- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
సూడో కమాండ్, పాస్ వర్డ్ లేకుండా!
లక్ష్యం:
సూడో కమాండ్ వాడే సమయం లో పాస్‌వర్డ్ ఇవ్వాల్సి రావటం తప్పనిసరి. ఒక వేళ మిమ్మల్ని ఇలా పాస్‌వర్డ్ అడగకుండా కమాండ్ రన్ కావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకొందాం.
౧. కమాండ్ ప్రాంట్ తెరవండి.
౨. క్రింద తెలిపిన కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పాస్‌వర్డ్ అడుగుతుంది. మీ పాస్‌వర్డ్ టైప్ చేయండి.
sudo adduser మీ-యుజర్-నేం sudo
ఒక వేళ మీ యూజర్ నేం మీకు తెలియకపోతే ఈ క్రింది కమాండ్ వాడటం వల్ల మీకు టెర్మినల్ లో మీ యూజర్ నేం కనబడుతుంది.
whoami
౩. క్రింద తెలిపిన కమాండ్ ఎంటర్ చేయగానే మీ టెర్మినల్ లో ఒక టెక్‌స్ట్ ఫైల్ తెరుచుకొంటుంది.
sudo visudo
౪. ఇందులో చివరి లైన్ తరువాత క్రింద తెలిపిన వాఖ్యాన్ని టైప్ చేయండి.
%sudo ALL=NOPASSWD: ALL
౫. తరువాత కంట్రోల్ బటన్ పట్టుకొని X నొక్కండి. తరువాత Y నొక్కి ఎంటర్ నొక్కండి.
అంతేనండి, ఇక మీరు ఈ యుజర్ తో సూడో కమాండ్ ఎప్పుడు వాడినా ఇక పాస్‌వర్డ్ అడగదు.


వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి