విస్టాలో ఒక్క డ్రైవ్ మాత్రమే ఉంది! రెండు కావాలంటే ఎలా?

Image
Featured Image
విస్టాలో డ్రైవ్ ష్రిక్ చేయటం!
www.gamespot.com
http://i193.photobucket.com/albums/z174/shoeman121/vista.jpg
లక్ష్యం: 

ఒక డ్రైవ్‌ను, అందులోని సమాచారానికి హాని కలగకుండా, రెండింటిగా విభజించటం ఎలా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకొంటాం.

కొన్ని కంప్యూటర్లలో ఒకే డ్రైవ్ ఉండే అవకాశం ఉంది. అటువంటి వాటిలో ఇంకొక డ్రైవ్ ను పొందటానికి ఈ క్రింది ప్రక్రియ తోడ్పడుతుంది.

1. స్టార్ట్ బటన్ను నొక్కి, My Computer మీద Right-Click చేసి, Manageను సెలెక్ట్ చేసుకోవాలి.

2. కొత్తగా తెరుచుకున్న విండోలో, Disk Managementను క్లిక్ చేయండి. కుడి వైపు క్రింద భాగంలో మీ పార్టిషన్ లను చూపుతుంది. ఎందులో ఎక్కువ ఖాళీ ఉందో, ఆ పర్టిషన్ మీద Right-click చేసి, Shrink Volumeను ఎంచుకోండి.

3. ఇలా చేయగానే ఒక కొత్త విండో తెరుచుకొని అందులో ఎంత పరిమాణం గల పార్టిషన్ను వెలికి తీయగలదో చూపుతుంది. Shrink అన్న బటన్ను నొక్కగానే కొత్త పర్టిషన్ను, ఈ పార్టిషన్ యొక్క ఖాళీని ఉపయోగించుకొని తయారు చేస్తుంది.

ఒక వేళ మీకు 0MB available అని వస్తే, de-Fragment చేసి మరొక సారి ప్రయత్నించండి.

డీ-ఫ్రాగ్ మెంట్ ఎలా చేయాలో అన్నది ఇక్కడ చూడండి.

క్రొత్త laptop లేదా desktop కొన్న వారు, ఏ data సేవ్ చెయ్యడం, applications install చెయ్యడం కంటే ముందే పైన చెప్పిన విధంగా Shrink Volume చేయటం ద్వారా ఎక్కువ స్పేస్ ను వెలికి తీసి కొత్త డైవ్ గా మార్చగలం.

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.

CAPTCHA
క్షమించాలి, మీరు యంత్రమో, మనిషో నిర్థారించాలి.