- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
సులభంగా వాడగలిగిన లినక్సులు - లినక్సు మింట్
లక్ష్యం:
మనలో చాల మందికి లినక్సు వాడాలని ఉంటుంది కాని వారికి అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
౧. ఏ లినక్సు మనకి సరిపోతుంది ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
నేను ప్రయత్నించి అందులో సులభమనిపించిన వాటిని ఇక్కడ మీ ముందుంచుతున్నాను. ఈ టపాలో అలాంటి ఒక లినక్సు గురించి తెలుసుకుందాం.
లినక్సు మింట్
నేను ఉపయోగించిన అన్నింటిలోకి చాలా సులభమైన లినక్సు. దీని గురించి క్లుప్తంగా:-
౧. ఇది డెబియన్ (debian) లినక్సు ఆధారంగా రూపొందించబడింది. ఉబుంటు కూడా డెబియన్ ఆధారంగా రూపొందించబడినదే. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఉబుంటు ఇంకా బాగుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఉబుంటు లో పని చేసే ప్రతి సాఫ్ట్వేర్ ఇందులో కూడా పని చేస్తుంది.
౨. ఇది లైవ్ సిడి గా లభ్యమవుతుంది. అంటే ఇది ఇన్స్టాల్ చేయకుండానే దీనిని ఉపయోగించి దీని పనితనం తెలుసుకోవచ్చు. నచ్చితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
౩. దీనిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. దీనిని ఇది వరకే ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టం తో పాటు గా వాడుకోవచ్చు(dualboot).
౪. ఇందులో నిత్యావసరమైన ప్రోగ్రాములు అన్ని ముందుగానే ఉంటాయి. మరలా ఇన్స్టాల్ చేయనక్కరలేదు.
౫. సాధారణ అంతర్జాల విహారానికి (web browsing) కి , పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి, చిన్న చిన్న కార్యాలయ అవసరాలకు (small office) ఇది ఖచ్చితంగా సరిపోతుంది.
౬. మనకు కావలిసిన డ్రయివర్లు (device drivers) 90 శాతం వరకు ఇందులోనే లభిస్తాయి.
౭. అంతర్జాలానికి ( internet connectivity ) అనుసంధానం కావడం కూడా చాలా సులువు( ).
౮. మనకు అవసరమైన సాఫ్ట్వేర్లు మింట్ ఇన్స్టాల్ ద్వారా దింపుకుని సులువుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానితో పాటు ఉబుంటు లో ఉన్న సినాప్తిక్ ఇందులో కూడా ఉంటుంది.
౧౦. ఇంతకు ముందు విండోస్ వాడుతూ కొత్తగా లినక్సు వాడలనుకునే వారికి దీని ఉపయోగించడం చాలా సులువు.
౧౧. అప్డేట్ కూడా "మింట్అప్డేట్" తో సులభంగా చేసుకోవచ్చు.
౧౨ . చూడటానికి కూడా చాలా బాగుంటుంది (visual appeal).
సరికొత్త వెర్షన్ (8) దింపుకోవడానికి ఇక్కడికి వెళ్ళండి.
మెయిన్ ఎడిషన్ గాని యూనివర్సల్ ఎడిషన్ ని గాని దింపుకోండి. మెయిన్ ఎడిషన్ అయితే మంచిది. తెర పట్టులు ఇక్కడ చూడండి.


వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి