ls కమాండ్

లక్ష్యం: 

ls కమాండ్ కి తెలుగు మాన్యువల్.

ఉపయోగం: డైరెక్టరీ లో ఉన్న ఫైళ్ళ పట్టీని చూపటం
వాడకం: ls [ఆప్షన్] [ఫైలు]
వివరణ: ఫైళ్ళ గూర్చి సమాచారం ఇస్తుంది, సాధారణంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ గూర్చి. cftuvSUX లలో ఏదీ వాడనప్పుడు ఈ పట్టీని ఫైళ్ళ పేర్ల వారీగా అమర్చుతుంది.

ఆప్షన్లు

-a, --all . తో మొదల్లయ్యే వాటిని కూడా చూపుతుంది. ఇవి సాధారణంగా దాచబడి ఉంటాయి.
-A . మరియూ .. ను చూపదు
--author దీని -l తో పాటుగా వాడినప్పుడు, ప్రతి ఫైల్ యొక్క రచయిత పేరు దాని పక్కనే  తెలుపుతుంది.
-b, --escape ముద్రించబడలేని అక్షరాల బదులు ఆక్టల్ గుర్తులను చూపుతుంది.
--block-size=SIZE SIZE-బైట్ బ్లాకులను వాడుతుంది.
-B బ్యాకప్ లను చూపకు. అంటే ~ తో మొదలయ్యేవి.
-c -lt తో వాడినపుడు చివరిసారి మార్పిడి చేసిన సమయం చూపుతుంది.
-C పట్టీని కాలంల వారీగా చూపుతుంది.
--color[=WHEN] వివిద రకాల ఫైల్లను వేర్వేరు రంగుల్లో చూపుతుంది.
-d, --directory డైరెక్టరీలను మాత్రమే చూపుతుంది.
-f సార్ట్ చేయదు రంగులు చూపదు.
-g ఇది కూడా -l లాగానే కానీ రచయిత పేరు చూపదు.
-G పొడవాటి  పట్టీలో గ్రూపు పేరు చూపదు.
-h ఫైల్ల సైజులను ఎంబీ కేబీ లేదా జీబీలలో చూపుతుంది (మనకు అర్థమయ్యేలా)
-i ప్రతి ఫైలు ఇండెక్స్ నంబరు చూపుతుంది
-l ఫైల్లకు సంభందించిన అన్ని వివరాలూ పొడవాటి పట్టీ లో ఇస్తుంది.
-m పట్టీలోని పేర్లు కామాలతో వేరుపరిచి చూపుతుంది.
-N ప్రత్యేక గుర్తుల విలువ మార్చకుండా చూపుతుంది.
-o -l లానే కానీ గ్రూపు వివరాలు తెలుపదు.
-p డైరెక్టరీల పేర్లకు / జోడించు.
-r ఫైళ్ళ అమరికను తిరగేస్తుంది
-R లోలోపల ఉన్న ఫైల్లను గూర్చికూడా తెలుపుతుంది.
-s ప్రతి ఫైలుకూ కేటయించిన సైజును చూపుతుంది.
-U డైరెక్టరీలో ఉన్న విదంగా  చూపుతుంది.

ఇది ls కమాండ్ కి మాన్యువల్ పేజీలలో ఇచ్చిన వివరణ. యధాతదంగా అనువందించడం జరిగింది.

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.