ్ చేసిన ఫైళ్ళు ఎక్కడ పెట్టాలో అడుగుతుంది. మీ హార్డ్ డిస్క్ మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేలా చూస్కోండి.

ఈ క్రింద తెరపట్టులో మీ ఇంటర్నెట్ కనెక్షన్ కు తగ్గట్టు సెట్టింగులు మార్చాలి.

ఈ క్రింది తెరపట్టులో చూపించిన సైట్లలోంచి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి, ప్యాకేజీలు దించుకోవడానికి.

ఈ క్రింది తెరపట్టులో మనకు కావల్సిన సాప్ట్వేర్లు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. "View" బటన్ క్లిక్ చేస్తూ ఉంటే, ప్యాకేజి వివరాలు రకరకాలుగా చూపిస్తుంది. ప్రయత్నించి చూడండి.

ఇక "Next" కొట్టగానే డౌన్‌లోడ్ చేయడం మొదలుపెడుతుంది, డౌన్‌లోడ్ అయిపోగానే అవే ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఎన్ని ప్యాకేజ్‌లు ఎంచుకున్నాం అన్నదాన్ని బట్టి చాలా టైమే పట్టొచ్చు. అది అవుతుంటే మీరు వేరే పనులు చేస్కోవచ్చు.
సిగ్విన్ వాడటం
మరిన్ని ప్యాకేజ్ లు ఇన్స్టాల్ చేస్కోవడం
లినక్సు లో ఎక్కువగా వాడేవన్ని సిగ్విన్ లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. మీరు సిగ్విన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా అప్లికేషను టిక్ చేయడం మర్చిపోవడమో, లేదా తర్వాత ఇన్స్టాల్ చేస్కోవాల్సి రావడమో జరగొచ్చు. అప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఏ సెటప్ ఫైల్ ని ఐతే ఇన్స్టాల్ చేస్కొడానికి వాడారో అదే సెటప్ ఫైల్ అదనపు సాఫ్ట్వేర్ లను ఇన్స్టాల్ చేస్కొడానికి కూడా ఉపయోగించండి. మళ్ళీ దాన్ని డబల్ క్లిక్ చేస్తే పైన చెప్పిన పద్దతే పునురావ్రుత్తముతుంది. ఈసారి మీకు కావాల్సిన అదనపు సాఫ్ట్వేర్ లు మార్క్ చేస్కుంటే వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేస్తుంది. ఉదాహరనికి మీకు ఆర్-సింక్ (rsync) అనే ప్యాకేజ్ కవలనుకుండం, అప్పుడు కింది విండో లో "view" అని ఉన్న బటన్ ని దాని పక్కన "Full" అని వచ్చేదాకా క్లిక్ చేస్తూ ఉండండి. అలా వచ్చాక, "Search" అని ఉన్న చోట rsync అని ఇవ్వండి. కింద చూపించిన ప్యాకేజ్లలో మీరు అనుకున్నది ఏదో చూసి టిక్ చేస్కోండి. "Next" కొట్టడం తోనే ఇన్స్టాల్ కావడం మొదలవుతుంది.

సిగ్విన్ టెర్మినల్ వాడటం
"All programs > Cygwin" లో Cygwin Bash Shell అన్నదాన్ని క్లిక్ చేస్తే లినక్సు టెర్మినల్ లాగా ఒకటి తెరుచుకుంటుంది. ఇది అచ్చం లినక్సు టెర్మినల్ లాగానే వాడుకోవచ్చు. కాకపోతే అంతే అందంగా, అంతే ఫ్లెక్సిబుల్ గా ఉండదనుకోండి. కానీ చాలావరకు బాగానే ఉంటుంది. విండోస్ లో మామూలుగా టెర్మినల్ చూట్టానికి అంతా బాగోదు. ఆ టెర్మినల్ విండో టైటిల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి, "Properties" ఎంచుకోండి. అందులో "Font", "Colors" వగైరాలను మీకు నచ్చినట్టు మార్చుకోండి. అలా చేస్తే కొంత మెరుగ్గా ఉంటుంది.(క్రింది తెరపట్లు చూడండి)


సిగ్విన్ తో మీ విండోస్ లో ssh సర్వర్, rsync సెటప్ (అసలు అవేంటో) ఎలా చేస్కోవాలో వచ్చే టపాలో చూద్దాం!:)


వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి