- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ప్రోగ్రామింగ్ వెబినార్లు
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాలు సులువుగా తెలుగులో నేర్చుకునేందుకు, ఐఐఐటి హైదరాబాద్ లో మాస్టర్స్ చేసిన అభిలాష్, ఇంకొంత మంది విద్యార్థులు కలిసి "తెలుగు లో వెబినార్లు" నెలకొల్పారు. దీనిలో భాగంగా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కి సంబందించిన అంశాల్లో నిపుణులు అంతర్జాలాన్ని వేదికగా చేసుకుని, ఉచితంగా తెలుగులో బోదిస్తారు. ఇవి విని, వారితో ముఖాముఖీ మాట్లాడడానికి మీకు కావలసినదల్లా అంతర్జాలంతో అనుసందానించబడిన కంప్యూటర్ మాత్రమే.
మీరు నేర్చుకోవాలి అనుకుంటే:
౧. టెక్ సేతుని మాధ్యమంగా చేసుకుని ఎప్పటికప్పుడు జరిగే వెబినార్ల వివరాలు ఇక్కడ ఉంచుతాం. మీరు రెండు మార్గాల్లో ఈ వివరాలు పొందవచ్చు - టెక్ సేతు ఫీడ్ ని అనుసరించండి లేదా ఇక్కడ ఉన్న క్యాలెండర్ ని అనుసరించండి.
౨. వెబినార్ లో పాల్గొనడం కోసం స్కైప్ స్థాపించుకోండి. వెబినార్ జరిగే సమయానికి ముందు వక్త కి మీ స్కైప్ ఐడి పంపండి (వక్త వివరాలు క్యాలెండరు లేదా టెక్ సేతు లంకె లో తెలియజేయబడతాయి).
౩. వెబినార్ల పై జరిగే చర్చల్లో భాగం పంచుకోవాలంటే
కి మీ ఆసక్తి తెలుపుతూ మెయిల్ చేయండి. మీ అభ్యర్ధనను ఆమోదించిన పిమ్మట,
కి మీ సందేశాలు పంపించవచ్చు. ఆ గుంపుకి పంపబడే సందేశాలు మీకు కూడా వస్తాయి.
మీరు నేర్పించాలి అనుకుంటే:
౧. వెబినార్లు ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి ముందు ఒకటి, రెండు సార్లు పాల్గొనండి (ఎలాగో పైన చూడండి).
౨. మీరు ఏయే అంశాలు చెప్పగలరో వివరిస్తూ, మీ గురించి కూడా తెలియజేస్తూ మాకు
కి ఒక లేఖ రాయండి.
౩. వెబినార్ల పై జరిగే చర్చల్లో భాగం పంచుకోవాలంటే
కి మీ ఆసక్తి తెలుపుతూ మెయిల్ చేయండి. మీ అభ్యర్ధనను ఆమోదించిన పిమ్మట,
కి మీ సందేశాలు పంపించవచ్చు. ఆ గుంపుకి పంపబడే సందేశాలు మీకు కూడా వస్తాయి.


వ్యాఖ్యలు
కొత్త వ్యాఖ్య వ్రాయి