- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
లక్ష్యం:
రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
ఉదాహరణకి ఈ సైటునే(టెక్‌సేతు) తీసుకుందాం. ఫీడు లంకెలు ఎక్కడున్నవి, ఎన్నున్నవనే విషయాలు రెండు విధాలుగా తెలసుకోవచ్చు. మీ విహారిణిలో చిరునామా పెట్టె(అడ్రస్ బార్)లో కుడిచేతి వైపు నారింజ రంగులో ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది నొక్కితే ఆ సైటుకి ఎన్ని ఫీడ్లు లభ్యత ఉంటే అన్నీ చూపిస్తుంది. లేదా ఆ సైటు వారే సైటులో ఏదో ఒక చోట ఫీడులంకెలు ఉంచుతారు. టెక్‌సేతుకి మూడు రకాల ఫీడ్లు ఉన్నాయి. మీ విహారిణి చూపించే నారింజరంగు ఫీడు ఐకాన్ మీద నొక్కితే ఆ మూడూ కనిపిస్తాయి. సైటులో పైన ఉన్న పట్టీలో కూడా(కుడివైపు ఉన్న నారింజరంగు బొమ్మ) ఫీడు లంకె ఉంచాము, అయితే సైటులో ప్లేసు సరిగ్గా సరిపోక ఒక్క ఫీడు మాత్రమే పెట్టడం జరిగింది. దాని మీద నొక్కినా సరే మీకు ఫీడు లంకె దొరికినట్టే.
ఈ ఫీడ్లు అనేక రకాలుగా చదువుకోవచ్చు. సరాసరి విహరినిలోనే వాటిని భద్రపరుచుకొని అప్పుడప్పుడు నొక్కి కొత్తగా ఎమొచ్చిందో తెలుసుకోవచ్చు. లేదా, గూగుల్ ఫీడు రీడర్ లాంటి ఉపకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి. ఫీడు లంకె మీద నొక్కినపుడు, ఆ ఫీడు చదవడానికి గాను, విహారిణి మీకు వివిధరకాల ఆప్షన్లు చూపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి అందులోనించి ఒకటి ఎంచుకోండి. ఇక ఏ చింతా లేకుండా సంతోషంగా బోల్డన్ని సైట్లు అందించే సమాచారాన్ని సునాయాసంగా చదువుకోవచ్చు.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
7 వారాలు 4 రోజులు క్రితం
7 వారాలు 6 రోజులు క్రితం
8 వారాలు 2 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
11 వారాలు 16 గంటలు క్రితం
13 వారాలు 1 రోజు క్రితం
13 వారాలు 1 రోజు క్రితం
13 వారాలు 3 రోజులు క్రితం