- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
వెబ్ సర్వీసు
లక్ష్యం:
వెబ్ సర్వీసు అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని వలన ఉపయోగాలు ఏంటో తెలుసుకోవడం.
వెబ్ సర్విసు, భవిష్యత్తు విలువలలో, ఈ-వ్యాపారాలలో మార్పు తెచ్చే ఒక సాంకేతిక పరిజ్ఞానం. వెబ్ సర్వీసు మన అప్లికేషన్‌ను, వెబ్ అప్లికేషన్ గా మార్చుతుంది. వెబ్ అప్లికేషను దాని పనిని అదే ప్రకటిస్తుంది లేదా దాని ఉనికిని మిగిలిన ప్రపంచానికి తెలియజేస్తుంది. నెట్వర్క్ ద్వారా ప్రపంచం లోని వివిధ రకాల కంప్యూటర్లు, విస్తరించి ఉండటానికి ఈ వెబ్ సర్వీసు తనవంతు వాతావరణాన్ని అమరుస్తుంది.
వెబ్ సర్వీసు గురించి క్లుప్తంగా -
- అప్లికేషను లోని ముఖ్య భాగాలలో ఒకటి.
- ఓపెన్ ప్రోటోకాల్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- ఇంతకు ముందు చెప్పినట్టు తనను తాను వివరిస్తుంది, తనలో తను కలిగిఉంటుంది.
- యుడిడిఐ ద్వారా కనుగొనవచ్చు.
- మరొక అప్లికేషను చేత ఉపయోగింపబడవచ్చు.
- దీనికి పునాది యక్స్ యమ్ యల్.
వెబ్ సర్వీసు కు మూలకారణం యక్స్ యమ్ యల్, మరియు హెచ్ టి టి పి.
యక్స్ యమ్ యల్( యక్సటెన్డెడ్ మార్కుప్ లాంగ్వేజ్ )
కఠినతరమైన వార్తలను, పనులను వివిధ రకాల ప్లాట్ ఫోరమ్స్ మరియు ప్రోగ్రామింగ్ భాషల మధ్య విస్తరింప చేయుటకు ఉపయోగించే భాషను యక్స్ యమ్ యల్ అంటారు. ఇది ప్లాట్‌ఫాం ఇండిపెండెంట్, అంటే, ఒక ఆపరేటింగ్ సిస్టం మీదనో, ఒక లాంగ్వేజ్ మీదనో ఆధారపడదు.
హెచ్ టి టి పి (హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్)
హెచ్ టి టి పి ప్రోటోకాల్ సాధారణముగా వాడే ఇంటర్నెట్ ప్రోటోకాల్.
వెబ్ సర్విసు ప్రాధాన్యతలు
- ఇంటరోపెరబిలిటి(Interoperability):- సాధారణంగా ఒక అప్లికేషను ఒక ప్లాట్ ఫాం మీద మాత్రమే పనిచేస్తుంది. కానీ ఒక అప్లికేషను వెబ్ లో పనిచెయ్యాలంటే అది వివిధ రకాల ప్లాట్‌ఫాంల మీద పనిచెయ్యవలసి ఉంటుంది. ప్రపంచం లోని వివిధ రకాల ప్లాట్‌ఫాంల పై వివిధ రకాల సర్వీసులు ఒకేలా పనిచేసే ఒక చోటు - వెబ్ బ్రౌజరు. ఒక సాధారణ అప్లికేషను, వెబ్ లొ పని చేస్తున్నట్టైతే దాన్ని వెబ్ అప్లికేషను అంటారు.వెబ్ అప్లికేషనును వెబ్ బ్రౌజరు పరిమాణమునకు తగినట్లుగా రూపొందిస్తే అది ఏ బ్రౌజరు మీద నైన, ఏ ప్లాట్ ఫాం మీద నైన పనిచేస్తుంది. వెబ్ అప్లికేషనును యక్స్ యమ్ యల్ భాష లో రాయటం చాలా సులువు. కనుక ఒక అప్లికేషను వెబ్-అప్లికేషనుగా యక్స్ యమ్ యల్ భాషను ఉపయోగించి మార్చగలిగితే దానిని మనం వివిధ రకాల ప్లాట్ ఫాంల మీద ఉపయోగించుకోవచ్చు.
- ఫైర్వాల్ :- వెబ్ సర్వీసుకు ఫైర్వాలును ఎదిరించ గల సామర్ధ్యం ఉంది. వెబ్ సర్వీసు హెచ్ టి టి పి ప్రోటోకాలును ఉపయోగించటం ద్వారా సులువుగా ఫైర్వాలు లను దాటగలవు.
వెబ్ సర్వీసు పని తీరు
వెబ్ సర్వీసు ప్రొవైడర్లు ,వెబ్ సర్వీసును అందించేవారు, తమ వెబ్ అప్లికేషనులను వెబ్ సర్వీసు రేజేస్ట్రీ లో పొందుపరచి ఉంచుతారు. క్లైంట్ ,ఎవరైతే అప్లికేషన్ ను ఉపయోగించుకోవాలనుకొంటారో వారు, ఆ వెబ్ సర్వీసు రేజేస్ట్రీలో తమకు కావలసిన అప్లికేషను కోసం వెతకుతారు. క్లైంటుకు కావలసిన అప్లికేషను దొరికినప్పుడు ఆతను దానిని ఎంచుకోవచ్చును. ఇలా ఎంచుకొన్న అప్లికేషనును డౌన్ లోడ్ చేసుకొని దానితో బంధాన్ని ఏర్పరచుకొని దానిని ఉపయోగించుకొంటారు. అంటే ఇది పూర్తిగా వెబ్ సర్వీసు ప్రొవైడరుతో బంధాన్ని ఏర్పరచుకొని ఉపయోగించుకోవటమే.
వెబ్ సర్వీసు ఉపయోగాలు
- నెట్వర్క్ ద్వారా ఒక పనికి/సర్వీసుకి సంబంధించిన వివరాలను విస్తరింపచేయడానికి వెబ్ సర్వీసు ఉపయోగపడుతుంది. ఇలా వెల్లడి చేసిన పనిని/సర్వీసుని ఏ ఇతర అప్లికేషనులు ఐనా ఉపయోగించుకోవచ్చు.
- వెబ్ సర్వీసును ఉపయోగించి వివిధ రకాల అప్లికేషనులు తమ వివరాలను మరియు పనులను పరస్పరం పంచుకోవచ్చు. ఉదాహరణకు .నెట్ అప్లికేషను ,జావా వెబ్ సర్వీసు తో మాట్లాడగలదు అలాగే ఒక జావా అప్లికేషను, .నెట్ వెబ్ సర్వీసు తో మాట్లాడగలదు.
- వెబ్ సర్వీసు, సమాచారాన్ని పంపుటకు పరిశ్రమల ప్రమాణాలకు సరిపోయే ప్రోటోకాల్ ప్రమాణమును ఉపయోగిస్తుంది.దీని ద్వారా సమాచారాలు పంపడానికి ఖర్చు తక్కువై ,వాటి నాణ్యత పెరుగుతుంది.
- సాధారణంగా వెబ్ సర్వీసు ఉపయోగించే ప్రోటోకాల్ ప్రమాణము యస్ఓఏపి(SOAP) మరియు హెచ్ టి టి పి(HTTP). ఈ ప్రోటోకాల్ ప్రమాణాన్ని మాత్రమే కాక మనం ఇతర ప్రోటోకాల్ లను కూడా వాడవచ్చు. ఉదాహరణ: ఎఫ్ టి పి(FTP) మీద వెబ్ సర్వీసు. కనుక ఒక వెబ్ సర్వీసు ద్వారా ఎటువంటి సమాచారాన్ని ఐనా పంపించవచ్చు.
- వెబ్ సర్వీసు ఒక లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి దానిని ఏ సాంకేతిక పరిజ్ఞానములో రూపొందించిన ఇతర అప్లికేషన్ ఐన ఉపయోగించవచ్చు. దీని వలన బి2బి(బిజినెస్-బిజినెస్) బాగా వృద్ది చెందుతుంది.
- వెబ్ సర్వీసు తనను తాను వివరించుకుంటుంది కాబట్టి ఇతర వ్యాపార భాగస్తులు అప్లికేషన్ ను రూపొందించుటకు తక్కువ సమయం పడుతుంది మరియు ఖర్చును కూడా తగ్గించును.
- వెబ్ సర్వీసు ద్వారా, వ్యాపారస్తులు సులువుగా కావలసిన సర్వీసు ప్రొవైడర్స్ ను కలవవచ్చును. కనుక వ్యాపారము త్వరగా వృద్ది చెందుతుంది.
వెబ్ సర్వీసు మూలా భాగాలు
వెబ్ సర్వీసు మూడు మూల భాగాలను కలిగి ఉన్నది. అవి
- యస్ ఓ ఏ పి
- డబ్ల్యు యస్ డి యల్
- యు డి డి ఐ
యస్ ఓ ఏ పి (SOAP)
హెచ్ టి టి పి మీద అప్లికేషనుకు సంబంధించిన సమాచారాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడే యక్స్ యమ్ యల్ ఆధారంగా గలిగిన ప్రోటోకాల్ ను యస్ ఓ ఏ పి అంటారు.
- ఇది వెబ్ సర్వీసు తో మాట్లాడటానికి కావలసిన ప్రోటోకాల్
- యస్ ఓ ఏ పి అంటే సింపుల్ ఓబ్జేచ్ట్ యక్కెస్స్ ప్రోటోకాల్ (Simple Object Access Protocol)
- ఇది ఒక సమాచార ప్రోటోకాల్
- ఇది వార్తలను పంపించు ఒక నిర్మాణం
- ఇది ఇంటర్నెట్ ద్వారా సమాచారాలను పంపించుటకు రూపొందించబడినది.
- ఇది ప్లాట్ ఫాం స్వతంత్రము కలది.
- ఇది భాషా స్వతంత్రము కలది.
- ఇది యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి ఉంటుంది
- ఇది సులువైనది మరియు విస్తరింపదగినది.
- దీని ద్వారా మనం ఫైర్వాల్ లను సులువుగా దాటవచ్చు.
- ఇది డబ్య్లు౩సి ప్రమాణము
డబ్ల్యు యస్ డి యల్ (WSDL)
వెబ్ సర్వీసును గుర్తించటానికి మరియు వివరించటానికి ఉపయోగపడే ఒక యక్స్ యమ్ యల్ మీద ఆధారపడిన భాష డబ్ల్యు యస్ డి యల్.
- డబ్ల్యు యస్ డి యల్ అంటే వెబ్ సర్వీసు డిస్క్రిప్షన్ లాంగ్వేజ్.
- ఇది యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి పనిచేస్తుంది
- ఇది వెబ్ సర్వీసును వివరిస్తుంది.
- ఇది వెబ్ సర్వీసును గుర్తిస్తుంది.
- ఇది డబ్ల్యు ౩ సి ప్రమాణము.
యు డి డి ఐ (UDDI)
వివిధ రకాల పరిశ్రమలకు సంబందించిన సమాచారాలను పొందుపరచే ఒక సమాచార కేంద్రము యుడిడిఐ.
- యుడిడిఐ అనగా యునివేర్సల్ డిస్కవరీ డిస్క్రిప్షన్ మరియు ఇంటిగ్రేషన్ (Universal Discovery Description and Integration)
- ఇది వివిధ రకాల వెబ్ సర్వీసులను గురించిన సమాచారాన్ని పొందుపరుస్తుంది.
- ఇది తనలో పొందుపరచిన సమాచారాన్ని ఇతరులకు వివరిస్తుంది
- ఇది యస్ ఓ ఏ పి ద్వారా సమాచారాలను పంపుతుంది.
- ఇది మైక్రో సాప్ట్ .నెట్ ప్లాట్ ఫాం మీద రూపొందించబడినది.
మూలాలు: డబ్ల్యు౩స్కూల్స్, ట్యుటోరియల్స్‌పాయింట్, క్లాసు నోట్సు.



వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి