- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ఫైర్‌ఫాక్‌స్‌లో పాస్‌వర్డ్ లు బద్రపరిచే పద్దతి.
లక్ష్యం:
Firefoxలో పాస్ వర్డ్ లు సేవ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కంప్యూటర్లో చేయాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?
రోజూ మీరు పాస్ వర్డ్ టైప్ చేయవలసిన సంధర్బాలు చాలానే వస్తాయి. ప్రతి సారీ వాటిని టైప్ చేయటం విసుగ్గా ఉంటుంది. దీనికి Firefox పరిష్కారం అందిస్తుంది.
ఒక వేళ మీరు Firefox వాడాలనుకుంటే, ఇక్కడి నుంటీ డౌంలోడ్ చేసుకోగలరు.
మీరు పాస్ వర్డ్ టైప్ చేయగానే పైనుంచి ‘Save Password’ లేదా ‘Remember’, ‘Never for This Site’, ‘Not Now’ అన్న మూడు బటన్లు వస్తాయి. మొదటి దాన్ని నొక్కగానే పాస్ వర్డ్ సేవ్ చేసుకుంటుంది.
‘Never for This Site’ అన్నదాన్ని ఎంచుకుంటే, మీరు ఆ సైట్లో పాస్ వర్డ్ టైప్ చేసినా సేవ్ చేయాలా వద్దా అన్నది ఇక అడగదు. ఒక వేళ మీరు దీనిని నొక్కిన తరువాత మనసు మార్చుకుంటే, పాస్ వర్డ్ లు ఏ సైట్లకు గుర్తుంచుకోకూడదో, వాటి లిస్టు నుండీ మీకు కావల్సిన సైటును తీసివేయండి. ఎలా చేయాలో క్రింద వివరించబడినది.
‘Not Now’ అన్నదాన్ని ఎంచుకుంటే అప్పటికి మాత్రం ఊరుకుంటుంది, కానీ మీరు మరొకసారి వస్తే మల్లీ అడుగుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం….
ఎందుకు సేవ్ చేసుకోవాలంటే….. ప్రతిసారీ టైప్ చేసే అవసరం ఉండదు కనుక.
ఎందుకు చేయకూడదంటే, వీటిని ఇతరులు చూసే ప్రమాదముంది, కావున మీ పాస్ వర్డులు అన్నింటికీ కలిపి ఒక మాస్టర్ పాస్ వర్డ్ వాడాలి. ఎలా?
విండోస్ వాడుకరులకు :
Never for This Siteకు విరుగుడు : మీరు వాడే Firefoxలో పైన ఉన్న Tools మెనూలో చివరిలో ఉన్న Optionsను ఎంచుకోండి. అందులో Securityని ఎంచుకోండి, అక్కడ Exceptions అని రండు బటన్లు ఉంటాయి, వాటిలోంచి రెండవదాన్ని ఎంచుకోండి(Remember passwords for site పక్కనున్నదాన్ని). మీరు ఇంతకు ముందు ‘Never for This Site‘ అని ఎంచుకొన్న సైట్ల పేర్లు వస్తాయి, వేటికైతే పాస్ వర్డ్లను సేవ్ చేసుకోవాలనుకొంటారో వాటిని సెలెక్ట్ చేసుకొని Remove అన్న బటన్ను నొక్కండి. అలా చేసిన తరువాత మీరు ఆ సైటుకు వెళ్ళి పాస్ వర్డ్ ఇచ్చినప్పుడు passwordను గుర్తుంచుకోవాలో వద్దో అడుగుతుంది.
Master Password సెట్ చేయటం ఎలా : మీరు వాడే Firefoxలో పైన ఉన్న Tools మెనూలో చివరిలో ఉన్న Optionsను ఎంచుకోండి. అందులో Securityని ఎంచుకోండి, Use a master password అన్నదాన్ని టిక్ చేయండి. Password రెండు సార్లు, వచ్చిన విండోలో అడిగిన చోట్ల ఇవ్వండి. మీరు Firefoxను close చేసి తిరిగి ఓపెన్ చేస్తే, ఒక్కసారి తప్ప మల్లీ ఈ పాస్ వర్డ్ను అడగదు. మీరు గమనించినట్టైతే Master Passwordను ఎంచుకోవటానికి టిక్ చేసిన దాని క్రింద Saved Passwords అని ఒక బటన్ ఉంటుంది, ఇందులో మీ పాస్ వర్డ్లు అన్నీ చూడవచ్చు, Master Password సెట్ చేస్తే, ఆ Master Password ఎంటర్ చేయకుండా వీటిని చూడలేరు.
ఒక వేళ ఈ Master Password మరిచి పోతే?
క్రింద ఇచ్చిన లైన్ను Address barలో పేస్టు లేదా టైప్ చేసి Enter నొక్కండి, వచ్చిన పేజీలో Reset(కుడి వైపు క్రిందుగా) అన్న బటన్ను నొక్కండి. ఎవరైనా ఇలా చేసినప్పుడు మన passwordలు చూడగలిగితే కష్టం కదా మరి!! అందుకే Master Password మాత్రమే కాదు, గుర్తుంచుకొన్న అన్ని Passwordలూ వెళ్ళిపోతాయి,
chrome://pippki/content/resetpassword.xul -- దీనితో Master Passwordను Reset చేయ వచ్చు.
లినక్స్ వాడుకరులకు :
విండోస్ వాడుకరులకూ, లినక్స్ వాడుకరులకూ మద్య ఈ పద్దతిలో పెద్ద తేడా ఏమీ లేదు, విండోస్లో Toolsలో Optionsలోకి వెళ్ళినట్టుగా లినక్స్ లో Editలో Preferencesలోకి వెళ్ళటమే. మిగిలిన ప్రక్రియల్లన్నీ ఒక్కటే….
ఎలాంటి కంప్యూటర్ లో సేవ్ చేయాలన్నది మీరే నిర్ణయించుకోండి.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి



డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
15 వారాలు 1 రోజు క్రితం
20 వారాలు 3 రోజులు క్రితం
20 వారాలు 4 రోజులు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం